- Home
- Entertainment
- Mohanbabu: మోహన్ బాబు మొదటిసారి విలన్‌గా నటించిన మూవీ ఏదో తెలుసా? తిరిగి తిరిగి మొదటికొచ్చిన కలెక్షన్ కింగ్
Mohanbabu: మోహన్ బాబు మొదటిసారి విలన్‌గా నటించిన మూవీ ఏదో తెలుసా? తిరిగి తిరిగి మొదటికొచ్చిన కలెక్షన్ కింగ్
Mohanbabu: మోహన్ బాబు తాజాగా నాని హీరోగా రూపొందుతున్న `పారడైజ్` మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. మరి ఆయన మొదటిసారి విలన్‌గా చేసిన మూవీ ఏంటో తెలుసుకుందాం.

విలన్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన మోహన్ బాబు
మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్‌గా టాలీవుడ్‌లో రాణించారు. కానీ అంతకు మించి ఆయన విలక్షణ నటుడిగా అలరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన దాదాపు ఐదు దశాబ్దాలుగా రాణిస్తున్నారు. విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. మెప్పించారు. మధ్యలో మళ్లీ విలన్‌గా నటించారు. మళ్లీ హీరోగా చేశారు. ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అటు నెగటివ్ షేడ్స్ ఉన్నరోల్స్ చేస్తున్నారు. మరోవైపు స్ట్రాంగ్ రోల్స్ లోనూ మెప్పిస్తున్నారు. మోహన్ బాబు చివరగా `కన్నప్ప` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత. భక్త కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహదేవ శాస్త్రిగా కనిపించారు మోహన్ బాబు. కీలక పాత్రలో కాసేపు కనిపించి అలరించారు.
`పారడైజ్`లో శికంజ మాలిక్‌గా మోహన్ బాబు
ఇక ఇప్పుడు విలన్‌గా టర్న్ తీసుకున్నారు. హీరోగా సినిమాలు తగ్గించిన తర్వాత `గేమ్`, `యమదొంగ`, `బుజ్జిగాడు`, `రాజు మహరాజ్` వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ చేశారు. అయితే ఆయన పూర్తి స్థాయి విలన్‌గా నటించి చాలా కాలమే అవుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గా టర్న్ తీసుకున్నారు. తాజాగా నాని హీరోగా రూపొందుతున్న `పారడైజ్` చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రని పరిచయం చేశారు. శికంజ మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఇందులోని ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయగా, షర్ట్ లేకుండా కనిపించారు.73ఏళ్ల వయసులో మోహన్ బాబు ఇలా షర్ట్ లేకుండా కనిపించడం, అయినా చాలా ఫిట్‌గా ఉండటం విశేషం. చైర్‌లో కూర్చొని చుట్టా తాగుతూ, మరో చేతిలో కత్తి పట్టుకుని ఊర మాస్‌గా ఉన్నారు మోహన్ బాబు. గతంలో ఎప్పుడూ ఆయన్ని ఇలా చూసి ఉండరు. చూడబోతుంటే చాలా పవర్‌ఫుల్‌గా ఆయన పాత్ర ఉండబోతుందని అర్థమవుతుంది. అదే సమయంలో చాలా క్రూరంగానూ ఉండబోతుందని తెలుస్తోంది.
నయా లుక్‌లో విలన్‌గా అదరగొడుతున్న మోహన్ బాబు
దీంతోపాటు ఈ మూవీ నుంచి మోహన్ బాబు మరో లుక్ వచ్చింది. ఇందులో రెట్రో లుక్‌లో ఉన్నారు. చేతిలో గన్ పట్టుకుని చుట్ట తాగుతూ వస్తున్నారు. వెనకాల లగ్జరీ కారు ఉంది. వెనకాల అంతా తగలబడుతుంది. ఆయన లుక్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మొత్తంగా మోహన్ బాబులోని మరో కోణాన్ని ఇందులో చూడబోతున్నారని అర్థమవుతుంది. అదే సమయంలో మోహన్ బాబు విలనిజాన్ని ఈ తరం చూడలేదు. అది ఎలా ఉంటుందో ఇప్పటి ఆడియెన్స్ కి చూపించబోతున్నారు శ్రీకాంత్ ఓడెల. `ఈ పాత్ర విన్న వెంటనే మోహన్‌బాబుని అద్భుతంగా ఆకట్టుకుంది, వెంటనే అంగీకరించారు. తన కోసం రాసిన పాత్ర విన్న తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అభిమానిగా మారిపోయారు. ఆయన లుక్ సినిమా థీమ్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. ఆయన ఐకానిక్ చారిస్మాను మరింత హైలైట్ చేస్తోంది. పవర్, ఇంటెన్సిటీ, స్టైల్‌తో క్రాఫ్ట్ చేసిన ఈ పాత్రలో మోహన్‌బాబు ప్రత్యేకతైన పంచ్ డైలాగ్స్, మానరిజమ్స్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండబోతున్నాయి. ‘డైలాగ్ కింగ్’ ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన మెస్మరైజ్ చేయబోతున్నార`ని టీమ్ తెలిపింది.
మోహన్ బాబు కెరీర్ బిగినింగ్
ఇదిలా ఉంటే మోహన్ బాబు విలన్‌గానే కెరీర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు వెండితెరకు పరిచయమైని సినిమా `అల్లూరి సీతారామరాజు`. ఇందులో గుర్తింపులేని పాత్ర. అంతగా ఎవరూ నోటీస్ చేయలేదు. ఆ తర్వాత `కన్నవారి కళలు` చిత్రంలో మెరిశారు. ఇందులోనూ మోహన్ బాబుకి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు నటించి, దర్శకత్వం వహించిన `స్వర్గం నరకం` చిత్రం ఆయనకు బ్రేక్ వచ్చింది. ఇందులో కీలక పాత్రలో మెరిశారు మోహన్ బాబు. అందరికి నోటీస్ అయ్యారు. అయితే ఇందులో మోహన్ బాబుది నెగటివ్ రోల్ అనే ప్రచారం ఉంది. కానీ ఆయనది మరీ నెగటివ్ రోల్ కాదు, జస్ట్ జెలసీగా, ప్లేబాయ్‌గా కనిపిస్తాడు. చివరికి ఆయన పాత్ర పాజిటివ్‌గానే ఉంటుంది.
`భలే దొంగలు`లో విలన్‌గా రచ్చ చేసిన మోహన్ బాబు
మోహన్‌బాబు పూర్తి స్థాయి విలన్ రోల్ చేసింది మాత్రం `భలే దొంగలు` మూవీ.1976లో విడుదలైన చిత్రమిది. కేఎస్‌ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ కృష్ణ హీరో. యాక్షన్ డ్రామాగా ఇది రూపొందింది. ఇందులో కృష్ణతోపాటు మంజుల, ప్రభాకర్, పద్మనాభం, నాగభూషణం వంటి వారు నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఇందులో రంగా అనే పాత్రలో విలన్‌గా కనిపించారు మోహన్‌బాబు. సూపర్ స్టార్ కృష్ణతో గొడవ పడే పాత్ర. చాలా బలంగా ఉంటుంది. ఈ చిత్రంతోనే మోహన్ బాబు కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇలా పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేశారు. విలన్‌గా మెప్పించారు. విలనిజంతోపాటు కీలక పాత్రల్లోనూ కనిపిస్తూ అలరించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ లీడ్‌గా, అట్నుంచి హీరోగా టర్న్ తీసుకుని మెప్పించాడు. కలెక్షన్ కింగ్‌గా ఎదిగారు. విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు మోహన్ బాబు. ఇప్పుడు ఆయన విలన్‌గా మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.