- Home
- Entertainment
- ఒక్క పోస్ట్ తో మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ లేపిన సమంత.. పడిపోయానంటూ కామెంట్.. పోస్ట్ హాట్ టాపిక్
ఒక్క పోస్ట్ తో మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ లేపిన సమంత.. పడిపోయానంటూ కామెంట్.. పోస్ట్ హాట్ టాపిక్
సమంత సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. ఒక్కసారిగా ఇంటర్నెట్ మొత్తం అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఆమె పెట్టిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

సమంత(Samantha) చాలా కాలంగా సోషల్ మీడియాకి దూరమైంది. దాదాపు జూన్ నెల తర్వాత ఆమె పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో తన సినిమాల అప్‌డేట్లకి సంబంధించిన పోస్టులే పెడుతూ వచ్చింది.దీంతో సమంతకి ఏమైందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, అమెరికాలో చికిత్స తీసుకుంటుందనే రూమర్ ప్రచారంలో ఉంది.
దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సమంత అమెరికాలోనే ఉందా? ఇండియాలోఉందా? అనేది పెద్ద ప్రశ్న. అదే సమయంలో ఆమెకి సంబంధించిన సినిమాల అప్‌డేట్లు మాత్రమే అభిమానులను అలరిస్తున్నాయి. సమంత మాత్రం కనిపించడం లేదు. దీంతో అనేక రూమర్స్ ఆమెపై వచ్చాయి. రెండో పెళ్లి చేసుకోబోతుందనే గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. వేటిపై ఆమె స్పందించలేదు.
తాజాగా ఒక్కసారిగా సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఒక్క పోస్ట్ తో అందరిని అలెర్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది సమంత. ఇందులో ఆమె ఓ కుక్క ఫోటోని పంచుకుంది. ఇది సోఫాలో కూర్చొని, అందులో పడిపోయినట్టుగా పిల్లోస్ అడ్డుగా ఉన్నాయి. డాగ్ వెనక భాగం మాత్రమే కనిపిస్తుంది. ఇదే అనే ప్రశ్నలకు తావిస్తుంది. అయితే దీనికి ఆమె `డౌన్ నాట్ ఔట్` అనే కామెంట్ పెట్టింది.
తాను కింద పడ్డాను(డౌన్), కానీ ఔట్ కాలేదు అనే అర్థంలో సమంత ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆమె మొహానికి ఏదో అయ్యిందనే మీనింగ్‌ని మాత్రం ఈ డాగ్ రూపంలో ఇచ్చిందని అంటున్నారు. డాగ్‌ని ముఖాన్ని కప్పేయడం ఆ అర్థాన్నే ఇస్తుందని అంటున్నారు. సమంత పెట్టిన ఉద్దేశ్యం ఏమైనా, అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సామ్ సోషల్ మీడియాలోకి రావడంతో ఆమె యాక్టివ్‌గానే ఉందని, ఆమె బాగానే ఉందని వారంతా రిలాక్స్ అవుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి సమంత త్వరలోనే అందరి ముందుకు రాబోతున్నట్టు ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు అభిమానులు. ఇలా సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాల్లో నటిస్తుంది. `యశోద`, `శాకుంతలం` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు.
మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది సమంత. ఆమె `సిటాడెల్` రీమేక్ వెబ్ సిరీస్‌లో నటించబోతుంది.వరుణ్ ధావన్‌తో కలిసి జోడి కట్టబోతుంది. 1990 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ వెబ్ సిరీస్‌లో సమంత స్పైగా నటిస్తుందని, అందుకోసం యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి శిక్షణ తీసుకుంటుందని సమాచారం. అమెరికా వెళ్లడానికి ఇది కూడా ఓ కారణం అని టాక్. నిజమెంటనేది తెలియాల్సి ఉంది.