- Home
- Entertainment
- Guppedantha manasu: షాకింగ్ ట్విస్ట్.. రిషీతో పెళ్లి వద్దనుకున్న సాక్షి.. ఆనందంలో జగతి, మహేంద్ర!
Guppedantha manasu: షాకింగ్ ట్విస్ట్.. రిషీతో పెళ్లి వద్దనుకున్న సాక్షి.. ఆనందంలో జగతి, మహేంద్ర!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే సాక్షి రిషి అని గట్టిగా అరిసి లెగుస్తుంది.ఉంగరం మీద ఎవరి అక్షరం ఉంది? నా మొదటి అక్షరంతో ఉంగరం చేయించమంటే ఇక్కడ వి అని ఎందుకు ఉంది. నువ్వు చెప్పు రిషి అసలు ఇక్కడ వి అని ఎందుకు ఉంది అని అడగగా రిషి సారీ అని అంటాడు. సారీ ఆ? వేరే ధ్యానంలో ఉన్నావా? లేకపోతే వసుధార ప్రేమ ధ్యానంలోనే ఉన్నావా అని అంటుంది. అప్పుడు దేవయాని ఏదో ఉంగరంలో అక్షరం కోసం ఎందుకు సాక్షి ఇదంతా అని అంటుంది.
అప్పుడు సాక్షి, ఇది ఉంగరంలో అక్షరంతో ఆగిపోదు ఆంటీ జీవితాంతం అదే పేరుతో నేను బతకలేను. పెళ్లయ్యాక వసు కాఫీ తీసుకురా,వసు కాలేజ్ కి వెళ్తున్నాను అని అంటే ఆ పేరుతో నేను బతకలేను ఆంటీ.జీవితాంతం వసుధార వసుధార అని గడపాలి నాకు అలాంటి జీవితం వద్దు.ముందే జగతి ఆంటీ చెప్పారు అని అనగా దేవయాని జగతి తో,సాక్షి మనసు విరిగేటట్టు నువ్వు తనకి ఏం చెప్పావు అని అరుస్తుంది. అప్పుడు సాక్షి జగతి ఆంటీ నా మనసు విరిగేటట్టు ఏమీ చెప్పలేదు ఆవిడని తప్పు పడడానికి ఏమీ లేదు.
ముందే చెప్పారు రిషి మనసులో నువ్వు లేవు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని నేనే నమ్మలేదు.కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది సాక్షి.నాకు ఇంక ఈ ఎంగేజ్మెంట్ వద్దు ఈ పెళ్లి వద్దు, నువ్వు వద్దు, నీ కుటుంబం వద్దు. నువ్వు మీ తల్లిని కాదంటే తనదే తప్పు అనుకున్నాను కానీ నీదే తప్పు నీకే ప్రేమించడం రాదు. నీకో దండం, నీ ప్రేమకో దండం, నీ పెంపకానికో దండం అని అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి. సాక్షి ఆ ఉంగరాన్ని నేలకు విసురుతోంది.
అది వాసుదార పాదాలకు వెళ్లి తాకుతుంది.ఈ మాటలు అన్నీ విన్న కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంతో ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అనుకుంటారు.ఆ తర్వాత సీన్లో వసు నడుస్తూ ఉండగా సాక్షి అక్కడికి వచ్చి నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా వసుధార నువ్వు అనుకున్నదే అయింది రిషితో పెళ్లి ఆగిపోయింది బయటికి ఇలా ఉన్న లోపల బాగా నవ్వుతూ ఉండుంటావు కదా అని అనగా మనం గెలవాలి అనుకుంటే ఎప్పటికైనా గెలుస్తాం సాక్షి.
కాని పక్కవాళ్లు ఓడిపోవాలి నాశనం అయిపోవాలి అనుకుంటే ఎప్పటికీ గెలవలేము అని అనగా రిషి అదే సమయంలో అక్కడికి వస్తాడు. అప్పుడు సాక్షి వసుధారతో నువ్వు రిషి ప్రేమని కాదని మంచి పని చేశావు.తనకి ప్రేమించడం రాదు అని నువ్వు ముందే గ్రహించావు. ఇప్పుడు నాతో నిశ్చితార్థం పెట్టుకొని నీ పేరు చెప్పాడు.నీతో నిశ్చితార్థం అయితే ఇంకెవరి పేరు చెప్తాడు. గుడ్ బై రిషి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను అంటే తిరిగి రానని కాదు.
నా శాపం నేను పడే బాధ ఏదో ఒక రోజు నువ్వు అనుభవించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ మనసులో నాకు దక్కని నిన్ను ఎవరికి దక్కనివ్వను. చివరికి నీకు ఏది మిగలకుండా చేస్తాను అని అనుకుంటుంది.దాని తర్వాత వాసుదార కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఈ లోగ మహీంద్రా రిషి దగ్గరికి వచ్చి గట్టిగా హద్దుకొని నేను చాలా తిట్టుకున్నాను రిషి సారీ అని చెప్పి ఆఖరికి పెళ్లి ఆగిపోయింది ఎంతో సంతోషంగా ఉంది అని అంటాడు.
ఆ తర్వాత సీన్లో గౌతం కిచెన్ లో ధరణికి స్వీట్లు చేయమని అడుగుతాడు అప్పుడు జగతి స్వీట్లు ఉన్నాయి కదా అని అనగా అవి నిశ్చితార్థం కోసం చేసిన స్వీట్లు ఆగిపోయినందుకు సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఇంకా స్వీట్లు కావాలి అని అంటాడు.సరే చేస్తాను అని ధరణి అనగా దేవయాని అక్కడికి వచ్చి ఒక వైపు నిశ్చితార్థం ఆగిపోతే మీరు స్వీట్లు తింటున్నారా ధరణి ఈ మధ్య నీకు ధైర్యం బాగా వచ్చినట్టుంది కదా అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయ భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!