'ఊ అంటావా మావ' సాంగ్ చేయడానికి అసలైన కారణం బయటపెట్టిన సమంత.. తన అందానికే పరీక్ష అట
పుష్ప 1 రిలీజై నాలుగేళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత సమంత ఈ మూవీలో తాను ఊ అంటావా మావ సాంగ్ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. ఆ సాంగ్ తన అందానికే పరీక్ష అంటూ సమంత క్రేజీ కామెంట్స్ చేసింది.

సమంత 'ఊ అంటావా మావ' సాంగ్
ప్రముఖ నటి సమంత ఇటీవల ఓ కార్యక్రమంలో పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావ సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఊ అంటావా సాంగ్ దేశం మొత్తం ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “ఊ అంటావా” పాట వెనుక ఉన్న అసలు కారణాన్ని సమంత వెల్లడించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన “పుష్ప: ది రైజ్ చిత్రంలో ఊ అంటావా పాటని ఐటెం సాంగ్ గా చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటలో సమంత తన డాన్స్ మూవ్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది.
నా అందానికి ఆ సాంగ్ పరీక్ష
సమంత మాట్లాడుతూ, “నేను ‘ఊ అంటావా’ పాటను నన్ను నేను పరీక్షించుకోవడానికి చేశాను. ఇది నాకు నేనే వేసుకున్న సవాలు” అని చెప్పింది. ఆమె మరింతగా వివరిస్తూ, “నన్ను నేను ఎప్పుడూ సెక్సీగా భావించలేదు. నాకు ఎవరూ బోల్డ్ పాత్రలో నటించే ఆఫర్ ఇవ్వలేదు. కాబట్టి ఊ అంటావా సాంగ్ నాకు, నా గ్లామర్ కి సెల్ఫ్ టెస్ట్ లాగా అనిపించింది,” అని తెలిపింది.“ఊ అంటావా” పాటను పలు భాషల్లో విడుదల చేయగా, సమంత చేసిన హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పాటతో సమంత తన గ్లామర్ యాంగిల్ ని బయటపెట్టింది.
అలాంటి పాత్ర కోసం చాలా కాలం ఎదురుచూశా
అదే కార్యక్రమంలో సమంత“ది ఫ్యామిలీ మాన్ 2” వెబ్ సిరీస్ గురించి కూడా మాట్లాడింది. ఈ సిరీస్ ద్వారా ఆమె తన డిజిటల్ డెబ్యూ చేసింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్‌లో సమంత “రాజీ” అనే పాత్రలో నటించింది. ఆ పాత్ర తన కెరీర్‌లో చాలా విభిన్నమని సమంత పేర్కొంది. “ఇలాంటి పాత్ర కోసం నేను చాలా కాలంగా ఎదురు చూశాను. ఎవ్వరూ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వరని నాకు తెలుసు. నేను అప్పటి వరకు ‘గర్ల్ నెక్స్ట్ డోర్’ పాత్రలే చేశాను, కానీ ‘రాజీ’ పూర్తిగా కొత్త అనుభవం” అని సమంత తెలిపింది.
సమంత నటనకు ప్రశంసలు
“ది ఫ్యామిలీ మాన్” సిరీస్ కథ మిడిల్ క్లాస్ వ్యక్తి శ్రీకాంత్ తివారి చుట్టూ తిరుగుతుంది. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి, శరద్ కెల్కర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌లో సమంత నటనకు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.
సమంత నటించిన చిత్రాలు
సమంత తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ఆమె “దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రంగస్థలం, మహానటి, ఓ బేబీ, మజిలీ, యశోద” వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.