టాప్ గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత.. ఆ విషయంలో బిజీగానే ఉంటున్న సామ్!
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ పోస్టులతో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంటుంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.
తను సైన్ చేసి అప్పటికే షూట్ ప్రారంభించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’, ‘సిటడెల్’ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసింది. ఇందులో సిటడెల్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. దీంతో ఫోకస్ కొత్త సినిమాలపై కాకుండా తన ఆరోగ్యంపై పెట్టింది సామ్. అందుకే ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
మరికొద్ది నెలల్లో మళ్లీ బిజీ కానున్నారు. ఇప్పటికే పలు దేవాలయాలు, వెకేషన్లకు వెళ్లి చాలా రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ లుక్స్ తో ఎప్పుడూ పబ్లిక్ అపీయరెన్స్ తో ఆకట్టుకుంటున్నారు సామ్. దీంతో ఆమె ఆరోగ్యం బాగుపడిందనే అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కాస్తా బిజీగానే గడుపుతున్నారు. ఇప్పటికే తన సొంతం క్లాథింగ్ బిజినెస్ కోసం వరుసగా ఫొటోషూట్లు చేస్తూనే వస్తోంది. మరోవైపు తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ దర్శనమచ్చింది.
దివాళీ ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ప్రముఖ బల్గేరి జ్యూయెల్లరీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్ చేసింది. జ్యూయెల్లరీ, హ్యాండ్ బ్యాగ్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆ ఫొటోలను సామ్ తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ అభిమానులతో పంచుకుంది.
ఇక సామ్ ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం రెచ్చిపోయి ఫొటోషూట్ చేసింది. స్లీవ్ లెస్, స్ట్రిప్ లెస్ బ్లూ డ్రెస్ లో టాప్ అందాలను విందు చేసింది. మత్తెక్కించే సొగసుతో మైమరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ గ్లామర్ ఫీస్ట్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.