Samantha: నేను పక్కా కమర్షియల్ అంటున్న సమంత.. అస్సలు తగ్గట్లేగా
నేను పక్కా కామర్షియల్ అంటోంది టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha). చేతినిండా ఎడా పెడా సంపాదించేస్తుంది. క్షణం తీరిక లేకుండా.. అటు సినిమాలు..ఇటు కమర్షియల్ యాడ్స్ తో దడదడలాడిస్తోంది.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తగ్గేదే లే అంటోంది. ఇటు సినిమాలు..అటు కమర్షియల్ యాడ్స్, మరోవైపు బిజినెస్ లు ఇలా అన్నింటినీ మెయింటేన్ చేస్తూ.. చేతి నిండా సంపాదించేస్తోంది. మరీ ముఖ్యంగా డివోర్స్ అయిన అప్పటి నుంచీ సమంత(Samantha) క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. వచ్చిన ఆఫర్ వచ్చినట్టు తీసుకుంటుంది.
ఇప్పటికే సమంత(Samantha) ఖాతాలో చాలా సినినిమాలు.. చాలా కమర్షియల్ యాడ్స్. ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు మరికొన్ని వచ్చి చేరుతున్నాయి. కెరీర్ పరంగా ఫెయిడ్ అవుటు అవ్వాల్సిన టైం లో తన తెలివితేటలు.. ఫిట్ నెస్.. బ్యూటీతో వరుస అవకాశాలు సాధిస్తోంది సమంత. అస్సలు తగ్గేది లేదు అంటోంది. రీసెంట్ గా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కమర్షియల్ లో సమంత(Samantha) సందడి చేస్తుంది.
చాల మందిలో అపోహలు ఉన్న ఇండియన్ క్రిప్టో కరెన్సీ కి సంబంధించి.. భారతీయుల్లో క్రిప్టో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రముఖులతో ప్రమోషన్స్‌ను చేపట్టాయి. దీనికి సంబంధించి కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత(Samantha) మారింది. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చని తెలిపే వీడియోను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు సమంత(Samantha) మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి ఆయుష్మాన్ ఖురానా, రణ్వీర్ సింగ్ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారారు. క్రిప్టోకరెన్సీ ప్రచారంలో తాజాగా సమంత కూడా వచ్చి చేరింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత (Samantha) చేసిన వీడియో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సమంత(Samantha)కు ఇది మాత్రమే కాదు అటు సొంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయి. సినిమాలు చేస్తూనే పలు బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది సమంత(Samantha). తనకు సొంతంగా జ్యూవెల్లరీ బ్రాండ్ తో పాటు గార్మెంట్ బ్రాండ్ కూడా ఉంది. వీటితో పాటు పలు బొటిక్ లు.. హోటల్స్.. శేర్ మార్కెట్స్.. ఇలా అన్ని రకాలుగా సమంత ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. జీవితంలో ఆర్ధికంగా దెబ్బ తగిలి కింద పడకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
నాగచైతన్య (Naga Chaitanya) తో డివోర్స్ తరువాత ఇంకా స్ట్రాంగ్ గా తయారు అయ్యింది సమంత(Samantha). డివోర్స్ తరువాత చాలా కాలం బాధపడుతూ.. ఇన్ స్టాలో ఇండైరెక్ట్ గా పోస్ట్ లు పెట్టిన సమంత. ఆ బాధను మర్చిపోయి.. స్ట్రాంగ్ గా తయారు అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇక ఇప్పుడు తన పనిలో బిజీ అవుతూ అన్నింటినీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది సమంత.
ఫ్యామిలీమెన్-2 సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత (Samantha) తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది సమంత. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత (Samantha) వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం యశోద మూవీ చేస్తోంది సమంత(Samantha). గుణశేఖర్ శాకుంతలం షూటింగ్ ను కంప్లీట్ చేసింది. వరుసగా అవకాశాలు కొట్టేస్తున్న బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక రీసెంట్ గా పుష్ప మూవీ కోసం సమంత(Samantha) చేసిన ఐటం సాంగ్ దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.