MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి‌ సురేష్‌, త్రిషలతో సమంత పార్టీలు.. చైతూ `లవ్‌స్టోరీ` ఈవెంట్‌కి రాకుండా ఇదేం పనంటూ నెటిజన్ల కామెంట్లు

కీర్తి‌ సురేష్‌, త్రిషలతో సమంత పార్టీలు.. చైతూ `లవ్‌స్టోరీ` ఈవెంట్‌కి రాకుండా ఇదేం పనంటూ నెటిజన్ల కామెంట్లు

స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొన్ని రోజులుగా ఒంటరిగా విహార యాత్రని ఎంజాయ్‌ చేస్తుంది. భర్త చైతూకి దూరంగా ఉంటూ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటుంది. వీరిద్దరు డైవర్స్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పార్టీలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 21 2021, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత ప్రస్తుతం సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత మరింత దూకుడుతో ముందుకు సాగుతుంది. గ్లామర్‌ విషయంలోనూ హద్దులు చెరిపేసిన సమంత.. నటిగానూ తనకి తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. అందకు తగ్గట్టే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల, విభిన్న కథానేపథ్యంతో కూడిన సినిమాలు చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత మధ్య మనస్పర్థాలు తలెత్తాయని, వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నాయి. అందుకు బలాన్ని చేకూరేలా చైతన్యకి దూరంగా ఉంటోంది సమంత. అంతేకాదు చైతూతో కాకుండా తన ఫ్రెండ్‌తో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఒంటరిగా విహారయాత్రలు ఎంజాయ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

38

అందులో భాగంగా సమంత ప్రస్తుతం ఫ్రెండ్స్ కీర్తిసురేష్‌, త్రిష, కళ్యాణి ప్రియదర్శినిలతో కలిసి పార్టీలు చేసుకుంటుంది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా ఇన్స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఈ వారం అలా గడిచిందంటూ కీర్తిసురేష్‌, త్రిష, కళ్యాణిలకు థ్యాంక్స్ చెప్పింది సమంత. 
 

48

ఈ సందర్భంగా వీరంతా పార్టీలో ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో దిగిన సెల్ఫీ ఫోటోలను పంచుకుంది సమంత. విహార యాత్రకి సంబంధించి లొకేషన్‌ పిక్స్ ని పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

58
Love Story

Love Story

ఆదివారం సాయంత్రం సమంత భర్త, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌ స్టోరి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో సమంత మిస్‌ కావడం హాట్‌ న్యూస్‌గా మారింది. గతంలో చైతూ ఈవెంట్లలో సందడి చేసింది సమంత. కానీ `లవ్‌స్టోరి` ఈవెంట్‌లో ఆమె మిస్‌ అయ్యారు. అంతేకాదు నాగ్‌ ఫ్యామిలీలో ఎవరూ ఈ ఈవెంట్‌కి రాలేదు. దీంతో చైతూ, సమంత విడాకులకు సంబంధించిన వార్తలకు మరింత బలాన్నిచ్చినట్టయ్యింది. 

68

చైతూ-సామ్‌ వ్యవహారం చర్చకు వస్తుందని నాగార్జున కూడా మీడియాకి దూరంగా ఉంటున్నారు. `బిగ్‌బాస్‌5` షో మీడియా మీట్‌ కూడా నిర్వహించలేదు. తాజా ఈవెంట్‌లోనూ మిస్‌ కావడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే నాగార్జున బర్త్ కి, `లవ్‌ స్టోరి` ట్రైలర్‌ సందర్భంగా సమంత విషెస్‌ తెలిపింది. అందుకు చైతూ కూడా స్పందించడంతో వీరిద్దరి మధ్య వివాదాలకు సంబంధించి వస్తోన్న వార్తలు నిజం కావనే కామెంట్లు వచ్చాయి. కానీ సమంత `లవ్‌స్టోరి` ఈవెంట్‌కి రాకపోవడంతో విడాకుల వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. 
 

78

ప్రస్తుతం సమంత విహార యాత్రలు ఎంజాయ్ చేస్తూనే హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. హద్దులు మీరి పోజులిస్తుందంటూ నెట్టింట అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇవేవి పట్టించుకోకుండా సమంత తన దారిలో దూసుకపోవడం విశేషం. అంతేకాదు రిలేషన్‌, అండర్‌స్టాండింగ్ కి సంబంధించి పోస్ట్ లు పెడుతుంది. `నువ్వు హర్ట్ చేస్తావు, నేను హర్ట్ చేస్తాను. నువ్వ ఇతరులను కూడా హర్ట్ చేస్తావు. ఇది మనుగడలో ఇదొక కండీషన్‌ అని పేర్కొంటూ పోస్టులు పెట్టడం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

88

ప్రస్తుతం సమంత తెలుగుతో `శాకుంతలం` చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తుంది. దీంతోపాటు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌పై ఫోకస్‌ పెట్టింది సమంత.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalki 2: 'ఓ ధనంజయా, నువ్వు నేను ఇద్దరం కర్ణుడిని ఓడించలేం'.. మంటలు మరింత పెంచిన నాగ్ అశ్విన్
Recommended image2
Posani: చిరంజీవి సినిమా కాబట్టి వల్గర్ మూవీ అన్నారు, అసలు సిసలైన చెత్త సినిమా అదే..దెబ్బకు అంతా సైలెంట్
Recommended image3
Janaki Love Story: ఫోటోతో మొదలైన ప్రేమ.. సినిమాను మించిన లెజెండరీ సింగర్‌ జానకి లవ్‌ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved