- Home
- Entertainment
- Sandeep Vanga: అర్జున్ రెడ్డిలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంక్వైరీ చేసి వద్దనుకున్నా
Sandeep Vanga: అర్జున్ రెడ్డిలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంక్వైరీ చేసి వద్దనుకున్నా
Sandeep Reddy Vanga : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Sandeep Reddy Vanga, Sai Pallavi
Sandeep Reddy Vanga and Sai Pallavi : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. అదే విధంగా నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ ముండేటి, అల్లు అరవింద్, బన్నీ వాసు ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. దిల్ రాజు కూడా అతిథిగా హాజరై తండేల్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Thandel Movie
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులని చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ఇష్టపడతాం. కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం. ఇక సాయి పల్లవి గురించి చెప్పాలంటే.. నా అర్జున్ రెడ్డి చిత్రంలోనే ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నా. మలయాళంలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక కో ఆర్డినేటర్ ని అడిగా. ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
Naga Chaitanya
కొంతమంది హీరోయిన్లు పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో ఒకలా ఉండి ఆ తర్వాత మారిపోతారు. కానీ సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అని సందీప్ రెడ్డి ప్రశంసించారు.