MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?

Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?

Samantha Top 5 Disasters: స్టార్‌ హీరోయిన్‌ సమంత తన కెరీర్‌ లో చాలా సినిమాలు పరాజయం చెందాయి. అయితే వాటిలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ గా నిలిచిన ఐదు సినిమాలేంటో తెలుసుకుందాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 18 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమంత టాప్‌ 5 డిజాస్టర్‌ మూవీస్‌
Image Credit : Asianet News

సమంత టాప్‌ 5 డిజాస్టర్‌ మూవీస్‌

సమంత సౌత్‌ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ హీరోయిన్లలో ఒకరు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్‌ హీరోయిన్లలో సమంతదే మొదటిస్థానం. సినిమాలు లేకపోయినా తన రేంజ్‌ని, క్రేజ్‌, పాపులారిటీని చాటుకుంటోంది సమంత. తనకు ఉన్న ఫాలోయింగ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు సామ్‌.. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత `మా ఇంటి బంగారం` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ శుక్రవారం(జూన్‌ 19)న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సమంత నటించిన సినిమాల్లో ఐదు చెత్త మూవీస్‌ ఏంటి? బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఏంటనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సమంత కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌ శాకుంతలం
Image Credit : our own

సమంత కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌ శాకుంతలం

సమంత నటించిన వాటిలో అత్యంత చెత్త సినిమాల్లో `శాకుంతలం` మొదటి స్థానంలో ఉంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పురాణాల్లోని శాకుంతలం పాత్రని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. ఆమెకి జోడీగా దేవ్‌ మోహన్‌ చేశారు. మోహన్‌ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మూడేళ్ల క్రితం విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలచింది. గుణశేఖర్‌ కి చిల్లి గవ్వ కూడా రాలేదు. ఆ తర్వాత ఈ మూవీ సమంత చేయకుండ ఉండాల్సిందనే కామెంట్స్ వినిపించాయి.

Related Articles

Related image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Related image2
Save The Tigers 3 Review: సేవ్‌ ది టైగర్స్ 3 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. టైగర్స్ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యారా?
36
బ్రహ్మోత్సవం సామ్‌కి మరిచిపోలేని చేదు జ్ఞాపకం
Image Credit : IMDB

బ్రహ్మోత్సవం సామ్‌కి మరిచిపోలేని చేదు జ్ఞాపకం

సమంత నటించిన డిజాస్టర్‌ మూవీస్‌లో రెండో వరుసలో ఉన్న చిత్రం `బ్రహ్మోత్సవం`. మహేష్‌ బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సమంతతోపాటు కాజల్‌ కూడా హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. పెళ్లి సంబంధం చూడాలంటే అట ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ఫ్యామిలీలో మళ్లీ వెనక్కి వెళ్లి తన బంధువులను వెతుక్కునే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. పదేళ్ల క్రితం(2016)లో విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి టీ ఖర్చులు కూడా రాలేదనే టాక్‌ వినిపించింది.

46
సమంతని నిండా ముంచిన సూర్య అంజాన్‌
Image Credit : Instagram

సమంతని నిండా ముంచిన సూర్య అంజాన్‌

సమంతకి పెద్ద డిజాస్టర్లు ఇచ్చిన చిత్రాల్లో తమిళ మూవీ `సికిందర్‌`(అంజాన్‌) కూడా ఉంది. సూర్య హీరోగా రూపొందిన చిత్రమిది. లింగుస్వామి దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ 2014లో విడుదలై ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకోయింది. డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి మూవీ సమంత చేయకుండా ఉండాల్సిందన్నారు.

56
 10 ఎంద్రతుకుల్లా లో సమంత రోల్‌పై విమర్శలు
Image Credit : stockPhoto

10 ఎంద్రతుకుల్లా లో సమంత రోల్‌పై విమర్శలు

ఇక సమంత నటించిన డిజాస్టర్లలో టాప్‌ 4లో ఉండే మూవీ `10 ఎంద్రతుకుల్లా`. విక్రమ్‌ హీరోగా సమంత హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. యాక్షన‌‌ అడ్వెంచరస్‌గా రూపొందింది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేయడం విశేషం. 2015లో విడుదలైన ఈ మూవీకి విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి ఎక్కలేదు. సమంత పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

66
ఎన్టీఆర్‌ కూడా సమంత కి పెద్ద షాక్‌
Image Credit : stockPhoto

ఎన్టీఆర్‌ కూడా సమంత కి పెద్ద షాక్‌

సమంత టాప్‌ 5 డిజాస్టర్లలో మరో తెలుగు మూవీ ఉంది. అదే `రభస`. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. రొటీన్‌ రొడ్డకొట్టుడు మాస్‌, మసాలా, కమర్షియల్‌ మూవీగా ఇది తెరకెక్కింది. ఇందులో సమంత హీరోయి‌‌న్‌. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ప్రణితా సుభాష్‌ సెకండ్‌ హీరోయిన్‌గా చేసింది. 2014లో విడుదలైన ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బిగ్‌ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఇదొకటిగా నిలిచింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Recommended image2
Alpha Trailer: 'ఆల్ఫా' ట్రైలర్‌లో ఐదుగురు స్టార్స్.. పాన్ ఇండియా హీరోని 2 సెకన్లు చూపించి దాచేశారుగా
Recommended image3
Venky Anil 5: పూజా కార్యక్రమంలోనే హీరోయిన్లు మారిపోయారు..వెంకీ, కళ్యాణ్ రామ్ లకు షాక్.. 300 కోట్లపై కన్ను
Related Stories
Recommended image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Recommended image2
Save The Tigers 3 Review: సేవ్‌ ది టైగర్స్ 3 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. టైగర్స్ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved