సాయి తేజ 'సోలో బ్రతుకే సో బెటర్' రివ్యూ

First Published Dec 25, 2020, 12:54 PM IST

చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్‍కి క్యూ కడుతోంటే సాయి ధరమ్‍ తేజ్‍ మాత్రం అంతవరకు ఆగకుండా డిసెంబరులోనే రిస్క్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో ప్రతిరోజూ పండగే లాంటి హిట్టొచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్‍ ఫాలో అవుతున్నాడు. 
 
దాదాపు తొమ్మిది నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కళకళ్లాడుతున్నాయి. ధైర్యం చేసి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్  థియోటర్స్లోకు దూకాడు. ఇంక జనాలదే ఆలస్యం. ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో సెకండ్ వేవ్ అంటూ ప్రపంచం భయపడుతున్న  సమయంలో థియేటర్స్ కి వెళ్ళాలా వద్దా అన్న టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే మాస్క్ సాయింతో మిగితా అన్ని పనులు చేసుకుంటూ  ఉన్నప్పుడు సినిమా హాల్స్ కి వెళ్ళడానికి…ఇబ్బంది ఏమిటి అని కొందరు ఆలోచలో పడి థియోటర్స్ వైపు అడుగులు వేయచ్చు. అయితే ఆ  సాహసం చేసేటంత ఉత్సాహం ఇచ్చే సినిమా కావాలి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 400 పైగానే థియేటర్స్ లో రిలీజైంది.  ఈ నేపధ్యంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే ఇండస్ట్రీ కు ధైర్యం వస్తుంది. ఆ స్దాయిలో సినిమా ఉందా..హిట్  బొమ్మేనా..థియోటర్స్ కు మళ్లీ మునపటి కళ తెచ్చే సినిమాయేనా..కథేంటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

విరాట్ (సాయి తేజ్) కొద్దిగా విభిన్నమైనవాడు. ప్రేమ,పెళ్లి వంటి కాన్సెప్టులకు పూర్తిగా దూరం. బ్రహ్మచారి జీవితమే హ్యాపి అని, రాజ్యాంగం  హాయిగా,స్వేచ్చగా బ్రతకమనే హక్కు మనకు ఇస్తే ..పెళ్లి పేరు చెప్పి మనం ఆ హక్కుని కాలరాస్తున్నామని బందీలమవుతున్నామని ఇలా  బోలెడు మాటలు చెప్తూంటాడు. అంతేకాకుండా ప్రేమలో ఉన్న వారిని కూడా విడదీస్తూ ఉంటాడు. ఇలా అతను మాట్లాడటానికి,మారటానికి  కారణం అతని మామయ్య (రావు రమేష్). అతనే ఇలాంటి ఆలోచనలను ఇతని బుర్రలో ఇంజెక్ట్ చేసి ఉంటాడు.

బ్రహ్మచారిగా బ్రతుకుతున్న ఆర్.నారాయణమూర్తిని ఆదర్శంగా తీసుకుని అలా కంటిన్యూ అయ్యిపోతూంటాడు. తన చుట్టు ప్రక్కల వాళ్లను  తన పంధాలోకి రమ్మని మోటివేట్ చేస్తూంటాడు. అలా హాయిగా సోలో బ్రతుకే సో బెటర్ అని పాడుకుంటున్న అతని జీవితం హైదరాబాద్ కు  ఉద్యోగ నిమిత్తం రావటంతో గుండె జారి గల్లంతైంది అనే పరిస్దితికి లీడ్ చేస్తుంది.

అక్కడ అమృత (నభ నటేష్) అనే అమ్మాయికు వెన్నెల కిషోర్ తో పెళ్లి జరగాల్సి ఉంటుంది. అయితే తను ఆల్రెడీ విరాట్ ని ప్రేమలో ఉన్నానని  చెప్పి ఆమె ఆ పెళ్లి కాన్సిల్ చేసేస్తుంది. ఇంతకీ అమృత ఎవరు..ఆమె విరాట్ తో ప్రేమ నిజమైందేనా..ఆమె పెళ్లి, ప్రేమ అంటే ఆమడ దూరంలో  ఉండే విరాట్ కు ఎందుకు ప్రపోజ్ చేసింది?అప్పుడు విరాట్ ఏం చేసాడు. అతని ధృక్పదంలో మార్పు ఏమన్నా వచ్చిందా...అమృతతో ప్రేమలో  పడ్డాడా,అతని ఆలోచనలలో ఏ మార్పులు వచ్చాయి...అసలు విరాట్ మామయ్య రావు రమేష్ ..అతనికి ప్రేమ,పెళ్లి మీద నెగిటివ్ గా ఎందుకు  నూరిపోసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది.. ఇలాంటి సింగిల్ లైన్ లైటర్ వీన్ సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే జంధ్యాల రాసినటువంటి క్యారక్టర్ ఫన్ , త్రివిక్రమ్ రాసేటటువంటి డైలాగుల సపోర్ట్  ఉండాలి. కానీ ఈ సినిమాకు ఆ రెండింటిలో ఒకటి లేదు. ప్రేమ,పెళ్లి,సంసారం అంటే ఇష్టం లేని హీరో ఏం జరిగి వాటిని తన జీవితంలోకి  ఆహ్వానించాడు అనే పాయింట్ వినటానికి బాగానే ఉంటుంది. అయితే ఏం జరిగి అన్న పాయింట్ దగ్గరే సరైన రీజన్ తో సీన్స్ లేకపోతే తేడా  కొడుతుంది. అదే ఈ సినిమాకు జరిగింది. చూస్తున్నంతసేపు ఏదో కామెడీ నడిచిపోయింది. కానీ ఫైనల్ గా ఏం చూసాము అని ఆలోచిస్తే  ...ఏమీ లేదే అనిపిస్తుంది.

వాస్తవానికి పెళ్లంటే ఇష్టం లేని హీరోలు కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలాగే అలాంటివాడు హీరోయిన్ తో  ప్రేమలో పడతాడని కొత్తగా సినిమాలు చూడటం మొదలెట్టినవాడు సైతం కనిపెట్టేస్తాడు. ఇదంతా ఓ ఫార్ములా స్క్రీన్ ప్లే. అయితే దీన్ని బ్రేక్ చేస్తే  ఖచ్చితంగా మనం ఈ డైరక్టర్ గురించి గొప్పగా మాట్లాడుకుందుము. ఈ సినిమాతో పరిచయమైన సుబ్బు ...రూల్స్ ని బ్రేక్  చేయాలనుకోదు..కొత్త రూల్స్ ని క్రియేట్ చేసే ఆలోచనా లేదు. కేవలం కాస్త కామెడీని క్రియేట్ చేసి పాత కథను కొత్తగా నడపాలనుకున్నాడు.

జంధ్యాల గారు గతంలో ఇలాంటి కామెడీ పాత్రలు క్రియేట్ చేసి రాజేంద్రప్రసాద్ చేత చేయించేసారు. అయితే అవన్నీ ప్రక్కన పెడితే ఫార్ములా  కథతో ఓ సమస్య. కథలో టెంపో ఉండనివ్వదు. అప్పటికీ ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ గానే లాగారు. ఎంటర్టైన్మెంట్ తో టైమ్ తెలియలేదు. అయితే  సెకండాఫ్ కు వచ్చేసరికే ప్రెడిక్టుబులిటీ బాగా పెరిగిపోయింది. నెక్ట్స్ ఏం జరుగుతోందో ఊహకు అందేస్తుంది. దాంతో తెరపై సీన్స్ వెళ్తూంటాయి.  మనం చూస్తూంటాము. కానీ ఎగ్జైట్ అవ్వము.

దానికి తోడు హీరో,హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త  ఎంగేజ్ చేయకపోతే బాగా బోర్ వచ్చేసేది. అలాగే హీరో క్యారక్టరైజేషన్ లో ఆర్క్ ఉంటుంది కానీ అందుకు లీడ్ చేసే సంఘటనలే చాలా సిల్లీగా  అనిపిస్తాయి. పాత కథను కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాలి. కొత్త కథను అర్దమయ్యేలా పాత స్క్రీన్ ప్లేతో చెప్పగలగాలి. అదే ఈ సినిమాకు  జరగాల్సింది. కానీ జరగలేదు. లవ్ స్టోరీలో కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ ని సరిగా రిజిస్టర్ చేయకపోవడం వలన ప్రీ క్లైమాక్స్ నుంచీ సాగతీత  కార్యక్రమంలా అనిపించింది.

బాగున్నవి  సాయితేజ్ ఫెర్‌ఫార్మెన్స్ వెటకారంతో కూడిన రావు ర‌మేష్ నటన ఫ‌స్టాఫ్ కామెడీ సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోష‌న‌ల్ డైలాగ్స్ బాగోలేనివి సెకండాఫ్  క్లైమాక్స్ ఊహించగలిగేయటం

టెక్నికల్ గా.. డైరక్టర్ గా సుబ్బు మేకింగ్ పరంగానూ తనదైన ముద్ర వేయలేకపోయారు. అలాగని మేకింగ్ బాగోలేదని కాదు. ప్రత్యేకత ఏమీ లేదు. స్క్రిప్టు  గొప్పగా లేదు. అయితే వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. థమన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా  బాగున్నాయి. ఎడిటింగ్ ..ఫస్టాఫ్ లో సీన్స్ పరుగెత్తినా, సెకండాఫ్ లో చాలా లాగ్ లతో విసుగెత్తించింది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ సైతం స్పెషల్ గా  కొన్ని సీన్స్ లో కనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెద్ద బ్యానర్ స్దాయికి తగినట్లే ఉన్నాయి.

నటీనటుల్లో సాయి ధరమ్ తేజ.. విరాట్ పాత్రకు వంద శాతం న్యాయం చేసారు. డైలాగ్ మోడ్యులేషన్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. నభ  నటేష్ చూడటానికి గర్ల్ నెక్ట్స్ డోర్ లా అనిపించింది..నటనలోనూ సాయి కు పోటీ ఇచ్చింది. కీలకమైన పాత్రలో రావు రమేష్ మరోసారి  తనదైన స్టైల్ ని చూపించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, నరేష్ లు ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు. హీరో ఫ్రెండ్ పాత్రలో సత్య కొంతవరకూ  బాగానే నవ్వించాడు. వెన్నెల కిషోరే స్దాయే తగ్గించారు.

ఫైనల్ థాట్  పాత పాయింట్ ని ఎత్తుకుంటే పాత సీన్సే పుడతాయి. పాత ఎప్పుడూ రోతే. --సూర్య ప్రకాష్ జోస్యుల Rating:2.5

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?