- Home
- Entertainment
- అబ్బాయికి లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. చితక్కొట్టిన పేరెంట్స్.. సీక్రెట్ బయటపెట్టిన లేడీ పవర్‌స్టార్..
అబ్బాయికి లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. చితక్కొట్టిన పేరెంట్స్.. సీక్రెట్ బయటపెట్టిన లేడీ పవర్‌స్టార్..
నేచురల్ బ్యూటీగా, నేచురల్ నటనతో, అద్భుతమైన డాన్సుతో ఫిదా చేసే సాయిపల్లవి కోట్లాది మందిని అభిమానులుగా చేసుకుంది. కానీ తనకు ఎవరంటే ఇష్టమో తెలుసా? ఆ సీక్రెట్‌ని తాజాగా బయటపెట్టింది.

సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు లేడీ పవర్‌స్టార్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. జయాపజయాలకు అతీతంగా ఆమె క్రేజ్‌ని ఫాలోయింగ్‌ని పెంచుకుంది. మంచి ప్రశంసలందుకుంది. ఆమె నటనకు, డాన్సులకు ఎంతో మంది అభిమానులుగా మారిపోతుంటారు. ఆమెని ఇష్టపడుతుంటారు. చాలా మంది కుర్రాళ్లు సాయిపల్లవిపై క్రష్ ఏర్పర్చుకుంటారు. మరి సాయిపల్లవికి నచ్చిన కుర్రాడెవరనేది సస్పెన్స్?
మరోవైపు సాయిపల్లవిపై ఇటీవల మ్యారేజ్ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి బయటపెట్టింది సాయి పల్లవి. తన లవ్ లెటర్ కూడా రాసిందట.
సాయిపల్లవి, రానా(Rana) కలిసి `విరాటపర్వం`(Virataparvam) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీల పడగా, తాజాగా అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా `బిగ్ బాస్` ఫేమ్ గంగవ్వతో కలిసి చిట్‌చాట్ నిర్వహించారు. అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇందులో సాయిపల్లవి చెప్పిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సాయిపల్లవి ఈ చిట్‌చాట్‌లో తన స్కూల్ నాటి ప్రేమ కథని వెల్లడించింది. `విరాటపర్వం`లో రవన్న(రానా)ని ప్రేమించి ఆయన కోసం కొన్ని లేఖలు కూడా రాసుకుంటుంది. అలా రియల్ లైఫ్‌లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా? అని గంగవ్వ ప్రశ్నించగా, అసలు విషయం బయటపెట్టింది సాయిపల్లవి. రియల్ లైఫ్‌లో తాను ఒక్కసారి ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాసినట్టు చెప్పింది.
తను ఏడో తరగతిలో ఉన్నప్పుడు అని, ప్రేమ లేఖ రాసినందుకు ఇంట్లో దొరికిపోయానని తెలిపింది. దీంతో అమ్మానాన్న తనని చితక్కొట్టినట్టు వెల్లడించింది సాయిపల్లవి. అదొక మెమరీ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్ అవుతుండటం విశేషం.
ఇక ప్రస్తుతం సాయిపల్లవి నటించిన తమిళ చిత్రం `గార్గి` తెలుగులోనూ ఈ నెల 15న విడుదలవుతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముచ్చటించిన ఆమె `విరాటపర్వం` ఫెయిల్యూర్‌పై స్పందించింది. తాను పాత్ర, కథ నచ్చి చేశానని, రిజల్ట్ గురించి ఆలోచించనని తెలిపింది. పాత్రకి న్యాయం చేశానా? తన మనసుకు సంతృప్తినిచ్చిందా? అనేది ముఖ్యమని తెలిపింది. ఆ సినిమా విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని, రిజల్ట్ మన చేతుల్లో ఉండదని తెలిపింది.
సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన `గార్గి`(Gargi) చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడలో విడుదల చేస్తున్నారు. తెలుగులో రానా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి టీచర్‌గా కనిపించనుంది. తాను వరుసగా బరువైన పాత్రల్లో నటించానని, నెక్ట్స్ కమర్షియల్ వేలో ఉండే `కిల్ బిల్` లాంటి యాక్షన్ కామెడీ సినిమాలు చేయాలనుందని పేర్కొంది సాయిపల్లవి.