2000 కోట్లకు పైగా ఆస్తి ఉన్నా, 1BHK ప్లాట్ లో ఉంటున్న స్టార్ హీరో ఎవరు?
ఇండియాలోనే స్టార్ హీరోలలో ఒకరు, వేల కోట్ల ఆస్తితో పాటు వై కేటగిరీ సెక్యురిటీ కలిగిటిన నటుడు. కాని సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతాడు, సింగల్ బెడ్ రూమ్ లో ఉంటూ, అప్పుడప్పుడు సైకిల్ మీద షూటింగ్స్ కు వెళ్లే హీరో ఎవరో తెలుసా?

స్టార్ హీరోల లగ్జరీ లైఫ్
సినిమా ఇండస్ట్రీ అంటేనే లగ్జరీ లైఫ్. సినిమా ఇండస్ట్రీలో కాస్త ఫేమస్ అయిన చాలు అన్ని విలాసాలు కాళ్ల దగ్గరకు వచ్చిచేరతాయి. కాస్త ఫేమస్ అయిన ప్రతీ ఒక్కరు.. చాలా లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోతుంటారు. ఇక ఇండస్ట్రీలో స్టార్స్ గా చలామణీ అయ్యేవారి గురిచైతే చెప్పనక్కర్లేదు కళ్లు చెదిరే లగ్జరీ లైఫ్ గడుపుతారు. సినిమా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో సకల సౌకర్యాలను అనుభవిస్తారు. కాని ఇక్కడ ఒక హీరో మాత్రం వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
KNOW
1 BHK ప్లాట్ స్టార్ హీరో నివాసం
రిచ్ హీరోలు భారీ భవనాలలో నివసిస్తారు. లగ్జరీ కార్లు వాడతారు. ఉదాహరణకు షారుఖ్ ఖాన్ మన్నత్ వందల కోట్లు పెట్టి కొన్నాడు.. కోట్లు పెట్టి బాగుచేయించాడు, ఇంటిముందు నేమ్ ప్లేట్ కే 25 లక్షలు ఖర్చుపెట్టాడు షారుఖ్. ఇక అమితాబ్ బచ్చన్ జల్సా అయితే ముంబయ్ లోనే కాస్ట్లీ హౌస్ అని చెప్పాలి. కాని బాలీవుడ్ లో ఒక హీరో మాత్రం ఇందుకుభిన్నంగా ఉన్నాడు. వేల కోట్లు సంపాదిస్తున్నాకాని ఆయన ఒక చిన్న 1 BHK ప్లాట్ లో ఉంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్ . బాలీవుడ్ టాప్ హీరో అయిన సల్మాన్ ఖాన్ ఇతర హీరోల లైఫ్ స్టైల్ కి విరుద్ధంగా జీవిస్తున్నాడు. దాదాపు 2900 కోట్ల ఆస్తి ఉన్నా, ఆయన ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు.
60 ఏళ్లకు అడుగు దూరంలో సల్మాన్
సల్మాన్ ఖాన్ 59 ఏళ్ల వయస్సులో ఉన్నా కూడా, బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. అయినప్పటికీ, ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఒక సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లోనే సల్మాన్ నివసిస్తున్నారని సమాచారం.
తల్లీ తండ్రుల కోసం అలా
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే, ఇతర బాలీవుడ్ స్టార్లు – షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా వంటి విలాసవంతమైన బంగ్లాల్లో నివసిస్తుంటే, సల్మాన్ మాత్రం చిన్న ఫ్లాట్‌లో జీవిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు ఆయన కుటుంబం మొత్తం అదే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం ఆ అపార్ట్మెంట్ లో పై ప్లోర్ లో మూడు బెడ్‌రూమ్స్ గల పోర్షన్ లో ఉంటున్నారు. సల్మాన్ మాత్రం కింద ఉన్న 1BHK ఫ్లాట్‌లో ఉంటారు. ఈ నిర్ణయానికి కారణం సల్మాన్ తన తల్లికి దగ్గరగా ఉండాలన్న భావనతో అక్కడే ఉంటున్నారని సమాచారం.
సింపుల్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టం
ఇంతటి స్టార్‌గా ఎదిగినా, ఆయన జీవనశైలి చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక టైమ్ లో సల్మాన్ షూటింగ్‌కి సైకిల్ మీదే వెళ్లేవాడట. ఆయనకు సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టం కాని ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ప్రమాదం ఉండటంతో సల్మాన్ ఖాన్ కు ప్రభుత్వం వై క్యాటగిరీ బద్రతను కల్పించింది. దాంతో ఆయన ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు ను కూడా కొన్నారు. ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ మధ్యనే ఆయన వెళ్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఆస్తులు
ఇక సల్మాన్ ఖాన్ పేరు మీద 2900 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం, అంతే కాదు ముంబయిలో సొంతంగా ఉండే బంగ్లా తో పాటు, పన్వెల్ ప్రాంతంలో 150 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని నెలలు అక్కడే గడుపుతారు. అక్కడ సల్మాన్ ఖాన్ స్వయంగా వ్వవసాయం కూడా చేస్తారు. ఫామ్ హౌస్ లో ఎప్పుడు ఏదో ఒక పార్టీ చేస్తూనే ఉంటారు. తనకు ఇష్టమైన వాళ్తతో ఫామ్ హౌస్ లో టైమ్ స్పెండ్ చేయడం సల్మాన్ కు చాలా ఇష్టం.