MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘సలార్’ షూటింగ్ పునఃప్రారంభం.. పుట్టెడు శోకంలోనూ షూట్ కు హాజరు.. సినిమాపై ప్రభాస్ గౌరవానికి ప్రశంసలు.!

‘సలార్’ షూటింగ్ పునఃప్రారంభం.. పుట్టెడు శోకంలోనూ షూట్ కు హాజరు.. సినిమాపై ప్రభాస్ గౌరవానికి ప్రశంసలు.!

రెబల్ స్టార్ కృష్ణం రాజు విషాద ఘటన నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. పుట్టెడు శోకంలోనూ డార్లింగ్ తన సినిమాలను పునఃప్రారంభించారు. తాజాగా ‘సలార్’ షూటింగ్ పై అప్డేట్ అందింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 23 2022, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ (Salaar). ఇప్పటికే చిత్ర షూటింగ్ సగానిపైగా పూర్తయ్యింది. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా నిర్మిస్తుండటంతో పాటు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వరుస షెడ్యూళ్లతో చిత్రీకరణ శరవేగంగా కొనసాగింది. కానీ ఈనెల 11న రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’(Project K) షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.  శోకసంద్రంలో మునిగిపోయిన ప్రభాస్ కాస్తా సాధారణ స్థితికి వచ్చే వరకు  షూట్ ను ఆపేసినట్టు తెలిపారు.
 

36

నిర్మాతలు ఎంతో ఖర్చు పెట్టి చిత్రాలను నిర్మిస్తుండటంతో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూవీ షూటింగ్స్ ను పునఃప్రారంభిస్తున్నారంట. ఈ మేరకు తాజాగా ‘సలార్’ చిత్రీకరణను యూనిట్ మళ్లీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మంగళవారం షూటింగ్ ను రీస్టార్ట్ చేసినట్టు సమాచారం. 
 

46

ఈ షెడ్యూల్ ను సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 27 వరకు కొనసాగించనున్నారు. అయితే కృష్ణం రాజు మరణవార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న ప్రభాస్.. అటు సినిమాలపైనా గౌరవం, అభిరుచిని చాటుకుంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రాల షూటింగ్ పునఃప్రారంభానికి సహకరిస్తున్నారు. 

56

పుట్టెడు శోకంలోనూ డార్లింగ్ తాజాగా ‘సలార్’ షూటింగ్ కు హాజరు కావడం సినిమాపై ఆయనకున్న శ్రద్ధ, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు.  మరోవైపు డార్లింగ్ పట్టుదలకు, ఫోకస్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సలార్’ షూటింగ్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

66

ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ డీవోపీల బాధ్యతలు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేలా షెడ్యూల్ చేశారు. జగపతి బాబు, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
కృష్ణంరాజు
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved