నాగార్జున బర్త్ డే పార్టీలో సమంత మిస్సింగ్.. మళ్లీ ఊపందుకున్న రూమర్లు ?
సమంత ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి, తనకు పడటం లేదని, ముఖ్యంగా మామ నాగార్జునతో పడటం లేదని, అలాగే నాగచైతన్యకి దూరంగా ఉంటుందనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సమంత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేరులో అక్కినేని తీసేసి `ఎస్` అని యాడ్ చేసింది. సమంత రౌత్ ప్రభుగానే ఉంది. అక్కినేని అనే పేరు తీసేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అయితే తాను నటిస్తున్న `శాకుంతలం` సినిమా వచ్చేలా తాను ఇలా పేరు మార్చిందనే వార్తలొచ్చాయి.
అదే సమయంలో అక్కినేని బిజినెస్ వ్యవహారాల్లో ఆమె తలదూరుస్తుందని, అతిగా ఇన్‌వాల్వ్ అవుతుందని, అందుకే ఆమెని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు నాగచైతన్యతోనూ విభేధాలనే వార్తలు గుప్పుమన్నాయి.
వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ సమంత.. నాగార్జున పుట్టిన రోజు(ఆగస్గ్ 29)న ఆయన బర్త్ డే విషెస్ తెలిపింది. మామా అంటూ సంభోదించింది. దీంతో వీరి మధ్య ఏం లేవనే వార్తలు ఊపందుకున్నాయి. వీరి మధ్య క్లాషెస్ పుకార్లే అని తేలిపోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి విభేధాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం నాగార్జున బర్త్ డే పార్టీలో సమంత లేకపోవడం. నాగచైతన్య, అఖిల్, అమల, వారి దగ్గరి బంధువులు మాత్రమే ఉన్నారు. కానీ సమంత ఈ పార్టీలో లేదు. ఈ చిత్రాలను అఖిల్, అమల పంచుకున్నారు.
ఫ్యామిలీ పార్టీలో సమంత లేకపోవడంతో మరోసారి రూమర్లు ఊపందుకున్నారు. చైతూ, సమంత `డైవర్స్` అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫ్యామిలీకి పెద్ద అయిన నాగ్ బర్త్ డే పార్టీలో సమంత లేకపోవడం నిజంగానే అనుమానాలకు తావిస్తుంది.
మరోవైపు సమంత తన ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. శిల్పారెడ్డితో కలిసి ఆమె విహారయాత్రలు చేస్తుంది. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా సమంత పంచుకోవడం విశేషం. అత్యంత ముఖ్యమైన ఈవెంట్‌లో లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో సమంత చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
సమంత, చైతూ దూరంగా ఉంటున్నారా? వీరి మధ్య ఏదైనా మనస్పర్థాలు తలెత్తాయా? సమంత ఒంటరిగా ఇలా వెకేషన్‌కి వెల్లడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై నాగార్జునగా, చైతన్యగానీ, సమంతగానీ ఎలా స్పందిస్తారో చూడాలి.