- Home
- Entertainment
- నా బాడీ నా ఇష్టం అంటూ షర్ట్ విప్పేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. ట్రోలింగ్ కి ధీటుగా సమాధానం
నా బాడీ నా ఇష్టం అంటూ షర్ట్ విప్పేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. ట్రోలింగ్ కి ధీటుగా సమాధానం
అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి.
సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో గ్లామర్ ఒలకబోసింది. సమీరా రెడ్డి వెండి తెరపై బాగానే అందాలు ఆరబోసింది. అందుకే యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. హీరోలతో సమానంగా డాన్స్ చేయగల నటి సమీరా రెడ్డి.
ఇక సమీరా రెడ్డి వివాహం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ వర్దెని సమీరా రెడ్డి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. వివాహం తర్వాత సమీరా రెడ్డి బరువు సమస్యలు ఎదుర్కొంది. తన రూపం మారిపోవడంతో ట్రోలింగ్ ఎదుర్కొంది.
కానీ ఇప్పుడు ట్రోలింగ్ ని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటోంది. నా బాడీ నా ఇష్టం అంటూ ట్రోలర్స్ కి బదులిచ్చింది. సమీరా రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో మేకప్ లేకుండా హాట్ ఫొటోస్ పోస్ట్ చేసింది. తన శరీరాన్ని తాను ఇష్టపడుతున్నాను అంటూ సమీరా రెడ్డి ఈ ఫోటోషూట్ చేసింది.
సమీరా రెడ్డి తన డ్రెస్ పై ధరించి ఉన్న బ్లూ జాకెట్ రిమూవ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు బోల్డ్ గా ఉన్నాయి. అలాగే చీపురు పట్టుకుని వయ్యారంగా ఇచిన ఫోజులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.