- Home
- Entertainment
- Samantha cute photos: అన్నం తింటున్నావా? అందం తింటున్నావా?.. సమంత క్యూట్‌నెస్ కి ఎవ్వరైనా పడిపోవాల్సిందే
Samantha cute photos: అన్నం తింటున్నావా? అందం తింటున్నావా?.. సమంత క్యూట్‌నెస్ కి ఎవ్వరైనా పడిపోవాల్సిందే
సమంత తన చేదు జ్ఞాపకాలను నుంచి బయటపడుతుంది. క్రమంగా తనని తాను బిజీగా ఉంచుకుంటూ పూర్వ వైభవాన్ని పొందుతుంది. పుంజుకుంటోంది. రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు వేస్తుంది. సమంతకి ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడే బాగా పెరగడం విశేషం.

సమంత(Samantha) తాజాగా పలు లేటెస్ట్ క్యూట్ ఫోటోలను పంచుకుంది. స్లీవ్‌లెట్ ఫ్రాక్‌లో వయ్యరాలు పోతూ పంచుకున్న క్యూట్ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ సమంత పిక్స్ వైరల్ అవుతూ ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నాయి.
అయితే సమంత ఓ జ్యూవెల్లరీ ప్రమోషన్‌లో భాగంగా పెయిడ్ పార్టనర్‌షిప్ తీసుకుంది సమంత. దానికోసం ఇలా పోజులిచ్చింది. ఆమె సింపుల్‌గా సోఫాలో కూర్చొని ఇచ్చిన పోజులు ఇప్పుడు నెటిజన్లని కట్టిపడేస్తుండటం విశేషం. జస్ట్ 24 గంటల్లోనే ఈ పిక్స్ ని దాదాపు 14 లక్షల మంది వీక్షించారంటే సమంత ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత ఇందులో ఎంత ముద్దుగా, అందంగా, క్యూట్‌గా కనిపిస్తుంది. సమంత క్యూట్‌నెస్‌కి ఫిదా అవుతున్నారు. అంతేకాదు `అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా` అంటూ కామెంట్లు చేయడం విశేషం.
సమంత.. నాగచైతన్యతో విడిపోతున్నట్టు ఈ అక్టోబర్ 2న ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల అద్భుతమైన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఈ ఇద్దరు సంయుక్తంగా ఓ నోట్‌ని పంచుకున్నారు. అభిమానుల గుండెలు బ్రేక్ అయ్యేలా చేశారు. అభిమానులే అంతగా బాధపడుతుంటే, స్వయంగా సమంత ఇంకెంత బాధపడుతుందో ప్రత్యేకంగా చెప్పలేం.
ఆ సమయంలో తాను ఇక బతకలేనేమో అనుకుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. మానసికంగా ఎంతో సంఘర్షణకు గురైంది సమంత. దాన్నుంచి కోలుకోవడం మామూలు విషయం కాదు. కానీ సమంత ధైర్యం చేసింది. తాను స్ట్రాంగ్ ఉమెన్ అనే విషయాన్ని నిరూపించుకుంది.
బలమైన మహిళగా ఈ సమాజానికి తనని తాను పరిచయం చేసుకుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అభిమానులు సైతం సమంత డేరింగ్‌స్టెప్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. `మీరు ఏడవడానికి వంద కారణాలను ఇచ్చినప్పుడు.. నవ్వడానికి నీకు వెయ్యి కారణాలున్నాయని జీవితానికి చూపించు. జీవితంలో మీకు సంతోషాన్నిచ్చే విషయాలను పట్టుకుని, నెగటివ్ విషయాలను వదిలేయండి` అంటూ అభిమానులు చేసిన కామెంట్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఆలోచింప చేస్తున్నాయి.
సమంత ఫస్ట్ టైమ్ ఐటెమ్‌సాంగ్ చేసింది. అల్లు అర్జున్‌నటిస్తున్న `పుష్ప` చిత్రంలో ఆమె `ఊ అంటవా.. ఉఉ అంటావా` పాటలో ఆడిపాడింది. ప్రస్తుతం ఈ పాట ఓ ఊపు ఊపుతుంది. 40 మిలియన్స్ ని దాటుకుని ముందుకు సాగుతుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాతోపాటు సమంత తెలుగులో ఓ చిత్రం, తమిళంలో మరో సినిమా చేసింది. అలాగే `యశోద` పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా, ఓ ఇంటర్నేషన్ చిత్రం చేస్తుంది సమంత.
also read: Samantha Item Song:మగవాళ్ల పాడు బుద్ది బయటపెట్టావ్ భేష్... సమంతకు అమరావతిలో పాలాభిషేకం!