MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగచైతన్య, సిద్ధార్థ కాదు.. సమంత ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? రెండేళ్లు వెంటపడ్డాడు, తీరా అడిగితే

నాగచైతన్య, సిద్ధార్థ కాదు.. సమంత ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? రెండేళ్లు వెంటపడ్డాడు, తీరా అడిగితే

సమంత తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఇద్దరితోనే ప్రేమలో పడిందని అంతా భావిస్తున్నారు. చైతూ, సిద్ధార్థ్‌ మాత్రమే కాదు, తనకు మరో లవ్‌ ట్రాక్‌ కూడా ఉందట. ఆ విషయాన్ని బయటపెట్టింది సామ్‌.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 14 2024, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
photos from z telugu

photos-from z telugu

సమంత తన కెరీర్‌లో ఇద్దరితో ప్రేమలో పడ్డారని అంటుంటారు. నాగచైతన్యతో ప్రేమలో పడింది. వీరిద్దరు చాలా రోజులుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అయితే హీరో సిద్ధార్థతోనూ సమంత ప్రేమలో పడిందనే రూమర్‌ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే సిద్ధార్థ్‌కి ఆమె హ్యాండించిందని టాక్‌. అందుకేనేమో ఆయన తరచూ పరోక్షంగా సామ్‌కి వ్యతిరేకంగా పోస్ట్  లు పెడుతూ కనిపిస్తారు. అయితే వీరి లవ్‌ ట్రాక్‌ ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
photos-from z telugu

photos-from z telugu

ఈ రెండు ప్రేమ కథలు బయట అందరికి తెలుసు. సిద్ధార్థ్‌తో డేటింగ్‌ విషయం రూమర్‌ అయినా అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరికీ తెలియని మరో లవ్‌ ట్రాక్‌ ఉంది సమంత జీవితంలో. అది ఏకంగా ఇంటర్మీడియట్‌ టైమ్‌లోనే కావడం విశేషం.  తన ఫస్ట్ క్రష్‌ని సమంతనే బయటపెట్టింది. ఇంటర్‌ చదివే సమయంలో ఓ కుర్రాడు తన వెంటపడ్డాడట. మరి ఏం జరిగింది, సమంత ఏం చెప్పిందనేది చూస్తే, 
 

35
photos-from z telugu

photos-from z telugu

సమంత స్కూల్‌, ఇంటర్ లో చాలా చలాకీగా ఉండేదట. అమ్మాయిల గ్యాంగ్‌ని మెయింటేన్‌ చేసేదట. ఇంకా చెప్పాలంటే ఆమె ఓ రౌడీ బాయ్‌ వేషాలు వేసిందట. తన జూనియర్స్ ని ర్యాగింగ్‌ కూడా చేసేదట. అయితే తాను అవన్నీ చేసేదాన్ని కాదని, తన ఫ్రెండ్సే చేసేవారని చెప్పి తప్పించుకుంది సమంత. ఈ క్రమంలో తన లవ్‌ ట్రాక్‌ని బయటపెట్టింది. తనని రెండేళ్లపాటు ఓ కుర్రాడు వెంటపడేవాడట. ఇంటర్మీడియట్‌లో రెండేళ్ల పాటు రోజూ తన వెనకాలే నడిచి వచ్చేవాడట. 
 

45
photos-from z telugu

photos-from z telugu

తాను బస్‌ దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, రోజూ తన వెంటనే వెనకాల నడుచుకుటూ వచ్చేవాడని చెప్పింది. రెండేళ్లపాటు నడుచుకుంటూ వచ్చినా ఏ రోజూ తనతో మాట్లాడలేదట. దీంతో సమంతకి డౌట్‌ వచ్చింది. ఏంటి? ఏం మాట్లాడటలేదని చివరికి అడిగిందట. ఏంటి ఫాలో అవుతున్నావని ప్రశ్నించిందట. దానికి అతను చెప్పిన సమాధానం `నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారు?` అని.

ఆ మాటతో ఒక్కసారిగా సమంత మైండ్‌ బ్లాక్‌ అయ్యిందట. అతని గురించి మనసులో ఏదేదో ఊహించుకుందట. కానీ ఒక్కసారిగా నీరు గార్చాడట. ఇంతకి ఆ లవ్‌ ఏంటో అర్థం కాలేదట. అతను తనని ఇష్టపడ్డాడా? లేదా? ఇష్టపడి చెప్పలేకపోయాడా? అనేది అర్థం కాలేదు. అదొక విచిత్రమైన అనుభవం అని తెలిపింది సమంత. కానీ అదొక స్పెషల్‌ మెమొరీగా మిగిలిపోయిందని కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో వెల్లడించింది సామ్‌. 
 

55

సమంత మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. `ఏం మాయ చేసావే` చిత్రంలో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ప్రధానంగా మూవీస్‌ చేసింది సామ్‌. ఇప్పుడు ఏడాది గ్యాప్‌ తర్వాత కాస్త సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది. ఇటీవలే ఆమె `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో మెరిసింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం `మా ఇంటి బంగారం` అనే సినిమాలో నటిస్తుంది.

read more:`దేశముదురు` సినిమాని చేయాల్సింది ఏ హీరో తెలుసా? సూపర్‌ స్టార్‌ కావాల్సింది, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాడు!

also read: సూర్య `కంగువా` మూవీ రివ్యూ, రేటింగ్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved