MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 'హాట్ స్టార్' ని డైలమోలో పడేసిన సమంత పర్శనల్ లైఫ్

'హాట్ స్టార్' ని డైలమోలో పడేసిన సమంత పర్శనల్ లైఫ్

 ఇప్పుడీ సమంత పర్శనల్ లైఫ్ ఎఫెక్ట్ ఆమె సినిమాపై పడబోతోందా అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా ఓటీటి  ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ వాళ్లు ఇప్పుడు సమంత విషయమై టెన్షన్ లో పడ్డారట. 

3 Min read
Author : Surya Prakash
| Updated : Oct 08 2021, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత.ఎంతో కలిసిమెలిగి  ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.  అసలు ఇలాంటి వార్త ఒకటి వినాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అస్సలు ఊహించి ఉండరు. అయితే ఇప్పుడీ సమంత పర్శనల్ లైఫ్ ఎఫెక్ట్ ఆమె సినిమాపై పడబోతోందా అంటే అవుననే అంటున్నారు. ముఖ్యంగా ఓటీటి  ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ వాళ్లు ఇప్పుడు సమంత విషయమై టెన్షన్ లో పడ్డారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


వివరాల్లోకి వెళితే.. సమంత తమిళంలో నటించిన ‘కాతువాకులా రెండు కాదల్‌’ అనే చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోందనే సంగతి తెలిసిందే. బాగా ఎక్కువరేటు పెట్టి కొనుక్కున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ చేసి తిరిగి తన పెట్టుబడిని రికవరీ చేసుకోవాలని హాట్ స్టార్ భావించింది. అందుకు సమంత కూడా అంగీకరించిందిట.  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ తో తమిళ జనాల్లో వచ్చిన ఇప్రెషన్ ని ఈ సినిమా కొట్టేస్తుందని భావించిందిట. అయితే విడాకులు ఇప్పుడు మొత్తం మార్చేసింది. 

39


ఆమె ఇంటర్వూలకు బయిటకు వస్తుందా అనే సందేహం హాట్ స్టార్ లో మొదలైందిట. విజయ్ సేతుపతి తాను ఆల్రెడీ బిజీగా ఉంటానని చెప్పారట. నయనతార తాను అసలు ఏ సినిమాకు బయిటకు వచ్చి ప్రమోషన్ చేసింది లేదని తేల్చి చెప్పిందిట. ఈ క్రమంలో సమంతనే వాళ్లు నమ్ముకుంటే ఇలా దెబ్బ పడిందిట. ఆ సినిమాలో సమంత, నయనతార ఇద్దరు అక్క చెల్లెళ్లుగా కనిపించనున్నారట.
 

49
Samantha

Samantha


ఇక  సమంత అక్కినేని ఇండస్ట్రీల సరిహద్దులు చెరిపేసి దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల మనసు గెలుచుకుంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’తో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, తమిళంలో ‘కాతువాకులా రెండు కాదల్‌’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ సినిమాలో విజయ్‌సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటిస్తోంది. వాళ్లిద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని వెల్లడించింది.

59


‘‘కాతువాకులా రెండు కాదల్‌’ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని పంచుతుంది. ఆ సినిమాలో చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. విజయ్‌సేతుపతి, నయనతార తారాజువ్వల్లాంటి వాళ్లు. ఆ ఇద్దరితో కలిసి పనిచేయడం గొప్పగా, సరదాగా ఉంటుంది. తెరమీదే కాకుండా మా మాధ్య ఆఫ్‌ స్క్రీన్‌ కూడా మంచి స్నేహం ఉంది’’ అని సమంత చెప్పుకొచ్చింది.

69


 ‘కాతువాకులా రెండు కాదల్‌’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విఘ్నేశ్‌ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.  మరోవైపు ‘శాకుంతలం’ చిత్రీకరణ సైతం ఇటీవల తిరిగి ప్రారంభమైంది.

79


ఇటీవల జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో ది ఫ్యామిలీ మెన్‌– 2 వెబ్‌ సిరీస్‌కు గాను సమంత ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.  ఉత్తమ నటి అవార్డు అందుకున్న సమంతను కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్ర సెట్లో కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేషన్‌ చేసుకున్నారు.  

89
Samantha

Samantha

నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత తొలిసారిగా ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొంది. హైదరాబాద్‌లోని ముకరంజా జూనియర్‌ కాలేజీలో దీనికి సంబంధించి షూటింగ్‌ జరిగింది. విడాకుల ప్రకటన అనంతరం అసలు సమంత షూట్‌కి వస్తుందో రాదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ షూటింగ్‌లో పాల్గొంది. ముంబైకి చెందిన యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ విశేష్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు.

99
Samantha

Samantha


అయితే షూట్‌ గ్యాప్‌లో సమంత తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్‌ చెప్పినట్లు యాక్టింగ్‌ చేసిందట. దీంతో పని విషయంలో సమంతకున్న అంకితభావాన్ని చాటుకుంది అని యూనిట్‌ సభ్యులు ప్రశంసలు కురిపించారు.

Also read సమంత- ప్రీతమ్ మధ్య రిలేషన్ పై క్లారిటీ, తెలివి తెచ్చుకోండి.. హాట్ టాపిక్ గా మారిన ఆ పోస్ట్

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ
Recommended image2
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Recommended image3
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved