'బ్రో' మూవీలో పవన్ కి పొలిటికల్ డైలాగ్స్ ? రాజకీయాల్లో మావయ్యకి మద్దతుపై తేజు ఏం చెప్పాడంటే
సాయి ధరమ్ తేజ్ తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. మామ అల్లుళ్ళు కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. మామ అల్లుళ్ళు కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అలరించాయి. క్రమంగా బ్రో మూవీపై ఆడియన్స్ లో ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ తమిళ వర్షన్ కి పూర్తి భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ సముద్రఖని తెలిపారు. ఆ విధంగా త్రివిక్రమ్ కథని పూర్తిగా మార్చేసినట్లు పేర్కొన్నారు. ఏది ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైన చిత్రం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన నటించే చిత్రాలకు గురించి కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతూ ఉంటుంది.
Bro Movie
వకీల్ సాబ్ చిత్రంలో పవన్ డైరెక్ట్ గానే కొన్ని పొలిటిల్ డైలాగ్స్ పేల్చారు. ఇక భీమ్లా నాయక్ లో కూడా పరోక్షంగా పొలిటికల్ డైలాగ్స్ ఉన్నట్లు ఫ్యాన్స్ అన్వయించుకున్నారు. మరి బ్రో చిత్రంలో కూడా పవన్ రాజకీయ తూటాలు పేలుతాయా అనే చర్చ మొదలైంది. సినిమా అనేది తప్పకుండా బలమైన మాధ్యమం.
అందుకే పవన్ తరచుగా తన చిత్రాల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుని పెడుతూ ఉండడం చూస్తున్నాం. బ్రో మూవీలో పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ ఆసక్తికరంగా స్పందించారు. బ్రో చిత్రంలో పొలిటికల్ డైలాగ్స్ కి స్కోప్ లేదని సాయిధరమ్ తేజ్ అంటున్నాడు. 'ఉన్న ఒకే ఒక్క జీవితంలో ఈ క్షణం బతకడం ఎలా అనే కాన్సెప్ట్ చుట్టూనే బ్రో మూవీ ఉంటుంది. ఇందులో పొలిటికల్ డైలాగ్స్ కి ఆస్కారం లేదు.
నాకు తెలిసినంతవరకు బ్రో చిత్రంలో పొలిటికల్ డైలాగ్స్ కానీ, సెటైర్లు కానీ లేవు. అయితే తానింకా బ్రో కంప్లీట్ మూవీ చూడలేదని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఇక పవన్ రాజకీయ ప్రస్థానం గురించి కూడా తేజు పెదవి విప్పాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కోసం ప్రచారం చేస్తారా అని ప్రశ్నించగా.. కళ్యాణ్ గారికి నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలంతా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఈ విషయంలో కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. పూర్తిగా రాజకీయాల గురించి అవగాహనా లేకుండా రావద్దు అని చెప్పారు.
మా ఫ్యామిలిలో అందరికి ఇదే మాట చెప్పారు. అయితే కళ్యాణ్ గారు కోరితే ఏ క్షణంలో అయినా మద్దతు తెలిపేందుకు నాతో పాటు రాంచరణ్, వరుణ్, వైష్ణవ్ అంతా సిద్ధంగా ఉంటామని తేజు తేల్చేశాడు. ఇదిలా ఉండగా నేడు సాయంత్రం 6.03 గంటలకి బ్రో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.