- Home
- Entertainment
- Sanjjana: ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ హైడ్రామా.. తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ సాహసం.. లత్కోర్ పనులకు వార్నింగ్
Sanjjana: ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ హైడ్రామా.. తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ సాహసం.. లత్కోర్ పనులకు వార్నింగ్
Sanjjana Galrani: బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం శనివారం ఎపిసోడ్‌లో సంజనా ఎలిమినేషన్‌కి సంబంధించి బిగ్ బాస్ హైడ్రామా తేలిపోయింది. నలుగురు కంటెస్టెంట్ల త్యాగంతో ఆమె మళ్లీ హౌజ్ లోకి అడుగుపెట్టింది.

సంజనా ఎలిమినేషన్‌లో హైడ్రామా
బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారంలో ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకుంటున్నాయి. అంతకు మించిన హైడ్రామా కొనసాగుతుంది. ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ డ్రామా ప్లే చేశాడు. అందరికి షాకిచ్చాడు. అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు, ఇక అయిపోయిందనిపించాడు, చివరికి ఊరించాడు, నలుగురుని త్యాగానికి రెడీ చేసి చివరికి తుస్సుమనిపించాడు. మూడో వారంలో సంజనాని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిన విషయం తెలిసిందే. కామనర్ దివ్యకి ఛాన్స్ ఇచ్చి, ఆమె స్థానంలో సంజనాని ఎలిమినేట్ చేశారు. హౌజ్‌మేట్ అభిప్రాయం మేరకు బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆమెని ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పి సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. తాజాగా శనివారం ఎపిసోడ్‌లో సంజనాని స్టేజ్‌మీదకు తీసుకొచ్చి గుడ్ బై చెప్పించారు. కంటెస్టెంట్ల గురించి చెప్పించారు. ఇక గుడ్ బై అని చెబుతూ, చివరికి ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. సంజనా ఎలిమినేట్ కాకుండా హౌజ్‌లోకి వచ్చేందుకు ఛాన్స్ ఉందని, బిగ్ బాస్ అవకాశం కల్పిస్తున్నారని, హౌజ్‌లోని నలుగురు కంటెస్టెంట్లు తమకి ఇష్టమైనవి త్యాగానికి పాల్పడితే సంజనా హౌజ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
మళ్లీ హౌజ్‌లోకి సంజనా, ఇమ్మాన్యుయెల్ ఎమోషనల్
బిగ్ బాస్ నలుగురు కంటెస్టెంట్లని ఎంపిక చేశారు. ఇమ్మాన్యుయెల్ కెప్టెన్సీ త్యాగం చేయాల్సి ఉంది. ఈ విషయం చెప్పగానే ఇమ్మూ ఓకే చెప్పాడు. అంతకు ముందే ఇమ్మాన్యుయెల్ గురించి గొప్పగా చెప్పింది సంజనా, విన్నర్‌గా చూడాలని తెలిపింది. తనకు సంజనా అమ్మలా అనిపించిందని, మా అమ్మని మరిపించిందని తెలిపారు ఇమ్మాన్యుయెల్. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె మళ్లీ హౌజ్‌లోకి రావాలంటే కెప్టెన్సీ త్యాగం చేయాలని చెప్పగా వెంటనే బ్యాడ్జ్ తీశాడు. ఆ తర్వాత తనూజ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు కాఫీ తాగకూడదని చెప్పగా, కాస్త ఇబ్బంది పడుతూనే ఓకే చెప్పింది. దీంతో సంజనా రావడానికి 50 శాతం బ్యాటరీ ఫిల్ అయ్యింది. అనంతరం శ్రీజ తన డ్రెస్సులను త్యాగం చేయాలని అడగ్గా, ఆమె నో చెప్పింది. అనంతరం రీతూ చౌదరీ తన జుట్టుని కత్తించుకోవాలని చెప్పగా, బలవంతంగానే ఏడుస్తూనే జుట్టుని త్యాగం చేసింది. దీంతో 75శాతం బ్యాటరీ పెరిగింది. కానీ వంద శాతం బ్యాటరీ ఫిల్ అయితేనే సంజనా హౌజ్‌లోకి వస్తుంది. ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి సిగరేట్ మానేయాలని చెప్పగా ఆయన నో చెప్పాడు. ఇక భరణిని తన లాకెట్‌ని త్యాగం చేయాలని చెప్పగా మరో ఆలోచన లేకుండా త్యాగం చేశాడు. కానీ షో ప్రారంభలో ఆ లాకెట్ కోసం షోనే వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇప్పుడు సంజనా కోసం ఆయన ఈ త్యాగం చేయడం విశేషం. ఇలా మొత్తంగా నలుగురు త్యాగం కారణంగా సంజనా మళ్లీ హౌజ్‌లోకి వచ్చింది.
లత్కోర్ హరీష్ అంటే ఓకేనా?
సంజనా ఎట్టకేలకు హౌజ్‌లోకి వచ్చింది. ఆ సమయంలో హరిత హరీష్.. సుమన్ శెట్టితో మాట్లాడుతూ, ఎందుకు నటిస్తున్నారో అర్థం కావడం లేదు, వీరంతా ఫేక్ పీపుల్ అంటూ కామెంట్ చేశారు. మంచి వాళ్లుగా ప్రొజెక్ట్ కావడం కోసం నటిస్తున్నట్టుగా హరీష్ కామెంట్ చేశారు. దానికి సుమన్ శెట్టి కూడా మద్దతు పలికారు. ఇమ్మాన్యుయెల్ కెప్టెన్సీని త్యాగం చేసిన విషయాన్ని తప్పుపట్టారు. ఇంకా ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ చేయనని తెలిపారు. ఇంతలో ఉండగా నాగార్జున వచ్చారు. ఈ వారం ఎవరెవరు ఏం తప్పులు చేశారో తెల్చడం స్టార్ట్ చేశారు. హరీష్ `లత్కోర్ పనులు `అనడాన్ని తప్పుపట్టారు నాగార్జున. గేమ్ విషయంలో పవన్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది జనరల్‌గా వాడుతుంటామని, ఎవరినీ ఉద్దేశించిన కాదని, ఆ పనులకు సంబంధించి వాడిన పదం అని హరీష్ సమర్థించారు. కానీ ఇలాటి పదాలు ఎలా వాడుతారని, లత్కోర్ హరీష్ అంటే ఓకే అని ప్రశ్నించాడు నాగ్. కాసేపు వాదించిన ఆయన ఇకపై వాడను అన్నారు హరీష్. అలాంటి పదాలు వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు నాగ్. దానికి బదులుగా డిగ్నిటీగా ఉండే పదాలు వాడాలని తెలిపారు.
నిగ్గు తేల్చేసిన నాగార్జున
ఇక కెప్టెన్సీ సమయంలో సంచాలక్‌గా ఉన్న శ్రీజ చేసిన తప్పుని ప్రశ్నించారు నాగార్జున. ఆమె ఎలాంటి మిస్టేక్ చేసిందో వీడియోవేసి మరీ చూపించారు. బజర్‌ని ముందు ఎవరు కొట్టారనేది నీ నిర్ణయం వెల్లడించాలని, ఇతరుల నిర్ణయాన్ని ఎలా ఫాలో అవుతావని ప్రశ్నించాడు. ఇక రీతూ చౌదరీ ఇటీవల ప్రతిదానికి ఏడుస్తుంది. దీంతో ఎందుకు ఏడుస్తున్నావంటూ నిలదీశాడు నాగార్జున. స్ట్రాంగ్‌గా ఉండాలని, ప్రతి దానికి ఏడవొద్దని, తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, ధైర్యంగా గేమ్ ఆడాలని తెలిపారు. అదే సమయంలో కళ్యాణ్‌ని కూడా హెచ్చరించాడు నాగ్. కూర్చొని ముచ్చట్లు తప్ప మరేమీ చేయడం లేదని, కెమెరాకి కనిపించాలని, గేమ్ ఆడాలని, ఎంటర్‌టైన్ చేయాలని తెలిపారు. కనిపించకపోతే ఈ సారి స్టేజ్ మీదకు వస్తావని తెలిపారు. వీరితోపాటు తనూజ, ప్రియాలు చేసిన మిస్టేక్స్ కూడా చెప్పారు. ఈ క్రమంలో తనూజ నాగార్జున ముందు దొరికిపోయింది. తాను బాత్ రూమ్‌లో దాచుకున్న కాఫీ ఫౌడర్‌ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.
మూడో వారి ఎలిమినేషన్ ప్రియా
మరోసారి హరిత హరీష్ దొరికిపోయారు. నీ కోసం స్టాండ్ తీసుకునే వారు లేరని తెలిపారు నాగార్జున. నీ కోసం నిలబడేవారు హౌజ్‌లో సంపాదించుకోవాలని నాగార్జున చెప్పగా, తనకు అవసరం లేదన్నారు. అయితే ఆడియెన్స్ మనసులను గెలవాలని చెప్పగా దానికి అగ్రీ అయ్యారు హరీష్. ఆయన విషయంలో ఆడియెన్స్ కూడా నెగటివ్ ఓపీనియన్‌తో ఉండటం గమనార్హం. ఇక ఎలిమినేషన్‌కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు నాగార్జున. ఈ వారం ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. హరీష్, ఫ్లోరా, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ప్రియాలు, రీతూ చౌదరీలు నామినేషన్‌లో ఉండగా, ప్రియాకి తక్కువగా ఓటింగ్ వచ్చింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని అంతా భావించినా, సంజనాకి మరో ఛాన్స్ ఇవ్వడం విశేషం.