సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనేనా ? ఇంతకీ ఎవరీ హీరో?
సమంత: ఒక వ్యక్తితో చేతులు కలిపి నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అతను సమంత కొత్త బాయ్ ఫ్రెండా..? నిజమెంత..?
సమంత
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ సమంత.. పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. అక్కడే కాలేజీ చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2010లో తమిళ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఆతరువాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆ సినిమాలో తనతో నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది.
Also Read: సుకుమార్ భార్యను ఏడిపించిన సినిమా .?
నాగ చైతన్య
2010లో సినిమాల్లోకి వచ్చిన సామ్, త్వరలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ అయ్యింది. తమిళం, హిందీ కంటే తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. 2017లో ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్న నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. నాలుగు సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రేమగా ఉన్నారు.
2021లో నాగ చైతన్య తో విడాకులు తీసుకుంది సమంత. ఇక చైతూ త్వరలోనే నటి శోభితతో పెళ్లి జరగనుంది. 37 ఏళ్ళు దాటినా సమంతా ఒంటరిగా ఉంది. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తోంది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది.
సమంతా రూత్ ప్రభు
ఇటీవల సమంతా ఒక యువకుడితో చేతులు కలిపి నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఒక పెళ్లిలో ఆ వ్యక్తితో సమంతా బయటకు వస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అతను సమంతా కొత్త ప్రియుడు అని, అతను ఎవరో తెలియదంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
దర్శిని సూర్య అనే వ్యక్తి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అతను సమంతా స్నేహితుడని చెప్తున్నారు. ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్లయిందని, అతను సమంతకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, చాలా ఏళ్లుగా వారిద్దరికీ మంచి స్నేహం ఉందని చెప్పారు. అతని ఇంటి ఫంక్షన్‌కి వెళ్లి సమంతా తిరిగి వస్తున్నప్పుడు తీసిన వీడియో అని చెప్పారు.