- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: శృతితో తులసిని ఇష్టపడుతున్నానని చెప్పిన సామ్రాట్.. నానా రచ్చ చేసిన అభి?
Intinti Gruhalakshmi: శృతితో తులసిని ఇష్టపడుతున్నానని చెప్పిన సామ్రాట్.. నానా రచ్చ చేసిన అభి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో తులసి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వగా వెంటనే విలేకర్ ఆ మగాడు ఎవరో తెలుసుకోవచ్చా మేడం అనడంతో నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి కూడా చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో నందు లాస్య ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు తులసి,సామ్రాట్ గొప్పతనం గురించి సామ్రాట్ తనకు చేసిన సహాయం గురించి మాట్లాడుతుంది.
అప్పుడు లాస్య కావాలని వారిద్దరిని చూసి రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే సామ్రాట్ ఒంటరిగా నిలబడడంతో అక్కడికి శృతి వెళ్లి పలకరిస్తుంది. అప్పుడు శృతి మీరు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని మా ఆంటీకి మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఇప్పుడు సామ్రాట్ మాట మార్చి మాట్లాడడంతో వెంటనే శృతి డైరెక్ట్ గా అడుగుతున్నాను అంటూ మీరు మా ఆంటీ ని ఇష్టపడుతున్నారా అని అడుగుతుంది. ఇప్పుడు వెంటనే సామ్రాట్ అవును నేను తులసి గారిని ఇష్టపడుతున్నాను అని అంటాడు.
అప్పుడు సామ్రాట్ తులసి గారి పట్టుదలను ఇష్టపడుతున్నాను అనడంతో శృతి ఊపిరి పీల్చుకుంటుంది. మరొకవైపు మీడియా ముందు తులసి స్పీచ్ ఇస్తుండడం చూసి నందు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత తులసీని చూసి కుటుంబం అందరూ పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత మీడియా వారు భోజనం చేస్తూ తులసి గురించి తప్పుగా మాట్లాడడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఆ తర్వాత అందరూ కలిసి భూమి పూజ చేస్తూ ఉంటారు. తులసి,సామ్రాట్ ఇద్దరూ కలిసి పూజ చేస్తున్నాడంతో అది చూసి నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ కలసి హోమం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు అది చూసి కుటుంబ సభ్యులు అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు లాస్య వారిద్దరిని చూసి కోపంతో రగిలిపోతు నందుని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
అప్పుడు పూజారి చేతిలో ఉన్న ఆ పేపర్ ఎగిరిపోయి నందు షర్ట్ కి పడుతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత పూజ ముగుస్తుంది. ఇంతలోనే అభి ఆవేశంతో అక్కడికి వస్తాడు. అప్పుడు పూజారి ఒక విధంగా చెప్పాలి అంతే వ్యాపార భాగ్యస్వామ్యం భార్యాభర్తల బంధం లాంటిది అని చెప్పడంతో అభి అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తాడు. ఏం చెప్పారు పంతులుగారు మీరు చెప్పిన ఆ మాట ఏ గ్రంథంలో ఉందో చెప్పండి అని అనడంతో వెంటనే పరంధామయ్య అభి నువ్వు ఇక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు అని కోప్పడతాడు. కానీఅభి మాత్రం మా అమ్మ కి కొడుకుగా వచ్చాను అంటూ రెచ్చిపోతూ ఉంటాడు.