- Home
- Entertainment
- Samantha: చైతూని అన్ ఫాలో చేసిన సమంత.. అక్కినేని ఫ్యామిలిలో వారిని ఇంకా ఫాలో అవుతూ..
Samantha: చైతూని అన్ ఫాలో చేసిన సమంత.. అక్కినేని ఫ్యామిలిలో వారిని ఇంకా ఫాలో అవుతూ..
సమంత తన సోషల్ మీడియా ఖాతా నుంచి నాగ చైతన్యని అన్ ఫాలో చేసింది. అయితే అక్కినేని ఫ్యామిలిలో కొందరిని మాత్రం సామ్ ఇంకా ఫాలో అవుతోంది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది. గత ఏడాది అక్టోబర్ లో సామ్, చైతు ఇద్దరూ తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలకు వెళ్ళింది. అనంతం స్నేహితులతో కలసి వెకేషన్స్ కి కూడా వెళ్ళింది.
అలాగే తన సినిమాలో బిజీ అవుతూ వర్క్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత కొన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతో డివోర్స్ తర్వాత సమంత సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొన్నటివరకు పరోక్షంగా పోస్ట్ లు పెడుతూ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది సమంత.
ఇప్పుడు నాగ చైతన్య జ్ఞాపకాలని పూర్తి చెరిపివేస్తోంది. కొన్ని రోజుల క్రితం అక్కినేని ఫ్యామిలీ పెట్టిన పెళ్లి చీరని సమంత చైతుకి తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందే సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నాగ చైతన్య ఫోటోలని డిలీట్ చేసింది.
తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్యని అన్ ఫాలో చేసింది. ఇది పెద్ద సర్ ప్రైజ్ ఏమి కాదు. కానీ నెమ్మదిగా చైతు జ్ఞాపకాలని సామ్ తుడిచివేస్తోంది అంటూ ఫ్యాన్స్ సహజంగానే చర్చించుకుంటున్నారు. చైతూని అన్ ఫాలో చేసిన సమంత అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీస్ కి చేసిన అఖిల్ అక్కినేని, వెంకటేష్, ఆశ్రిత, సుశాంత్ లని మాత్రం ఫాలో అవుతోంది.
నాగ చైతన్య మాత్రం సమంతని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇక ట్విట్టర్ లో కూడా సమంత అక్కినేని కుటుంబ సభ్యులు అమల, సుమంత్ లాంటి వారిని ఫాలో అవుతోంది.
చై సామ్ 2017లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ళ పాటు సాగిన వీరి వివాహం బంధం గత ఏడాదితో తెరపడింది. చైతు, సమంతకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల ఈ జంట విడిపోయారు.