MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ అరెస్ట్ కు డిమాండ్... 'రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2 ని అడ్డుకుంటాం'.

అల్లు అర్జున్ అరెస్ట్ కు డిమాండ్... 'రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2 ని అడ్డుకుంటాం'.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలపై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 05 2024, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI

పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని.. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.

అయితే  అల్లు అర్జున్ పై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన బక్క జడ్సన్.. జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని కోరారు. మరో ప్రక్క ఈ ఇష్యూలోకి  పీ.డీ.ఎస్.యూ. ఎంట్రీ ఇచ్చింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తాజాగా ఓ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు.. ఆమె కొడుకు చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.

ఇప్పటికే సినిమా టిక్కెట్ రేట్లను రూ.3 వేలకు వరకూ పెంచి.. పేద, మధ్య తరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులు గుల్ల చేశారని అన్నారు. సినిమా వినోదాలను పంచేదిగా ఉండాలి కానీ.. విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. అర్ధరాత్రి సినిమా హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారంటూ ప్రశ్నించారు! 
 

35


ఇదిలా ఉంటే  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్  దగ్గర ఉద్రిక్తత నెలొకొంది.  పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.

 బాధిత  కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్  కేసు నమోదు చేయాలన్నారు. ప్రీమియర్ షోకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన  అల్లు అర్జున్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. 

45
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


 రాత్రి నుంచి పుష్ప 2 బెనిఫిట్ షోలు మొదలవగా షో చూడడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.  హైదరాబాదులో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ కూడా సినిమా చూడడానికి వచ్చిన విషయం తెలిసిందే.  అయితే తమ అభిమాన హీరోని చూడాలనుకున్న అభిమానుల మధ్య  పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.

ఈ నేపథ్యంలోనే 39 సంవత్సరాల వయసున్న రేవతి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. 
 

55
Allu Arjun, #Pushpa2, sukumar

Allu Arjun, #Pushpa2, sukumar


సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే యువతి మరణించింది.  దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కూడా కోరారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved