Intinti gruhalakshmi: తులసి వల్ల గెలిచిన హనీ.. నందును పనోడు అని పిలిచిన అనసూయ!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జులై 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలోనే... తులసి డాన్స్ టీచర్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఎంతకీ కనపడకపోయేసరికి ఆ విషయం సామ్రాట్ (హనీ వాళ్ళ నాన్న) కి చెబుతుంది. ఇద్దరూ కలిసి డాన్స్ టీచర్ కోసం వెతుకుతారు. ఆ టీచర్ దొరకకపోతే హనీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆగిపోతుంది అని చెప్పి సామ్రాట్ చాలా కంగారు పడతాడు. డాన్స్ టీచర్ ని వెతకడానికి స్కూల్ బయటకు వెళతాడు సామ్రాట్. తులసి, హనీ దగ్గరికి వెళుతుంది. అక్కడ హనీ ఒక్కత్తే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది.
సామ్రాట్ డాన్స్ టీచర్ కోసం బయట అంతా వెతుకుతాడు. ఎంతకీ దొరకకపోయేసరికి వాచ్ మెన్ ని అడిగితే, వాచ్మెన్ "ఆ మేడం చాలాసేపటి ముందే బయటకు వెళ్లిపోయారు" అని చెప్తాడు.సామ్రాట్ కి చాలా కోపం వస్తుంది .హనీ చాలా ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు తను గెలవడం ఎలాగా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో యాంకర్, హనీని డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం స్టేజ్ మీదకు పిలుస్తుంది. అందరూ హనీ! హనీ! అని ఉత్సాహపరుస్తారు.
ఇంక చేసేదేమీ లేక తులసి జడ్జెస్ తో మాట్లాడుతాది. హనీ కంగారుగా ఏమైంది అని చెప్పి తులసిని అడుగుతాది. అప్పుడు తులసి "ఏమీ లేదు నువ్వు వెళ్లి నీ డాన్స్ మొదలుపెట్టు" అని చెప్పి తన డాన్స్ మొదలుపెట్టిస్తాది. అందరూ హనీ! హనీ! అనడంతో సామ్రాట్ లోపలికి వచ్చి చూస్తాడు.అక్కడ హనీ ఒక్కతే డాన్స్ వేస్తూ ఉంటాది. టీచర్ లేకుండా ఎలా చేస్తుంది?అని సామ్రాట్ చాలా భయపడుతూ ఉంటాడు.
అదే సమయంలో తులసి డాన్స్ టీచర్ స్థానంలో వచ్చి డాన్స్ చేస్తుంది. సామ్రాట్ తో పాటు లాస్య,నందులు కూడా ఆశ్చర్యపోతారు. సామ్రాట్ చాలా ఆనంద పడతాడు. హనీ ,తులసి ఇద్దరూ కలిసే డాన్స్ ని పూర్తి చేస్తారు. అందరూ చప్పట్లతో వారిని మెచ్చుకుంటారు. డాన్స్ పూర్తయిన తర్వాత సామ్రాట్, వాళ్ళ కూతుర్ని పట్టుకొని ఎత్తుకొని సంబరపడిపోతాడు. కాంపిటేషన్ అంతా పూర్తవుతుంది. అందరూ ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు.
యాంకర్ ఆ ఫలితాల కాగితాన్ని పట్టుకొని టాప్ 2లో వచ్చిన వాళ్ళని ప్రకటిస్తాను,వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత విన్నర్ ఎవరో ప్రకటిస్తాను అని చెబుతుంది. అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. యాంకర్, మొదటి రెండు స్థానాలు లక్కీ,హనీ గెలుచుకున్నారు అని చెబుతుంది. వాళ్ళని స్టేజ్ మీదకి రావాలని కోరుతుంది. యాంకర్ ఇద్దరి చేతుల్ని పట్టుకొని పది అంకెలు లెక్కపెట్టిన తర్వాత ఇద్దరి చేతులు పైకి ఎత్తి ఈ కాంపిటీషన్లో ఇద్దరూ గెలిచారు అని చెబుతుంది.
లాస్య,హనీ కూడా గెలిచినందుకు చాలా కుళ్ళుకుంతాది.ఈలోగా ఒక పేరెంట్ వచ్చి హనీ తో డాన్స్ చేసిన ఆవిడ టీచర్ కాదు కదా మరి తనకి ఎలా బహుమతి ఇస్తారు? అని అడగగా జడ్జ్ "తను సంగీతం టీచర్ , పైగా హనీకి డాన్స్ నేర్పించింది కూడా తానే కనుక అదేం పెద్ద సమస్య కాదు. హనీతో డాన్స్ చేయాల్సిన టీచర్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన కారణంగా ,తులసి గారు మా దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగారు కనుక మేము ఒప్పుకున్నాము" అని జడ్జ్ చెబుతాడు.
పిల్లలు ఇద్దరితోపాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా స్టేజ్ మీదకు పిలుస్తారు .అప్పుడు హనీ,తులసి ఆంటీ కూడా స్టేజ్ మీదకి రావాలి అని కోరుతుంది. జడ్జ్ ఇద్దరికీ బహుమతిని అందిస్తారు అందరూ ఆనందంతో చపట్లు కొడతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!