సమంత సీక్రెట్ టాటూ.. అక్కడ నాగచైతన్య పేరు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తను ప్రేమించి నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఎప్పటికప్పుడు ఓ సర్ప్రైజ్తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఈ జంట.
ఇటీవల ఓ ఫోటో షూట్లో సమంత తన సీక్రెట్ టాటూను రివీల్ చేసింది.
అంతేకాదు ఆ టాటు తన భర్త నాగచైతన్య పేరని తెలిపింది సమంత.
ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో `నా జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్నా.., (నేను ఇన్నాళ్లు తాచి పెట్టిన ఆ ఒక్కట ాటూ ఈ రోజు చూపిస్తున్నా) నా భర్తే నా ప్రపంచం` అంటూ కామెంట్ చేసింది.
చాలా రోజుల కిందటే సమంత, నాగచైతన్య తమ మణికట్టు మీద ఒకే విధమైన టాటూలు వేయించుకున్నారు.
ఇద్దరు కలిసి వేయించుకున్న టాటూలకు సంబంధించి మీనింగ్‌ను చెప్పింది. వాటి అర్ధం 'create your own reality' అని చెప్పింది.
తన మరో టాటూ సింబల్‌కు అర్ధం కూడా వివరించింది సమంత `నీ జీవితం నువ్వు ఎలా చూస్తావో అలా ఉంటుంది. ఇతరులు చెప్పినట్టుగా కాదు` అంటూ చెప్పింది.