- Home
- Entertainment
- Virupaksha Review: విరూపాక్ష ప్రీమియర్ టాక్.. వెన్నులో వణుకు పుట్టుద్ది, తేజుకి సాలిడ్ కంబ్యాక్
Virupaksha Review: విరూపాక్ష ప్రీమియర్ టాక్.. వెన్నులో వణుకు పుట్టుద్ది, తేజుకి సాలిడ్ కంబ్యాక్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్ర ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన తొలి చిత్రం ఇది.దీనితో తేజు ఎలా పెర్ఫామ్ చేశాడు అనే ఉత్కంఠ అందరిలో ఉంది.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్ర ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన తొలి చిత్రం ఇది.దీనితో తేజు ఎలా పెర్ఫామ్ చేశాడు అనే ఉత్కంఠ అందరిలో ఉంది. తేజుకి ఇది రీఎంట్రీ లాంటి చిత్రం కావడంతో ఎలాంటి సక్సెస్ సాధించబోతోంది అని మెగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మూఢనమ్మకాలు, చేతబడి లాంటి ఉత్కంఠ భరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుండడం విశేషం. మరి ప్రీమియర్స్ నుంచి విరూపాక్ష చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోందో చూద్దాం.
భయాన్ని కలిగించే సెటప్ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశంతో ఈ చిత్రం పార్రంభం అవుతుంది. 1979 నేపథ్యంలో ఓపెన్ అయిన మూవీ మళ్ళీ 1991 కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు భయానకంగా ఉంటాయి. దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష చిత్రం కోసం అద్భుతమైన కథనే సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు.
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టేశారు. చాలా సన్నివేశాలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో లీడ్ పెయిర్ మధ్య లవ్ సీన్స్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ ప్రధాన కథలోని అంశాలు మాత్రం సూపర్బ్ గా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ కి కావాల్సిన విధంగా బిజియం కూడా అదిరిపోయింది. స్క్రీన్ ప్లే చాలా బావుంది.
దర్శకుడు కార్తీక్ దండు ఎలాంటి డీవియేషన్ లేకుండా నేరుగా కథని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. కొన్ని చోట్ల ఈ చిత్రం స్లోగా సాగినప్పటికీ అది పెద్ద మైనస్ కాలేదు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన గురించి తప్పకుండా ప్రశంసించాల్సిందే. కొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడు ముందుగా చెప్పినట్లుగా వణుకు తెప్పించే విధంగా ఉంటాయి.
ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ సెకండ్ హాఫ్ లో పెరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి కథ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ గ్రామం యొక్క బ్యాక్ స్టోరీ మంచి థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటుంది. అరుంధతి తర్వాత అంత పక్కాగా డీల్ చేసిన హర్రర్ థ్రిల్లర్ గా కామెంట్స్ మొదలయ్యాయి. సౌండ్ మిక్సింగ్ అయితే టాప్ నాచ్ అని అంటున్నారు.
ఓవరాల్ గా విరూపాక్ష చిత్రం బ్రిలియంట్ గా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు హర్రర్ థ్రిల్లర్ ని ఎంచుకుని మ్యాజిక్ చేశారు. సాయిధరమ్ తేజ్ తన రాక్ సాలిడ్ పెర్ఫామెన్స్ తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చారు. ఇంతకు ముందెప్పుడూ చూడని కథ, సినిమాటోగ్రఫీ, బిజియం ,సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో హైలైట్స్ గా చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద రానున్న రోజుల్లో విరూపాక్ష మ్యాజిక్ ఎలా ఉండబోతోందో చూడాలి.