MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సమంత సైన్స్ నిరక్షరాస్యురాలు.. స్టార్‌ హీరోయిన్‌పై విరుచుకుపడ్డ గ్రామీ అవార్డు విన్నర్‌.. మరో దుమారం

సమంత సైన్స్ నిరక్షరాస్యురాలు.. స్టార్‌ హీరోయిన్‌పై విరుచుకుపడ్డ గ్రామీ అవార్డు విన్నర్‌.. మరో దుమారం

సమంతపై ఓ డాక్టర్‌ విమర్శించి సారీ చెప్పాడు. ఇంతటితో వివాదం ముగిసిందని భావించేలోపు మరో సెలబ్రిటీ ఆమెపై విరుచుకుపడ్డాడు. గ్రామీ అవార్డు విన్నర్‌ రికీ కేజ్‌ సామ్‌పై ఫైర్‌ అయ్యాడు.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 08 2024, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు వరుసగా వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి నైబ్యులైజేషన్‌(పీల్చడం) వల్ల ఉపశమనం ఉంటుందని సూచిస్తూ ఇటీవల పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని ఓ డాక్టర్‌ వ్యతిరేకించాడు. లివర్‌ డాక్‌ అనే డాక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యంతో సమంత ఆడుకుంటుందని మండిపడ్డారు. ఇలాంటి సలహాలు ఇచ్చిన సమంతని జైల్లో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీనిపై సమంత స్పందించింది. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని, డబ్బులు లేని వాళ్లు అలాంటివైద్యం ఎలా తీసుకుంటారని తాను ఆలోచిస్తున్నట్టు తెలిపారు. `ఒక పెద్ద మనిషి నా పోస్ట్ ను, నా సలహాలను ఉద్దేశ్యపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నా కంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుంది. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది. నాపై అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని, నన్ను జైల్లో పెట్టాలని అన్నందుకు బాధ లేదు. ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటా. కానీ నేను ఒక సెలబ్రిటీగా హెల్త్ టిప్‌ ఇవ్వలేదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను` అని చెప్పింది సామ్‌. 
 

37
Samantha

Samantha

దీనిపై ఆ డాక్టర్‌ స్పందించి సమంతకి క్షమాపణలు చెప్పాడు. తాను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నానని, ఆమె త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. `ఆమె పోస్ట్ ని ఖండించే క్రమంలో వాడిన పదజాలం ఆమెని బాధ పెట్టింది. ఇందుకు ఆమెకి క్షమాపణలు తెలియజేస్తున్నా. కావాలని అనలేదు, అనుకోకుండా అలా జరిగింది. సమంతని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి తప్పు ఆమెది కాదు, ఆమెకి ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ ది. అతను సొంత లాభాల కోసం సమంత స్టార్ డమ్‌ని వాడుకున్నాడు, దీన్ని ఖండిస్తున్నా` అని తెలిపారు. 
 

47

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సెలబ్రిటీ సమంతపై విరుచుకుపడ్డాడు. గ్రామీ అవార్డు విన్నర్‌, మ్యూజిషీయన్‌ రికీ కేజ్‌ స్పందించారు. సమంతపై విమర్శలు గుప్పించాడు. సమంత ఆరోగ్యం, సైన్స్ కి సంబంధించిన నిరక్షరాస్యురాలు అంటూ ఫైర్‌ అయ్యాడు. ఈ మేరకు ఆయన హాట్‌ కామెంట్‌ చేశారు. ప్రత్యామ్నాయ ఆరోగ్య చికిత్సలను పంచుకున్నందుకు సమంతను ఆయన `హెల్త్, సైన్స్ ఇల్లిటరేట్‌` అంటూ వెల్లడించారు. హిందూస్థాన్‌ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆయన సమంతపై ఫైర్‌ అయ్యారు. 
 

57

చాలా ప్రభావం చూపించే సెలబ్రిటీ ద్వారా వైద్య ప్రక్రియను చెప్పడం అంటే అది చాలా ప్రమాదకరమైన ప్రాంతంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన వైద్య చికిత్స కూడా ప్రాణాంతకం కావచ్చు. ఇది చాలా బాధ్యతారాహిత్యమైనది. ప్రత్యామ్నాయ ఔషధ మూలాల కోసం నిరంతరం వెతుకుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సాంప్రదాయ మెడిసిన్‌ పనిచేయవని వాళ్లు భావిస్తుంటారు. అలాంటి వారిని సమంత ప్రకటన ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి సెలబ్రిటీ ఏదైనా ఆమెదించినప్పుడు ప్రజలు దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ ఇలాంటి వైద్య ప్రక్రియను ఆమోదించకుండా ఉండేందుకు నిబంధనలు చాలా పటిష్టంగా అమలు చేయాలి అని అన్నారు రికీ కేజ్‌. 
 

67

సమంత పోస్ట్ ని చదివినప్పుడు ఆయన చాలా షాక్‌ అయ్యాడట. మీరు దాన్ని రెట్టింపు చేసినప్పుడు అది మరింత దిగజారుతుంది. నాకు అభ్యాసాన్ని సమర్థించడం చెడ్డది, కానీ ఆమె దానిని సమర్ధించడం అంత చెడ్డది కాదు. ఆమె తనను బయటకు లాగిన వైద్యుడిని తెలివిగా అణచివేస్తుంది. ఆమె కుక్కల కోసం చక్కెర పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని సమర్థించే వ్యక్తి. ఆ విషయాలను ఆమోదించడం మంచిది, కానీ మిమ్మల్ని మీరు ఆరోగ్యం కోసం వాదించే వ్యక్తి అని పిలవకండి` అంటూ సెటైర్లు వేశాడు గ్రామీ అవార్డు విన్నర్‌ రికీ కేజ్‌. రోగులకు హానీ చేసే సలహాలను ఇవ్వకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు.

 

77

సమంత ఇలా వరుసగా వివాదాల్లో నిలుస్తుంది. వార్తల్లో మెయిన్‌ టాపిక్‌గా మారుతుంది. మరి దీన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుంది, ఎలా బయటపడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకునేందుకు ఆమె సినిమాలకు ఏడాది గ్యాప్‌ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్ అవుతుంది. ఆ మధ్యనే `మా ఇంటి బంగారం` అనే సినిమాకి సైన్‌ చేసింది. మరికొన్ని ఆఫర్లని ఆమెకి వస్తున్నారు. హిందీలో ఓ సినిమా చేయబోతుందట. ఇప్పటికే `సిటాడెల్‌`లో నటించిన విషయం తెలిసిందే. అది రిలీజ్‌ కావాల్సి ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved