MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: జీవితాంతం ఒంటరివై చచ్చిపో సమంత... అదే నాకు ఆనందం!

Samantha: జీవితాంతం ఒంటరివై చచ్చిపో సమంత... అదే నాకు ఆనందం!

ఓ నెటిజెన్ చేసిన నెగిటివ్ కామెంట్ ని  చాలా పాజిటివ్ గా రిప్లై ఇచ్చింది. చచ్చిపో సమంత అంటే.. హ్యాపీగా చేస్తా అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత ఎపిక్ రిప్లై వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 27 2022, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రతి వ్యక్తిపై ఓపెన్ కామెంట్ చేయడానికైనా సోషల్ మీడియా వెసులుబాటు కలిగించింది. ఈ క్రమంలో సెలెబ్రిటీలు చాలా మందికి టార్గెట్ గా మారుతున్నారు. ఆకతాయిలు, నెగిటివ్ మైండ్ కలిగిన వ్యక్తులు హీరో, హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను (Samantha) ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్ చేశారు. 
 

27


తన రెండు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోను ఉద్దేశిస్తూ.. ఈమె ఇలాగే పిల్లులు, కుక్కలతో జీవితాంతం ఒంటరిగా చస్తుంది.. అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్ కి మరొకరైతే ఘాటు సమాధానం చెప్తారు. కానీ సమంత చాలా పాజిటివ్ గా తీసుకుంది. నిజంగా అదే జరిగితే చాలా సంతోషం అంటూ సమాధానం ఇచ్చింది. 

37
samantha

samantha


మనుషులతో రిలేషన్స్ పెట్టుకోవడం కంటే సంతోషంగా తన పెట్ యానిమల్స్ లో గడుపుతూ జీవితం ముగించడమే ఆనందం అన్నట్లు సమంత రెండు పదాల్లో తెలియజేశారు. ఆ కామెంట్ చేసిన నెటిజెన్ ని సమంత ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. అతడు తన కామెంట్ ని డిలీట్ చేయడం విశేషం. 
 

47


2021 లో నాగ చైతన్యతో విడిపోయిన సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు చాలా కాలంగా యష్ అనే పెట్ డాగ్ ఉంది. ఈ మధ్య మరో కుక్కను కొన్నారు. ఏమాత్రం విరామం దొరికినా సమంత వీటితో సమయం గడుపుతారు. 

57

మరోవైపు నటిగా స్పీడ్ పెంచారు. ప్రస్తుతం రెండు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి (Kushi Movie) మూవీ చిత్రీకరణ మొదలైంది. మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో షూట్ చేశారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. యశోద షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. 
 

67


ఇక దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శాకుంతలం పౌరాణిక గాథగా నిర్మితమవుతుంది. ఇటీవల విడుదలైన శాకుంతలం ఫస్ట్ లుక్ అలరించింది. యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. 

77

అలాగే సమంత డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైన కూడా ఫోకస్ పెట్టారు. సమంత ముంబై కి మకాం మార్చినట్లు వార్తలు వస్తున్న తరుణంలో బాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారట. ముంబైలో సమంత ఇల్లు కూడా కొన్నారట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
70th Filmfare Awards: ఫిల్మ్ ఫేర్‌లోనూ పుష్పగాడి రూల్‌.. బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే? టోటల్‌ లిస్ట్
Recommended image2
Mahesh Babu Mistake: తన కెరీర్‌లో మహేష్‌ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్‌.. ఈ మూడు సినిమాలు వదులుకోవడం
Recommended image3
Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు మీ ఇంటికొచ్చేస్తున్నారు.. టీవీలో టెలికాస్ట్ ఎప్పుడంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved