MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. లెనిన్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. లెనిన్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే?

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్‌` మూవీ  ట్రైలర్ వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అఖిల్‌కి మొదటి హిట్‌ పక్కా అనేలా ఉంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 30 2026, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లెనిన్‌తో వస్తోన్న అఖిల్‌ అక్కినేని
Image Credit : Asianet News

లెనిన్‌తో వస్తోన్న అఖిల్‌ అక్కినేని

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్‌` మూవీ త్వరలో రాబోతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్‌ డైరెక్టర్‌ మురళీ కిశోర్‌ రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు మార్లు వాయిదా పడింది. `పెద్ది` కోసమే రెండు సార్లు వాయిదా పడటం విశేషం. ఇప్పుడు ఎట్టకేలకు `లెనిన్‌` మూవీని విడుదల చేయబోతున్నారు. జులై 10న రిలీజ్‌ డేట్‌ ని ఫిక్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లెనిన్‌ మూవీ ట్రైలర్‌
Image Credit : Asianet News

లెనిన్‌ మూవీ ట్రైలర్‌

ఈ క్రమంలో `లెనిన్‌` సినిమా నుంచి ట్రైలర్‌ విడుదలైంది. మంగళవారం సాయంత్రం ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ మాత్రం అదిరిపోయింది. అఖిల్‌ నటించిన గత చిత్రాలను మించిన కంటెంట్‌తో ఈ సారి రాబోతున్నారని ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. చిత్తూరు జిల్లా శ్రీరామాపురంలో ఈ మూవీ కథ నడుస్తుంది. ఆ ఊరికి పెద్ద ఒకరు ఉంటారు. ఆయన్ని ధర్మరాజుగా పిలుస్తుంటారు. ఆ ధర్మరాజు చెప్పిందే అంతా ఫాలో అవుతుంటారు. వసుదేవ్‌ అని ఊర్లో మరో పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. అతనికి సపోర్ట్ గా హీరో అఖిల్‌ ఉంటాడు. ఆయనకోసం తన ప్రాణాలైనా అడ్డు పెడతాడు. 

Related Articles

Related image1
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Related image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
35
అదిరిపోయే కంటెంట్‌తో లెనిన్‌
Image Credit : Asianet News

అదిరిపోయే కంటెంట్‌తో లెనిన్‌

శ్రీరామపురంలో 18రోజులపాటు ద్రౌపదమ్మని ఎంతో భక్తితో, బాధ్యతగా కొలుస్తారు. ఆ సమయంలో ఆ నేలపై రక్తం చిందకూడదనే నిబంధన ఉంది. అలాంటి నేలపై రక్తం చిందే పరిస్థితులు వస్తాయి. ధర్మరాజు చేసిన అఘాయిత్యాలు హద్దులు దాటుతాయి. అప్పటి వరకు పద్ధతిగా ఉన్న మనుషులు క్రమంగా రంగులు మారుస్తుంటారు. ఎవరి రూపం ఏంటో నెమ్మదిగా తెలిసిసొస్తుంది. ఆ పండగ సమయంలోనే అఖిల్‌కి భారతి(భాగ్యశ్రీ) పరిచయం అవుతుంది. అక్కడే ప్రేమ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రేమ చాలా దూరం వెళ్తుంది. అయితే ఊర్లో ఆదిపత్యం చాటున కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన స్నేహం కోసం ఏం చేశాడు? ప్రేమ కోసం ఎలా పోరాడాడు? ఆ ఊర్లో ఆయన తెచ్చిన మార్పేంటి అనే కథాంశంతో సినిమా సాగుతుందని ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.

45
నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌
Image Credit : Asianet News

నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌

ఆ ఊరుని పరిచయం చేస్తూ ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇదొక మహాభారతంగా ట్రైలర్‌ వాయిస్‌ఓవర్ లో నాగార్జున తెలిపారు. ఆ ఊర్లో జరిగే పండగ, అక్కడి ఊరు జనాలు, అధికారం కోసం జరుగుతున్న కుట్రలను ఇందులో స్పష్టంగా చూపించారు. అదే సమయంలో పండగ సమయంలోనే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమని ఆవిష్కరించారు. మరోవైపు తన స్నేహితుడి కోసం హీరో నిలబడటం, ఆ స్నేహితుడు ధర్మరాజుకి వ్యతిరేకంగా పోరాడటం వంటి సన్నివేశాలను చూపించారు. ఆ ఊర్లో నెత్తురు పారించేందుకు ధర్మరాజు ప్లాన్‌ వేస్తాడు, దాన్ని హీరో ఎదుర్కోవడం, ఈ క్రమంలో భారతితోపాటు స్నేహితుడి ప్రాణాల మీదకు రావడం, దీంతో వారికోసం హీరో విజృంభించడం వంటి సీన్లని ఆవిష్కరించిన తీరు బాగుంది. కురుక్షేత్రాన్ని తలపించేలా ఆయా సీన్లు ఉన్నాయి.

55
డైలాగ్‌తో పూనకాలు తెప్పించిన అఖిల్‌
Image Credit : Asianet News

డైలాగ్‌తో పూనకాలు తెప్పించిన అఖిల్‌

ట్రైలర్‌ చివర్లో.. `కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని, ఏంది అట్నే సేద్దామా?` అని అఖిల్‌ చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్‌ మాత్రం సాలిడ్‌గా ఉంది. చివర్లో అఖిల్‌ చేసే యాక్షన్‌ అదిరిపోయింది. నటుడిగానూ ఆయనలో చాలా బెటర్‌మెంట్‌ కనిపిస్తుంది. చివర్లో ఆయన ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. మంచి కంటెంట్‌తో ఈసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడని అర్థమవుతుంది. అదే సమయంలో ఈ సారి హిట్‌ పక్కా అనే సాంకేతాలను కూడా `లెనిన్‌` ట్రైలర్‌ ఇస్తుందని చెప్పొచ్చు. మరి మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇందులో శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Recommended image2
Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Recommended image3
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Related Stories
Recommended image1
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Recommended image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved