MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసహ్యమైన పనులు చేయించాడు, భర్తపై బుల్లితెర నటి సంయుక్త సంచలన ఆరోపణలు, పెళ్ళైన 2నెలలకే విడాకులు

అసహ్యమైన పనులు చేయించాడు, భర్తపై బుల్లితెర నటి సంయుక్త సంచలన ఆరోపణలు, పెళ్ళైన 2నెలలకే విడాకులు

ఇలా పెళ్ళి చేసుకున్నారు.. అలా విడాకలు తీసుకున్నారు. తమిళ బుల్లితెర జంట విచిత్రమైన కథ ఇది. ఇన్నాళ్ళు ప్రేమలో ఉండి తెలిసుకోలేని నిజాలు.. పెళ్లి తరువాత తన భర్త లో చూశానంటోంది సంయుక్త.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 04 2023, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. కామన్ ఆతరువాత అది ప్రేమ కాదు ఆకర్షణ అని తెలిసి విడిపోయేవారు చాలా మంది ఉన్నారు. కాని తమ బంధాన్ని బలంగా మార్చుకుంటూ.. సాగిపోయేవారు ఉన్నారు. వీరు కాకుండా.. ప్రేమలో బాగానే ఉంది.. పెళ్లి  తర్వాత  ఓకరికోకరునచ్చక వెంటనే విడాకులకు వెళ్ళే వారు మాత్రం అరుదుగా ఉంటారు. అది కూడా పెళ్లైన 2 నెలలకే. ప్రస్తుతం ఓ తమిళ సెలబ్రిటీ జంట ఆపరిస్థితినే ఎదుర్కొంటోంది. 

28

 సాధారణంగా పెళ్లైన ఏడాదికో.. నాలుగైదేళ్లకో విడాకులు తీసుకుంటే పెద్ద విచిత్రంగా ఉండదు కాని.. పెళ్లైన 2 నెలలకే విడాకులంటే మాత్రం అది చాలా పెద్ద చిత్రం విచిత్రం. అది కూడా ప్రేమించి పెళ్లాడిన జంట విడిపోవడం అంటే అది ఇంకా చిత్రమనుకోవాలి.  కోలీవుడ్ లో సంయుక్త విష్ణుకాంత్ జంట చాలా అందంగా ఉంటారు.  ప్రేమించుకున్నంత వరకూ.. వీరు  బ్యూటిఫుల్ కపుల్ గానే ఉన్నారు. 

38

కాని పెళ్ళి తరువాతే వీరి అసలు కథ మొదలయ్యింది. తమిళంలో  సిప్పినీల్ ముత్తు సీరియల్ లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య ముందు స్నేమం మొదలై ఆతరువాత అది  ప్రేమగా మారింది. ఈ ఏడాది మార్చి 3న తమ ప్రేమ బంధాన్నిపెళ్లి బంధంగా మార్చుకున్నారు ఈజంట. పెద్దలను ఒప్పించి చాలా  ఘనంగా పెళ్లి చేసుకున్నారు. 
 

48

అయితే విచిత్రంగా.. పెళ్లైన 2 నెలలకే ఈ జంట తాము విడిపోతున్నట్లుగా ప్రకటించి ఫ్యాన్స్ కు షాకిచ్చారు.బ్యూటిఫుల్ కపుల్ అని మెచ్చుకునేలోపే.. వీరి విడిపోతున్నారని తెలిసి.. బుల్లితెర అభిమానులు తెగ బాధపడుతున్నారు. అయితే అంత ఆషామాషీతా వీరు విడిపోవడంలేదు.. సంచలన ఆరోపణలతో ఒకరిని మరొకరు విమర్షించుకుంటూ విడాకులు తీసుకోబోతున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు మరింత సంచలనంగా మారుతున్నాయి. 

58

తాజాగా వీరిద్దరు తమ సోషల్ మీడియా పేజ్ లలో తమ పెళ్లి ఫోటోల్ని తొలగించారు. అంతే కాదు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ సందర్భంగా విష్ణుకాంత్ పోస్టు పెడుతూ.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి' అని పేర్కొన్నారు. దీనికి బదులుగా అన్నట్లు సంయుక్త సైతం స్పందించింది. 'కొత్త జీవితానికి ప్రారంభం.. ఇకపై మరింత బలంగా ముందుకు వెళతా' అని పేర్కొంది. 

68

అయితే ఈ మాటర్ ఇక్కడితో ఆగితే బాగుండేది కాని వెంటనే విష్ణుకాత్ అందుకున్నారు. ఆరోపణలకు పదును పెంచారు. ఇంకాస్త వేడి పెంచారు. సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్ తో టచ్ లో ఉందన్న భావన కలిగేలా ఒక ఆడియో క్లిప్ ను పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. దాంతో సయుక్త పరువు సోషల్ మీడియాలో పోయింది. ఇందుకే తాను విడాకులుతీసుకుంటున్నాను అని.. తాను మాత్రం జంటిల్మెన్ అన్నట్టు కలరింగి ఇచ్చే ప్రయత్నం చేశాడు విష్ణు. 

78

అటు సంయుక్త కూడా విష్ణుపై ఘాటుగానే విమర్షలు కురిపించింది. తనను శారీరికంగా హింసించాడని.. అడల్ట్ వీడియోలు చూపించి అలా చేద్దామనేవాడని.. బెడ్ రూమ్ లో కెమెరా పెట్టేవాడని.. తాను వ్యాతిరేకిస్తే గొడవలు పెట్టుకునేవాడు అన్నారు. కనీసం తనకు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ కు కూడా  వెళ్లనివ్వలేదన్నారు సంయుక్త. 
 

88

ఈ ఆరోపణలు విష్ణుకాంత్ కొట్టిపారేశారు. తను నాపై కక్ష్యకట్టిందని.. తాను శారీరికంగా హింసిస్తే.. చూసుకోవచ్చని.. ఆమె ఆరోగ్యంగా ఉందని.. తనతనప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం..నాపై ఇన్ని నిందలు వేస్తోందంటూ వాపోయారు విష్ణుకాంత్. ప్రస్తుతం వీరి వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved