ఓటీటీలో దుమ్ములేపుతున్న 'సలాకార్'.. తప్పక చూడాల్సిన స్పై థ్రిల్లర్
ఓటీటీలో ఇటీవల విడుదలైన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సలాకార్ కి మంచి ఆదరణ లభిస్తోంది. అసలు సలాకార్ ఎలాంటి కథతో తెరకెక్కింది, నటీనటులు ఎవరు లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సలాకార్ వెబ్ సిరీస్
ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై, అదే విధంగా ఓటీటీలో స్పై థ్రిల్లర్స్ ఎక్కువగా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఓటీటీల్లో అయితే స్పై థ్రిల్లర్స్ ని వెబ్ సిరీస్ ల రూపంలో తీసుకువస్తున్నారు. ఇటీవల సలాకార్ అనే స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కెరీర్ లో జరిగిన అంశాల ఆధారంగా, కొంత ఫిక్షన్ జోడించి ఈ సిరీస్ ని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఓటీటీలో అదరగొడుతున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్
ఈ వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ 1978 అదే విధంగా ప్రజెంట్ టైం 2025 రెండు టైం పీరియడ్స్ లో సాగుతూ ఉంటుంది. 1978 నేపథ్యంలో సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ కి అవే ప్రధాన బలం. ఈ సిరీస్ లో నవీన్ కస్తూరియా, మౌని రాయ్, ముకేష్ రిషి, సూర్య శర్మ పాత్రల్లో నటించారు.
కథ ఏంటంటే
కథ విషయానికి వస్తే ప్రజెంట్ టైంలో పాకిస్తాన్ మిలటరీలో ఉన్న బ్రిగేడియర్ అస్రార్ ఖాన్ తన తాత కలని నెరవేర్చాలని అనుకుంటాడు. ఎలాగైనా పాకిస్తాన్ లో అణు పరీక్షలు విజయవంతం చేసి.. ఇండియాపై అణుబాంబు ప్రయోగించాలనేది అతడి జీవిత లక్ష్యం. 1978లో అస్రార్ ఖాన్ తాత జియా ఉల్లా పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ఉంటారు. ఆయన అప్పట్లోనే అణుపరీక్షలు విజయవంతం చేసి భారత్ పై ప్రయోగించాలని అనుకుంటాడు. కానీ జియా ఉల్లా కల చెదిరిపోతుంది.
అణు పరీక్షల నేపథ్యంలో
పాకిస్తాన్ ఇండియన్ స్పై ఏజెంట్ గా ఉన్న అధిర్ దయాల్(నవీన్ కస్తూరియా) పక్కా ప్రణాళికతో జియా ఉల్లా అణు పరీక్షలని ధ్వంసం చేస్తాడు. అసలు పాకిస్తాన్ అణు పరీక్షలని అధిర్ ఎలా కనుగొంటారు ? ఎలా ధ్వంసం చేశారు ? ప్రజెంట్ టైం లో జియా ఉల్లా మనవడు అస్రార్ ఖాన్ అయినా అణు పరీక్షలని విజయవంతం చేశాడా ? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విలన్ గా అదరగొట్టిన ముఖేష్ రిషి
నవీన్ కస్తూరియా ఇండియన్ స్పై గా అద్భుతంగా నటించారు. అదే విధంగా ప్రజెంట్ టైంలో మౌని రాయ్ కూడా రా ఏజెంట్ గా అదరగొట్టింది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పాత్రలో విలన్ గా ముఖేష్ రిషి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్పై థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి.