MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Salman Khan Birthday:సల్మాన్ నటించిన ఆ రెండు చిత్రాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్

Salman Khan Birthday:సల్మాన్ నటించిన ఆ రెండు చిత్రాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్

సల్మాన్ ఖాన్ కెరీర్ బిగినింగ్ లో చేసిన రెండు చిత్రాలు ఆయనకు చాలా ప్రత్యేకం. ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకున్న ఆ చిత్రాలు సల్మాన్ ఇమేజ్ భారీగా పెంచాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 27 2021, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు (Salman Khan Birthday) నేడు. 1965 డిసెంబర్ 27న జన్మించిన సల్మాన్ ఖాన్ 56వ ఏట అడుగు పెట్టారు. మూడు దశాబ్దాలుగా హిందీ చిత్రసీమను ఏలుతున్న సల్మాన్ ఖాన్ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని కలిగి ఉన్నారు. కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కాగా సల్మాన్ ఖాన్ కెరీర్ బిగినింగ్ లో చేసిన రెండు చిత్రాలు ఆయనకు చాలా ప్రత్యేకం. ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకున్న ఆ చిత్రాలు సల్మాన్ ఇమేజ్ భారీగా పెంచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1988లో విడుదలైన బీవీ హో తో యైసి.. చిత్రంతో వెండితెరకు పరిచయమైన సల్మాన్ ఖాన్ (Salman Khan), 1989లో విడుదలైన మైనే ప్యార్ కియాతో మూవీతో హీరోగా మారారు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మైనే ప్యార్ కియా చిత్రం అప్పట్లో ఓ సంచలనం. డెబ్యూ మూవీతోనే సల్మాన్ రికార్డ్స్ తిరగరాశారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించగా సూరజ్ బర్తాజ్యా దర్శకత్వం వహించారు.  సల్మాన్, భాగ్యశ్రీలతో పాటు దర్శకుడు సూరజ్ కి కూడా మొదటి చిత్రం.  ముగ్గురు కొత్తవారి కాంబినేషన్ వచ్చిన చిత్రం మైనే ప్యార్ కియా. 

37

29 డిసెంబర్ 1989లో విడుదలైన మైనే ప్యార్ కియా అఖండ విజయం అందుకుంది. ఇక తెలుగులో ఈ మూవీ ప్రేమ పావురాలు టైటిల్ తో డబ్ చేశారు. తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని నమోదు చేసింది. తెలిసిన ముఖం ఒక్కటి లేకపోయినా టాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

47

ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీత ప్రియులను ఓ ఊపు ఊపిన మ్యూజిక్ ఆల్బమ్ అది. బాలీవుడ్ కంపోజర్ రామ్ లక్ష్మణ్ స్వరాలు సమకూర్చగా... లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సామాన్యులను సైతం ఓలలాడించిన మైనే ప్యార్ కియా తెలుగు, హిందీ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. సల్మాన్ కెరీర్ కి గట్టి పునాది వేసిన చిత్రంగా మైనే ప్యార్ కియా నిలిచిపోయింది.

57

మైనే ప్యార్ కియా తరువాత సల్మాన్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది హమ్ ఆప్ కే హైన్ కౌన్?. 1994లో విడుదలైన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇండస్ట్రీ విజయం సాధించింది. సల్మాన్ కి జంటగా మాధురి దీక్షిత్ నటించారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సూరజ్ బర్తాజ్యా హమ్ ఆప్ కే హైన్ కౌన్ తెరకెక్కించారు. మైనే ప్యార్ కియా మ్యాజిక్ రిపీట్ చేస్తూ... సూరజ్, సల్మాన్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ నమోదు చేశారు.

67

మాధురి దీక్షిత్ గ్లామర్, సల్మాన్ ఎనర్జీతో పాటు సూరజ్ టేకింగ్  సినిమాను అద్భుతంగా మలిచాయి. హమ్ ఆప్ కే హైన్ కౌన్ ? సైతం తెలుగులో భారీ విజయం నమోదు చేసింది. తెలుగులో ప్రేమాలయం టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. తెలుగు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా గుంపులు గుంపులుగా తమ దగ్గర్లోని థియేటర్స్ కి వెళ్లి ప్రేమాలయం సినిమా చూసేవారు.

77


ప్రేమాలయం సాంగ్స్ కూడా అత్యంత ఆదరణ దక్కించుకున్నాయి. సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ మరోసారి ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చారు. ఎస్పీ బాలు, లతా మంగేష్కర్ తమ గానంతో శ్రోతల చెవుల్లో అమృతం పోశారు.  

Aslo read Roundup 2021: తెలుగు ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన కొత్త సరుకు... 2021లో ఎంట్రీ ఇచ్చిన నయా హీరోయిన్స్

Also read 2021 Roundup: ఈ ఏడాది ఫ్లాపుల నుంచి గట్టెక్కిన హీరోలు

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved