40 ఏళ్ళ వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
మెగా ఫ్యామిలీలో మరో హీరో పెళ్లి కబురు చెప్పేశారు. నాలుగు పదుల వయసులో సాయిధరమ్ తేజ్ వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

మెగా ఫ్యామిలీలో వరుస సంబరాలు
మెగా ఫ్యామిలీలో వరుసగా సంబరాలు నెలకొంటున్నాయి. అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నయనిక అనే అమ్మాయితో అల్లు శిరీష్ నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం జరగనుంది. మరోవైపు ఇటీవల లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. త్వరలో రాంచరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనివ్వబోతున్నారు. ఇలా మెగా అభిమానులకు వరుస శుభవార్తలు ఎదురవుతున్నాయి.
పెళ్లి కబురు చెప్పిన సాయి ధరమ్ తేజ్
తాజాగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశాడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తాను వివాహం చేసుకోబోతున్నట్లు రివీల్ చేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న సంబరాల ఏటి గట్టు మూవీ రిలీజ్ తర్వాత తన పెళ్లి ఉంటుందని తేజు క్లారిటీ ఇచ్చేశాడు.
నాలుగు పదుల వయసుకి చేరువలో
సాయిధరమ్ తేజ్ ఇంత క్లియర్ గా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆల్రెడీ సంబంధం చూసేసి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి ధరమ్ వయసు 39 ఏళ్ళు. వచ్చే ఏడాది తేజు పెళ్లి చేసుకునే సమయానికి అతడి వయసు 40కి చేరుతుంది. టాలీవుడ్ లో 40 ప్లస్ దాటినా ఇంకా పెళ్లి చేసుకొని బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు.
సాయి ధరమ్ తేజ్ డేటింగ్ రూమర్స్
గతంలో సాయిధరమ్ తేజ్ విషయంలో చాలా డేటింగ్ రూమర్స్, లవ్ ఎఫైర్స్ వినిపించాయి. చాలా సార్లు తనకి ప్రేమ విషయంలో హార్ట్ బ్రేక్ అయింది అని తేజు ఓపెన్ గా చెప్పాడు.
సాయి ధరమ్ తేజ్ సినిమాలు
అయితే సాయిధరమ్ తేజ్ వివాహం చేసుకునే అమ్మాయి ఎవరు అనేది ఇప్పటికైతే సస్పెన్స్. సాయిధరమ్ తేజ్ 2014లో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తేజు బైక్ యాక్సిడెంట్ కి గురై కోలుకున్న సంగతి తెలిసిందే.