MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 2023లో పార్ట్ 2ల ట్రెండ్.. రిలీజ్ కు ముందే ప్రకటన.. సలార్, దేవర, కల్కి, పెదకాపు సహా మరిన్ని చిత్రాలు.!

2023లో పార్ట్ 2ల ట్రెండ్.. రిలీజ్ కు ముందే ప్రకటన.. సలార్, దేవర, కల్కి, పెదకాపు సహా మరిన్ని చిత్రాలు.!

టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ రావాల్సి ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే కొన్ని సినిమాలను పార్ట్ 2లుగా ప్రకటించడం 2023లో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇంతకీ ఆ లిస్ట్ లో ఏఏ సినిమాలు ఉన్నాయో తెలుసుకుంది.  

3 Min read
Shreekanth Nuthi
Published : Dec 14 2023, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో ‘సలార్’ (Salaar Cease Fire) రాబోతున్న విషయం తెలిసిందే. వారం రోజుల్లో డిసెంబర్ 22న ఈ భారీ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు ముందే పార్ట్ 1 అంటూ టీజర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సలార్ పార్ట్ 2 ఉంటుందని మేకర్సే అధికారికంగా ప్రకటించారు. 
 

211

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - కొరటాల శివ కాంబోలో మరోసారి రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దేవర’ (Devara). భారీ యాక్షన్ ఫిల్మ్ గా రానుంది. అయితే ఈ మూవీ కథ చాలా పెద్దగా ఉండటంతో రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఓ ప్రత్యేక వీడియో విడుదల చేస్తూ డైరెకర్ట్ కొరటాల శివనే ఈ విషయాన్ని వెల్లడించారు. దేవర రెండు పార్టులుగా రానుందని చెప్పుకొచ్చారు.
 

311

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు.  ఈ పాన్ వరల్డ్ మూవీ కూడా రెండు పార్టులుగా రాబోతున్నట్టు ప్రకటించారు. 2024 జనవరిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈయర్ ఎండింగ్ లో సలార్ రాబోతుండటంతో ఏం జరుగుతుందో చూడాలి. 

411

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  - సుజీత్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఫిల్మ్ OGని కూడా రెండు పార్టులుగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు, ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉండటం, కథ పరంగానూ రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

511

2023లో చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం పెదకాపు - 1. అయితే ఈచిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్ ను విడుదలకు ముందే పార్ట్1 మరియు పార్ట్ 2 (Peddha Kapu 2) ఉంటుందని టైటిల్ తోనే క్లారిటీ ఇచ్చారు. మొదటి భాగం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో.... ఆడియెన్స్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. 
 

611

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)  దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రానికి వాళ్ల నాన్న కరాటే రాజు నిర్మాత కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే దక్కించుకుంది. కొంత నెగెటివ్ నూ అందుకుంది. అయినా ఈ చిత్రానికి పార్ట్ 2 ఉంటుందని విశ్వక్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంకా దానిపై అప్డేట్ రాలేదు. 
 

711

హిట్ వెర్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్ తో హిట్ : ది కేస్ 1, హిట్ : ది పెకండ్ కేస్ తీసి సక్సెస్ అయ్యారు. నెక్ట్స్ నేచురల్ స్టార్ నానితో Hit 3ని తెరకెక్కించబోతున్నారు. Hit Verse పైనా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మరిన్ని పార్టులు రాబోతున్నాయని సైలేష్ కొలను ఓ ప్రత్యేకమైన వీడియోలు చెప్పడం విశేషం. 

811

రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రీసెంట్ ఫిల్మ్ ‘స్కంద’ (Skanda). శ్రీలీలా హీరోయిన్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కాస్తా నెగెటివ్ టాక్ ను అందుకుంది. రామ్ పోతినేని పెర్ఫామెన్స్ ను మాత్రం మెచ్చుకున్నారు ఆడియెన్స్ . అయితే ఈ ఫిల్మ్ కూ బోయపాటి పార్ట్ 2ను అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి.. అందుకున్న రిజల్ట్ తర్వాత పార్ట్ 2 ఇస్తారా? అన్నది చూడాలి. 
 

911

కమల్ హాసన్- శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’. ‘భారతీయుడు’కు సీక్వెల్ గా వస్తోంది. అయితే ఆ మధ్యలో పార్ట్ 2లోనూ చాలా రష్ ఉందని, సినిమా ఫైనల్ కట్ లో నిడివి చాలా ఎక్కువ ఉందని టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని కూడా పార్ట్ 3 ఉండబోతోందని ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. 
 

1011

ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును తెచ్చిపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’కూ సీక్వెల్ ఉంటుందని పలు మార్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ, ఏంటనేది చెప్పలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమాపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత ‘మహాభారతం’పై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. 

1111

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో Pushpa The Rise వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విడుదలతోనే పార్ట్ 2ను ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే పుష్ప2 2023లోనే రిలీజ్ ఉంటుందనుకుంటే వచ్చే ఏడాది ఆగస్టుకు డేట్ ఫిక్స్ చేశారు. 

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
Recommended image2
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Recommended image3
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved