- Home
- Entertainment
- బ్రెస్ట్ కి 'బూబ్ జాబ్ సర్జరీ' చేయించుకోమని ఫోర్స్ చేశారు.. సంచలన విషయం బయటపెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
బ్రెస్ట్ కి 'బూబ్ జాబ్ సర్జరీ' చేయించుకోమని ఫోర్స్ చేశారు.. సంచలన విషయం బయటపెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
నాకు సహజంగా ఉండటమే ఇష్టం. నేను ఎలా ఉన్నానో అలాగే ఏక్సెప్ట్ చేయమనే దాన్ని అది చాలా మందికి నచ్చేది కాదు. కానీ నేను ఏం చెయ్యగలను చెప్పండి అని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా వెలగటం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం శారీరకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా చాలా సౌండ్ గా ఉండాలి. ఏ మాత్రం బాలెన్స్ తప్పినా మొత్తం కొలాప్స్ అవుతుంది. అలాగే స్టార్ డైరక్టర్స్, నిర్మాతలు చాలా సలహాలు ఇస్తూంటారు. వాటిలో కొన్ని ఇబ్బంది పెట్టేవి ఉంటాయి. అవన్నీ తట్టుకోగలిగి నెగ్గుకురావాలి. అలాంటి కొన్ని సమస్యలు తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఎదుర్కొన్నా అంటోంది సమీరారెడ్డి.
సమీరారెడ్డి. తెలుగువారికి ఆమె పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు,తమిళం లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఈమె. ఆ తర్వాత కాలంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉంది. రీఎంట్రీలో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్న సమీరా రెడ్డి గతాన్నితవ్వుకుంటోంది. ఆ గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయంటోంది.
సమీరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నా కెరీర్లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పుడు నాపై చాలా ఒత్తిడి బాగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. నేను ఏమీ మాట్లాడలేకపోయేదాన్ని. కానీ ఒత్తిడి తెచ్చేవారు. పదే పదే ఆ టాపిక్ ని తెచ్చేవారు .
ఇక విసుగెత్తి నేను చేయించుకోను అని అంటే... రివర్స్ లో వాదించి ఒప్పించే ప్రయత్నం చేసేవారు. అలాగే అందరూ చేయించుకుంటున్నారు కదా.. మీకు ఏమైదంటూ అడిగేవారు. ఇలా సర్జరీ చేసుకోమని నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మన చేతిలో లేని కొన్ని ఒత్తిడిలు తప్పవంటూ నిట్టూర్చుంది.
ఇండస్ట్రీ ప్రెజర్స్ గురించి చాలా ఎలాబరేటెడ్ గా చెప్పుకొచ్చింది. వాటిని వివరిస్తూ...మనమేదో లోపంతో ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. సలహాలు చెప్తారు. నిజానికి అది లోపం కాదు. జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. నాకు సహజంగా ఉండటమే ఇష్టం. నేను ఎలా ఉన్నానో అలాగే ఏక్సెప్ట్ చేయమనే దాన్ని అది చాలా మందికి నచ్చేది కాదు. కానీ నేను ఏం చెయ్యగలను చెప్పండి అని చెప్పుకొచ్చింది.
ఇవన్నీ చెప్తున్నాను అని నేను ఎవరినీ విమర్శించడు. అసాదే నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. అలా అని నా విషయంలో నా సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను’ అని చెప్పుకొచ్చింది. పర్శనల్ ఇన్ సెక్యూరిస్ ని హైలెట్ చేయద్దని కోరుతోంది. ఎవరికి ఏది శారీరకంగా వచ్చిందో దాన్ని ఏక్సెప్టు చేసి ముందుకు వెళ్లటమే జీవితం అని ఉదహరిస్తోంది.
2015లో బాబు పుట్టిన తర్వాత బరువు పెరిగానని అన్నారు. ‘‘శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘మీకు ఏమైంది? ఇది మీరేనా?’ అని అడిగాడు. వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి” అని అన్నారు. ఫొటోగ్రాఫర్స్‌కు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటికి కూడా వెళ్లలేదని చెప్పారు.
తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కలిసి సినిమాలు చేసింది సమీరా రెడ్డి. ప్రస్తుతం తెలుగు లో హీరోలెవ్వరితో తను టచ్ లో లేనని, త్వరలోనే అందరితో టచ్ లోకి వస్తానని చెబుతోంది. మరీ ముఖ్యంగా తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ను కలవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని, ఆ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పట్నుంచి ఎన్టీఆర్ ను కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించింది సమీరా రెడ్డి.
రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన ప్రస్తుత డ్రీమ్ గా చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద తన రీఎంట్రీని సమీరారెడ్డి కన్ ఫర్మ్ చేసింది. అన్నీ సెట్ అయి, మంచి కథ, బ్యానర్ కుదిరితే ఆమె త్వరలోనే తెలుగు సినిమాలో కనిపించడం ఖాయం. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ, క్రైమ్.. ఇలా జానర్ ఏదైనా అందులో తన పాత్ర బాగుండాలని, అలాంటి మంచి కథలు దొరికితే కచ్చితంగా సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. అయితే ఈ క్రమంలో పాత్ర నిడివిపై తనకు ఎలాంటి కండిషన్స్ లేవని కూడా చెబుతోంది. కథకు కీలకంగా ఉండే పాత్ర లభిస్తే, అది నిమిషం నిడివి క్యారెక్టర్ అయినా చేస్తానంటోంది
పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు నటి సమీరారెడ్డి. తెలుగులో ‘అశోక్’, ‘జై చిరంజీవ’, ‘నరసింహుడు’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటారు. గతంలో తన గ్లామర్, బాడీ షేమింగ్ పై వచ్చిన కామెంట్స్ కు ఫొటోషూట్ తో బదులిచ్చింది. ఒకరినొకరు మెరుగుపరుచుకోవాలని, శరీర పరిమాణం, వాటిపై జడ్జ్ మెంట్ల అడ్డంకులను అధిగమించాలని సూచించింది. ప్రస్తుతం సమీరా ఫొటోషూట్ వైరల్ గా మారింది.
పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. ‘‘2014లో అక్షయ్‌తో నా పెళ్లి జరిగింది. మా ఇంటి టెర్రస్‌పైనే సింపుల్‌గా చేసుకున్నాం. నేను ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు విమర్శించారు. కానీ అందులో నిజం లేదు. పెద్దల అంగీకారంతోనే మా వివాహం జరిగింది” అని వివరించారు.
తిరిగి అభిమానులతో కనెక్ట్ అవ్వాలనుకున్నానని, అందుకు సోషల్ మీడియా సులువైన మార్గమని అనిపించిందని సమీర అన్నారు. ఇన్‌స్టాలో అకౌంట్ క్రియేట్ చేశానని, కాస్త ప్రమోట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులకు ఫోన్ చేశానని చెప్పారు. కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదని, అప్పుడు బాధగా అనిపించిందని అన్నారు.
sameera-reddy
బాడీ షేమింగ్, బాడీ పాజిటివిటీ, సెల్ఫ్‌లవ్ వంటి అంశాలనూ ప్రస్తావించుకున్నారు. సమాజంలోని మూసను బద్దలుకొట్టడంపై విస్తృతంగా చర్చించారు. ముగ్గురు తోబుట్టువులలో చిన్నదైన సమీరారెడ్డి చిన్నప్పటి నుంచీ బొద్దుగా ఉండేది. దీంతో ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొన్నది.
సమీర ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లు వంటి ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ అవుతోంది. రీసెంట్ గా సమ్మర్ హీట్ నుంచి తప్పించుకునేందుకు సముద్రపు ఒడ్డున భర్త, పిల్లలతో కలిసి నేచర్ ను అనుభూతి చెందుతోంది. సినిమాలు వదిలాకా ఇలా టూర్లతో కుటుంబానికి దగ్గర సమయాన్ని గడిపేస్తోంది.
Image: Sameera Reddy/Instagram
మూసను బద్ధ్దలుకొట్టి.. వృత్తి, ఫ్యాషన్, అందం వంటి విషయాల్లో వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తక్షణ లక్ష్యమంటున్నది సమీర. ‘జీవితం అంటే మనం చేసే ప్రతిపనినీ పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం. ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనదైన శైలిలో ఎదిరించి దూసుకెళ్లడం’ అంటున్నది నటి సమీరారెడ్డి.
తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తర్వాత బిజీ అవ్వటం, సమీరా వివాహం చేసుకుని సంసారంలో పడిపోవటంతో ఆ రూమర్స్ తగ్గిపోయాయి.