- Home
- Entertainment
- Samantha Trolling: టీషర్ట్ పై బూతు స్లోగన్.. ట్రోలర్స్ కి దొరికిపోయిన సమంత.. షాకిస్తున్న టీషర్ట్ ధర!
Samantha Trolling: టీషర్ట్ పై బూతు స్లోగన్.. ట్రోలర్స్ కి దొరికిపోయిన సమంత.. షాకిస్తున్న టీషర్ట్ ధర!
సమంత ఇప్పుడు ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె సాగుతున్న తీరు సెన్సేషనల్ అవుతుంది. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అభిమానులకు షాకిస్తుంది. ఇప్పుడు సమంత చేసిన పని ట్రోల్స్ కి గురవుతుంది.

సమంత(Samantha) ఇటీవల ముంబయిలో మీడియాకి చిక్కింది. బాంద్రా ఏరియాలో ఓ సెలూన్ షాప్ నుండి బయటకు వస్తూ ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కింది. ఇందులో ఆమె వైట్ టీషర్ట్ ధరించి ఉంది. బ్లాక్ టైటిల్ ప్యాంట్ ధరించి వర్కౌట్ సెషన్ నుంచి బయటకు వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ వస్తుండగా, కెమెరా కన్నులు క్లిక్‌మనిపించాయి. వాటిని సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్‌గా మారాయి. సమంత పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
అయితే ఇందులో Samantha వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. టీషర్ట్ పై ఉన్న స్లోగన్ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. ఇందులో ఇంగ్లీష్‌లో బూతు స్లోగెన్ ఉంది. `f*k...`అంటూ చాలా బోల్డ్ గా, అత్యంత బూతు అర్థంతో ఈ ఇంగ్లీష్ స్లోగన్ ఉండటం విశేషం. దీంతో ఇప్పుడిది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమంత అభిమానులు ఇలా చూసి షాక్ అవుతున్నారు.
నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సమంత మరీ ఇలా ఓపెన్ అవుతుందేంటి? ఆ టీషర్ట్ ఏంటి?, ఆ మీనింగ్ ఏంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. సమంత బ్రేకుల్లేని బుల్డోజర్ లా దూసుకుపోతుందని, ఇలాంటి టీషర్ట్ లు వేసే ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా? లేక కావాలనే వేశారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత ఇంతగా తెగిస్తుందేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సమంత అంటే అందరిలోనూ ఓ పాజిటివ్ రెస్పెక్ట్ ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు, ఆమె లైఫ్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తన జీవితంలో అత్యంత బాధాకరమైన విడాకుల సంఘటనని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. ముందుకు సాగుతుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. లోకలే కాదు, పాన్ ఇండియాచిత్రాలు, ఇంటర్నేషనల్ చిత్రాలు చేస్తూ సంచలనంగా మారుతుంది. విడాకుల తర్వాతే సమంత అసలు లైఫ్ స్టార్ట్ అయ్యిందనే సిగ్నల్స్ ఇస్తుంది.
ఈ క్రమంలో ఇలా బోల్డ్ స్లోగెన్‌తో ఇలా పబ్లిక్‌లో ఓపెన్‌గా తిరగడం అందరిని షాక్‌కి గురి చేస్తుంది. అందుకే ఇప్పుడు సమంతని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే వీటన్నింటిని సమంత ఇప్పుడు పట్టించుకునే స్థితిలో లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. అన్నింటిని తట్టుకుని ఈ స్థాయికి వచ్చానని, ఎవరు ఏమనుకుంటే నాకేంటి? ఐ డోంట్ కేర్ అనే మానసిక స్థితిలో ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడీ సమంత ధరించిన టీషర్ట్ మరో రకంగా వైరల్‌గా మారింది. దీని ధర అందరిని షాక్‌కి గురి చేస్తుంది. సామ్ వేసుకున్న 'ఆర్13 వైట్ టీ షర్ట్' ధర సుమారు రూ. 17,000 ఉంటుందట. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్ లుక్.
సమంత గత ఏడాది అక్టోబర్ 2న తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది. ఆ తర్వాత అనేక మానసిక సంఘర్షణ తర్వాత ఆ బాధ నుంచి బయటపడ్డా ఆమె వరుసగా కొత్త సినిమాలు ప్రకటిస్తూ షాక్‌ల మీద షాకిలిస్తుంది. ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం`తోపాటు తమిళంలో `కాథువాకులు రెండు కాదల్` చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు రెడీ అవుతుంది. తమిళ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు `యశోద` అనే పాన్ ఇండియా చిత్రంలో, తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్ చిత్రం, కార్తితో ఓ సినిమా, హాలీవుడ్‌లో మరో సినిమా చేస్తుంది. బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలకు ఓకే చెప్పిందని టాక్.
ఇదిలా ఉంటే ఇటీవల అల్లు అర్జున్ నటించిన `పుష్ప` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి సంచలనం సృష్టించింది. సమంత ఐటెమ్ సాంగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై తన రూట్ `బోల్డ్ రూట్` అనే సిగ్నల్స్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆమె సంచలనాలకు తెరలేపుతూ ముందుకు సాగుతుండటం విశేషం.