- Home
- Entertainment
- ట్రీట్మెంట్ కోసం యుఎస్ బయలుదేరిన సమంత.. ఖుషికి దూరం, సామ్ కోసమే అలా ప్లాన్ చేశారా ?
ట్రీట్మెంట్ కోసం యుఎస్ బయలుదేరిన సమంత.. ఖుషికి దూరం, సామ్ కోసమే అలా ప్లాన్ చేశారా ?
సమంత తాజాగా పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కోసం అమెరికా బయలుదేరింది. కొన్ని వారాల పాటు సమంత యుఎస్ లోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత తాజాగా పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కోసం అమెరికా బయలుదేరింది. కొన్ని వారాల పాటు సమంత యుఎస్ లోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సమంత హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్ళింది.
దీనితో అభిమానులు పూర్తి ఆరోగ్యంగా సమంత తిరిగిరావాలని కోరుకుంటున్నారు. సమంత యుఎస్ వెళ్లడంతో ఇక ఆమె ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదు. ప్రీరిలీజ్ లాంటి వేడుకలకు, ప్రెస్ మీట్స్ కి సమంత హాజరయ్యే ఛాన్స్ లేదు. ఇటీవల చిత్ర యూనిట్ ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. సమంత ప్రీ రిలీజ్ కి అందుబాటులో ఉండదని భావించే నిర్మాతలు ఇలా ఈవెంట్ ప్లాన్ చేసారు.
మ్యూజిక్ కన్సర్ట్ లో సమంత, విజయ్ దేవరకొండ చేసిన హంగామా, డ్యాన్స్ ఇప్పటికి యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉంది. ఈవెంట్ సామ్ చాలా హుషారుగా కనిపించింది. కానీ లోలోపల మయోసైటిస్ తో బాధ పడుతూనే ఉంది. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.. మీ కోసం బ్లాక్ బస్టర్ ఇస్తాను అని సమంత ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
సమంత అనారోగ్యం కారణంగానే ఖుషి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా సామ్ ఖుషి చిత్రాన్ని ఫినిష్ చేసింది. యుఎస్ లో ట్రీట్ మెంట్ పూర్తయ్యాక కూడా సామ్ తరచుగా అమెరికా వెళ్ళిరావలసిందేనని సన్నిహితుల నుంచి సమాచారం. ఓ హీరో నుంచి తన చికిత్స కోసం రూ25 కోట్లు సమంత అప్పు తీసుకున్నట్లు వచ్చిన రూమర్స్ ని ఖండించిన సంగతి తెలిసిందే.