MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఐబొమ్మ ప్రెస్ మీట్ లో గేమ్ ఛేంజర్, ఓజీకి జరిగిన నష్టంపై చిరంజీవి కామెంట్స్.. రాజమౌళి మాస్ వార్నింగ్ ఇదే

ఐబొమ్మ ప్రెస్ మీట్ లో గేమ్ ఛేంజర్, ఓజీకి జరిగిన నష్టంపై చిరంజీవి కామెంట్స్.. రాజమౌళి మాస్ వార్నింగ్ ఇదే

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత వీసీ సజ్జనార్ ఇండస్ట్రీ ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, దిల్ రాజు లతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 17 2025, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐబొమ్మపై ఇండస్ట్రీ ప్రముఖులతో సజ్జనార్ ప్రెస్ మీట్
Image Credit : Asianet News

ఐబొమ్మపై ఇండస్ట్రీ ప్రముఖులతో సజ్జనార్ ప్రెస్ మీట్

టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వదిలించేందుకు హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. పోలీసులకే ఛాలెంజ్ విసురుతూ తప్పించుకుని తిరుగుతున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో సజ్జనార్ టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అన్నారు. ఈ భేటీలో దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి,  సురేష్ బాబు పాల్గొన్నారు. భేటీ తర్వాత వీరంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు, 20 కోట్ల సంపాదన 
Image Credit : Asianet News

హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు, 20 కోట్ల సంపాదన 

 ఈ మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ రవికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. సినీ పరిశ్రమకు పైరసీ వల్ల భారీ నష్టం జరుగుతోందని సజ్జనార్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్‌ చట్టం కింద మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అంతకుముందు పైరసీకి పాల్పడిన ప్రశాంత్‌, శివరాజ్ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే, ఇమ్మడి రవి కేవలం పైరసీనే కాకుండా బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌లో కూడా పాల్గొంటూ సమాజానికి హాని చేశాడని చెప్పారు. ఒక సైట్‌ను బ్లాక్‌ చేస్తే వెంటనే మరో డొమైన్‌ సృష్టించి, మొత్తం 65 మిర్రర్‌ సైట్లు నిర్వహించినట్టు వెల్లడించారు. అతడి వద్ద ఉన్న హార్డ్‌డిస్క్‌లో 21 వేలకుపైగా సినిమాలు ఉన్నాయని, 1972లో వచ్చిన గాడ్‌ఫాదర్ నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వరకు అన్నీ దొరికాయని తెలిపారు. పైరసీ ద్వారా రవి సుమారు 20 కోట్లు సంపాదించగా, అందులో 3 కోట్లు పోలీసులు సీజ్ చేసినట్టు సజ్జనార్ తెలిపారు. అదేవిధంగా అతడి వద్ద 50 లక్షల మంది వినియోగదారుల డేటా దొరికిందని, ఇంత భారీ డేటా ఒక వ్యక్తి చేతుల్లో ఉండటం ప్రమాదకరమని సజ్జనార్ అన్నారు. 

Related Articles

Related image1
నిఖిల్, గౌరవ్ ల రెమ్యునరేషన్ ఇదే..బిగ్ బాస్ హౌస్ లో కనిపించలేదు, ముక్క తెలుగు రాదు అయినా ఇంత భారీగా ఇచ్చారా ?
Related image2
సినిమా ఆఫర్ అని చెప్పి ఎంత వల్గర్ గా అడిగాడో తెలుసా, నా భర్తకి స్పీకర్ లో వినిపించా..సుష్మ భూపతి కామెంట్స్
35
ఓజీ, గేమ్ ఛేంజర్ పై పైరసీ దెబ్బ : చిరంజీవి
Image Credit : Asianet News

ఓజీ, గేమ్ ఛేంజర్ పై పైరసీ దెబ్బ : చిరంజీవి

అనంతరం దిల్ రాజు, చిరంజీవి మాట్లాడారు. ఐబొమ్మ నిర్వాహకులని అరెస్ట్ చేయడం హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం. ఈ సందర్భంగా టాలీవుడ్ తరుపున సజ్జనార్ గారికి, హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు దిల్ రాజు అన్నారు. మీ ఇంట్లో ఒక చైన్ పోతేనే మీ కుటుంబం మొత్తం షేక్ అవుతుంది. అలాంటిది కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి అయిన సినిమాని దొంగిస్తే మాకు ఏ స్థాయిలో నష్టం కలుగుతుందో ఆలోచించండి అని దిల్ రాజు కోరారు.  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పైరసీ మహమ్మారి ఇండస్ట్రీని వేధిస్తోంది. పైరసీ ప్రభావం కేవలం నిర్మాతలు, స్టార్ హీరోలపైనే కాదు.. సినిమా కోసం కష్టపడే లైట్ బాయ్, ఆఫీస్ బాయ్ పైన కూడా పడుతుంది. గతంలో సిసి ఆనంద్ కొందరి పైరసీ నిర్వాహకులని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సజ్జనార్ గారు దానిని కొనసాగిస్తున్నారు. ఇటీవల పైరసీ వల్ల దిల్ రాజు గారి గేమ్ చేంజర్ సినిమాతో పాటు కింగ్డమ్, ఓజీ, తండేల్ లాంటి చిత్రాలు నష్టపోయాయి. ప్రస్తుతం రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటిస్తూ అత్యంత భారీ సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పైరసీ ని అరికట్టే బాధ్యత అందరిపై ఉంది అని చిరంజీవి అన్నారు. 

45
ఇదంతా సినిమా సీన్ లా ఉంది: రాజమౌళి
Image Credit : Asianet News

ఇదంతా సినిమా సీన్ లా ఉంది: రాజమౌళి

సినిమాల్లో విలన్ హీరోకి ఛాలెంజ్ చేసినట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులపై ఛాలెంజ్ చేశాడు. ఇదంతా సినిమా సీన్ లాగా ఉంది. ఇక్కడ ఏదీ ఫ్రీగా రాదు. ప్రతి ప్రోడక్ట్ వెనుక చాలా మంది కష్టం ఉంటుంది. పైరసీ చేసేవాళ్ళు సంఘ సేవ చేయట్లేదు. వాళ్ళు మీకు ఫ్రీ గా సినిమా చూపిస్తున్నారు అని మీరు భావించవచ్చు. కానీ ఇంత నెట్వర్క్ నిర్వహించాలంటే వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు మీ డేటా దొంగిలించడం వల్లే వస్తోంది. మీ సమాచారాన్ని వాళ్ళు క్రిమినల్స్ కి అమ్ముకుంటున్నారు అని రాజమౌళి అన్నారు. ఫ్రీగా సినిమా చూడడం వల్ల మాకంటే మీకే ఎక్కువ నష్టం అని జక్కన్న తెలిపారు. 

55
మా ఫ్యామిలీలో ఒకరు డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు: నాగార్జున
Image Credit : Asianet News

మా ఫ్యామిలీలో ఒకరు డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు: నాగార్జున

అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ సినిమా చూడడం వల్ల మీ డేటా దొంగిలించబడుతుంది. పైరసీ అనేది బిగ్ ట్రాప్. దీని వెనుక పెద్ద కథే ఉంది. మా ఫ్యామిలిలో కూడా ఒకరు ఇలాంటి డిజిటల్ లింకులు క్లిక్ చేయడం వల్ల డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు. పోలీసులకు కంప్లైంట్ చేసే లోపే తప్పించుకున్నారు అని అన్నారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఐబొమ్మ
ఏషియానెట్ న్యూస్
వినోదం
అక్కినేని నాగార్జున
దిల్ రాజు
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Related Stories
Recommended image1
నిఖిల్, గౌరవ్ ల రెమ్యునరేషన్ ఇదే..బిగ్ బాస్ హౌస్ లో కనిపించలేదు, ముక్క తెలుగు రాదు అయినా ఇంత భారీగా ఇచ్చారా ?
Recommended image2
సినిమా ఆఫర్ అని చెప్పి ఎంత వల్గర్ గా అడిగాడో తెలుసా, నా భర్తకి స్పీకర్ లో వినిపించా..సుష్మ భూపతి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved