సమంత రెండో పెళ్లికి రెడీ?.. పేరెంట్స్ ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్?
స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు పెళ్లి లైఫ్‌కి దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె మరోసారి పెళ్లికి సిద్ధమయ్యిందని తెలుస్తుంది.
సమంత తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె `ఏం మాయ చేసావె` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలా మారింది. ఆమె ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌లో నటించింది. యంగ్‌స్టర్స్ అందరితోనూ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది.
సినిమాలు చేసే సమయంలోనే నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. టాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా మెలిగారు. కానీ ఊహించిన పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకున్నాయి. కుటుంబం, వ్యక్తిగతంకి సంబంధించిన కారణాలతో ఈ ఇద్దరు విడిపోయారు. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత చాలా కుంగిపోయింది. చాలా డిస్ట్రర్బ్ అయ్యింది. దీంతో అనారోగ్యానికి కూడా గురయ్యింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే
దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పూర్తిగా కోలుకునేందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే సమంత మరోసారి పెళ్లి చేసుకుంటుందనే రూమర్స్ చాలా వినిపించాయి. వాటిని వారి టీమ్ ఖండిస్తుంది. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు. ఇప్పుడు మరోసారి ఊపందుకున్నాయి. ఈ సారి చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. పెళ్లికి సమంత ఓకే చెప్పిందని తెలుస్తుంది.
పేరెంట్స్ ఇంట్లో సమంతని బాగా ఒత్తిడి తెస్తున్నారట. రెండో పెళ్లి చేసుకోవాలనే డిమాండ్ పెరిగిందట. దీంతో సమంత ఓకే చెప్పిందని లేటెస్ట్ రూమర్. నిజానికి సమంత పెళ్లికి దూరంగా ఉండాలనుకుంది. తాను సింగిల్‌గానే ఉండాలని నిర్ణయించుకుందట. మళ్లీ పెళ్లి చేసుకోకూడదనుకుందట. కానీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి రెడీ అవుతుందని తెలుస్తుంది. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు తాను ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
తమ ఫ్యామిలీకి చెందిన బంధువుల వ్యక్తినే సమంత పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. ఈ సారి ఫ్యామిలీ లైఫ్‌ని పూర్తిగా ప్రైవేట్‌గానే ఉంచాలనుకుంటున్నారట. చాలా కండీషన్స్ తో ఆమె ఓకే చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత సింగిల్‌గానే ఉండేందుకు ఇష్టపడుతుందని మరో వాదన. ఆమె మరోసారి పెళ్లికి రెడీగా లేదని సన్నిహిత వర్గాలసమాచారం. ఇది కేవలం రూమరేనా, నిజమా? అనేది తెలియాలంటే సమంత టీమ్ స్పందించాల్సిందే.