MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ‘రక్తబీజ్‌’ టైటిల్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్టు డిటేల్స్.. ఈ సారి రూట్‌ మార్చిన స్టార్‌ హీరోయిన్‌..

‘రక్తబీజ్‌’ టైటిల్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్టు డిటేల్స్.. ఈ సారి రూట్‌ మార్చిన స్టార్‌ హీరోయిన్‌..

దీనికి ‘రక్తబీజ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.  

3 Min read
Author : Surya Prakash
Published : Jun 29 2024, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Samantha

Samantha


'యశోద' షూటింగ్  సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడ్డారు. దానికి ట్రీట్మెంట్  తీసుకుంటూ 'శాకుంతలం', విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ షూట్స్ స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ కొత్త వెబ్ సీరిస్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

సమంత అటు సినిమాలు, ఇటు వెబ్ సీరిస్ లు ఇలా అందుబాటులోకి వచ్చిన ప్రతీది చేసుకుంటూ పోతోంది. ఆమె తెలుగు,తమిళంలో  ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కావటంతో ఆమెతో చేయటానికి దర్శక,నిర్మాతలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఆమె పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు ఏరి కోరి ఎంపిక చేసుకుంటోంది. హీరోయిన్ గా స్టార్స్ ప్రక్కన అవకాశాలు తగ్గటంలో తన రూట్ ని ఇటు మార్చింది. తాజాగా ఆమె  మరొక వెబ్ సిరీస్ చేయడానికి సంతకం చేశారని బాలీవుడ్ టాక్. ఆ సిరీస్ హీరో ఎవరు? దానికి డైరెక్షన్ ఎవరు? టైటైలి ఏంటనేది చూస్తే..

39

 సమంత.. త్వరలో ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడామె మరో కొత్త వెబ్‌సిరీస్‌కు పచ్చజెండా ఊపింది. ఇందులో ఆమెతో కలిసి బాలీవుడ్‌  హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌ నటిస్తున్నట్లు సమాచారం. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’ సిరీస్‌ల కోసం రాజ్‌ అండ్‌ డీకేలతో చేతులు కలిపిన సమంత..మరోసారి తన రాబోయే ప్రాజెక్టు కోసం వారితో కలిసి పనిచేయనుంది. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వచ్చే సీక్వెన్స్‌ కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత కసరత్తులు కూడా ప్రారంభించారు. దీనికి ‘రక్తబీజ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. 
 

49

దర్శకుడు రాజ్ అండ్ డీకే (Raj And DK), హీరోయిన్ సమంతది అనగానే ఓటిటి వాళ్లు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే వారిది సూపర్ హిట్ కాంబినేషన్.  'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి అదరకొట్టారు.   త్వరలో రాజ్ అండ్ డీకే తీయనున్న   వెబ్ సిరీస్ 'రక్తబీజ్' యాక్షన్ తో నిండి ఉంటోందని తెలుస్తోంది. 

 

59

 'రక్తబీజ్' కోసం సమంత ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని తెలిసింది. యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో తన యాక్షన్ పార్ట్ కోసం వర్కవుట్స్ చేస్తున్నారట. మార్షల్ ఆర్ట్స్, ఇతర విద్యల్లో ట్రైనింగ్ అవుతున్నారట. త్వరలో ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది.  
 

69

మరో వైపు సమంత సిటాడెల్ కంప్లీట్ చేసిన తర్వాత తన ప్రొడక్షన్ లోనే బంగారం అనే మూవీని ఎనౌన్స్ చేసింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయంట. కొద్ది రోజుల క్రితం షారుఖ్ ఖాన్ సినిమాలో సమంత నటించబోతోందనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. హిందీలో డెబ్యూ మూవీ కోసం సమంత వెయిట్ చేస్తోంది.
 

79

ఇదిలా ఉంటే కొంత కాలం నుంచి ఈ బ్యూటీ ఆరోగ్యంపై పాడ్ కాస్ట్ చేస్తోంది. ఆల్కేష్ సహోత్రితో కలిసి టేక్ 20 అనే పేరుతో పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఆరోగ్యానికి సంబందించిన టిప్స్ ని ఫ్యాన్స్ తో సమంత పంచుకుంది. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని పాడ్ కాస్ట్ ద్వారా సమంత ప్రమోట్ చేస్తోంది.  ఇందులో ఓ నెటిజన్ సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ పై కామెంట్ చేశాడు. 
 

89

ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉన్నాయి. గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు కదా దానికి ఏం సమాధానం చెబుతారని అడిగాడు. సమంత ఆ కామెంట్ పై రియాక్ట్ అయ్యింది. గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. అయితే అవి పూర్తిగా తెలియక చేసినవి మాత్రమే అని సమంత పేర్కొంది. తెలుసుకున్న తర్వాత అన్నింటిని పూర్తిగా ఆపేసాను. ఇప్పుడు నేను ఏవైతే ఆచరిస్తున్నానో అవి మాత్రమే చెబుతున్నాను అని సమంత పేర్కొంది. 

99

సమంత పాడ్ కాస్ట్ ద్వారా చెబుతోన్న ఆరోగ్య సూచనలు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రజలలో కూడా హెల్త్ కాన్సిస్ బాగా పెరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం, హెల్త్ టిప్స్ ఫాలో కావడం చేస్తున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved