- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధార డ్రస్సులపై సాక్షి కామెంట్స్.. కొత్త డ్రస్సులు తీసుకొచ్చిన రిషీ!
Guppedantha Manasu: వసుధార డ్రస్సులపై సాక్షి కామెంట్స్.. కొత్త డ్రస్సులు తీసుకొచ్చిన రిషీ!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 16 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి(sakshi)ప్లాన్ వేసుకుని రిషికి కాఫీ తీసుకుని రాగా అప్పుడు గౌతమ్ థాంక్స్ సాక్షి ఇలా అనుకున్నాను లేదో అలా తెచ్చావు అంటూ ఒక కాఫీ తాను తీసుకొని ఒక కాఫీ రిషి కి ఇస్తాడు. అప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి(rishi) ఏంటి నువ్వు తెచ్చావు అని అడగగా నాకు అలాంటివి ఏం పట్టింపులు లేవు అని అంటుంది సాక్షి. ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది.
అప్పుడు గౌతమ్(gautham),వసు కాఫీ తాగావా అని అడగగా అప్పుడు సాక్షి చేతిలో ప్లేట్ చూసి కావాలనే లేదు సార్ కాఫీ తాగాలని ఉంది తల బద్దలవుతుంది అని అనగా వెంటనే రిషి ఈ కాఫీ ని షేర్ చేసుకుందాం అని అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వసు(vasu),సాక్షి ఇద్దరూ పక్కపక్కన నిల్చోని కాఫీ షేర్ చేసుకొని తాగుతూ ఉండగా అది చూసి సాక్షి రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు వసు మాటలకు కోపంతో రగిలిపోతున్న సాక్షి (sakshi)ఎలా అయినా వసుని ఇరికించాలి అని అనుకొని వసుధర డ్రస్సుల గురించి మాట్లాడుతూ ఉన్న నాలుగు డ్రెస్సులు అనే పదేపదే వేసుకుంటావు అంటూ రిషి,గౌతమ్ ల ముందు అవమానిస్తుంది. మరొకవైపు జగతి(jagathi),దేవయాని లు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి సాక్షి వస్తుంది. అప్పుడు జగతి, సాక్షిని పొల్యూట్ చేయొద్దు అక్కయ్య అని అంటుంది.
ఇప్పుడు జగతి,రిషి(rishi)విషయంలో మీరు ప్లాన్ చేస్తే మర్యాదగా ఉండదు అంటూ సాక్షి దేవయాని లకు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు జగతి(jagathi)సాక్షికి వార్నింగ్ ఇస్తూ చెప్పుడు మాటలు వినకు అని అంటుంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు జరిగినవన్నీ రిషికీ చెబితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి అంటూ వారిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జగతి.
రిషి(rishi) విషయంలో ఇంకొక్క ప్లాన్ వేసినా కూడా మొత్తం జరిగినవన్నీ రిషికీ చెబుతాను అని అంటుంది జగతి. జగతి మాటలకు దేవాయని సాక్షి, దేవయాని వనికి పోతారు. జగతి దేవయానికి కౌంటర్ ఇచ్చి మళ్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జగతి, మహేంద్ర(Mahendra)ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు దేవయాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.
మరొకవైపు జగతి దగ్గరికి వసు వెళ్లి ప్రాజెక్ట్ గురించి జగతితో మాట్లాడుతూ ఉండగా, అప్పుడు జగతి ఈ ప్రాజెక్ట్ అయిపోని రిషి(rishi)సార్ పక్కలోనే ఉండాలి అని చెబుతుంది. నా కొడుకు కంఫర్ట్ గా ఉండాలి అన్నా మన ఎండి గారు డిగ్నిఫైడ్ గా ఉండాలి అన్నా నువ్వు పక్కన తప్పనిసరిగా రిషి పక్కన ఉండాలి అని చెబుతుంది జగతి(jagathi). ఇంతలోనే అక్కడికి సాక్షి వస్తుంది. అప్పుడు సాక్షి కీ జగతి తన మాటలతో స్ట్రాంగ్ గా బుద్ది చెబుతుంది.
అప్పుడు సాక్షి(sakshi)ఎంత చెప్పినా కూడా వినకుండా మీ అబ్బాయిని నాకు ఇవ్వండి అని అనడంతో సాక్షి మాటలకు వసు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు సాక్షికీ జగతి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధార(vasu)కోసం రిషి కొత్త బట్టలు తీసుకొని వస్తాడు. ఇంతలో సాక్షి అక్కడికి వచ్చి ఆ బట్టలను చూసి ఒకసారిగా షాక్ అవుతుంది.