- Home
- Entertainment
- Major Movie: మేజర్ మూవీ చూసి సందీప్ తల్లిదండ్రులు కంటతడి.. ఓవైపు గర్వం, మరోవైపు దుఃఖం
Major Movie: మేజర్ మూవీ చూసి సందీప్ తల్లిదండ్రులు కంటతడి.. ఓవైపు గర్వం, మరోవైపు దుఃఖం
వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేజర్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేజర్ మూవీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటోంది. ఈ చిత్రానికి యునానిమస్ గా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా అడివి శేష్ అండ్ టీం.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు ఈ చిత్ర స్పెషల్ షో ప్రదర్శించారు.
సందీప్ జీవిత చరిత్ర, 26/11 ముంబై దాడుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మేజర్ మూవీ చూసిన అనంతరం సందీప్ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ మీడియాతో మాట్లాడారు.
బరువెక్కిన హృదయంతో దుఃఖాన్ని ఆపుకుంటూనే తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడారు. పక్కనే ఉన్న సందీప్ తల్లి కంటతడి పెట్టుకుంటూ భావోద్వేగానికి గురైంది. సందీప్ తండ్రి మాట్లాడుతూ.. మేజర్ మూవీ చాలా బావుంది. సందీప్ జీవితాన్ని ప్రతిభింబించేలా చూపించారు. కెమెరా వర్క్, నటీనటుల నటన, దర్శకత్వం చాలా బావుంది, బాయ్స్ అంతా కలసి మేజర్ చిత్రాన్నిఆవిష్కరించారు.
మా భాదని తొలగించేలా చేశారు. సందీప్ మరణించాడు అని చాలా మంది అంటున్నారు. కానీ సుందీప్ తుది శ్వాస వరకు వృత్తిలో ఉంటూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం కోసం మేజర్ టీం మా ఇంట్లో ఫొటోస్ అన్ని సేకరించారు. వాటిని సినిమాలో చూపించిన విధానం చాలా బావుంది.
నా కెరీర్ నేను హైదరాబాద్ లోనే ప్రారంభించాను. నేను సందీప్, మా ఫ్యామిలీ కొంతకాలం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళి హైదరాబాద్ కి వచ్చాను. మళ్ళీ మళ్ళీ వస్తుంటాను అని సందీప్ తండ్రి అన్నారు.