- Home
- Entertainment
- రెట్రో లుక్‌లో మంత్రముగ్దుల్ని చేస్తున్న ముదురు భామ.. పింక్ డ్రెస్‌లో కైపెక్కించే పోజులతో సదా హాట్ షో..
రెట్రో లుక్‌లో మంత్రముగ్దుల్ని చేస్తున్న ముదురు భామ.. పింక్ డ్రెస్‌లో కైపెక్కించే పోజులతో సదా హాట్ షో..
ముదురు భామ సదా సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల కంటే టీవీ షోస్ వైపే మొగ్గుచూపుతుంది. ఆమె బుల్లితెర టార్గెట్‌గా అటు టీవీ ఆడియెన్స్ ని, ఇటు సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఆకర్షిస్తుంది.

సీనియర్ అందం సదా తరచూ గ్లామర్ పోత పోస్తూ అందాల విందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ డ్రెస్‌లో మెరిసింది. రెట్రో లుక్‌లో మతిపోగొడుతుంది. చిలిపి పోజులిస్తూ కవ్విస్తుందీ ఈ అందాల సోయగం. స్లీవ్ లెస్ టాప్‌లో అదిరిపోయే పోజులివ్వగా ఇప్పుడు ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సదా ప్రస్తుతం టీవీలో `బీబీ జోడీ` షోకి జడ్జ్ గా చేస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు జంటలుగా ఏర్పడి ఈ షోలో డాన్సులు చేస్తున్నారు. నెవర్ బిఫోర్ అనేలా డాన్సులు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. దీనికి విశేష ఆదరణ దక్కుతుంది. ఇందులో సదా ఓ వైపు జడ్జ్ గా, మరోవైపు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటుంది. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
ఈ షో కోసం ప్రతి వారం అందంగా ముస్తాబై అలరిస్తుంది. షోలో అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది. ఇప్పటికే డాన్సర్ల మనుసులు దోచుకుంది సదా. మరోవైపు తన ముద్దు ముద్దు మాటలతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు పంచుకున్న గ్లామర్ ఫోటోలు కూడా ఈ షోకి సంబంధించినవే కావడం విశేషం. ఈ రోజు(శనివారం) రాత్రి ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుంది.
ఒకప్పుడు హోమ్లీ బ్యూటీ టాలీవుడ్‌ని ఊపేసింది సదా. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసి మెప్పించింది. `జయం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ ఈ క్యూట్ బ్యూటీ. ఇందులో మన పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో నటించి మెప్పించింది.
అయితే ట్రెడిషనల్ లుక్‌కే పరిమితం కావడమా? ఆఫర్ల విషయంలో సెలక్టీవ్‌గా ఉండటమా? చిన్న సినిమాలు చేయడమా? కారణమేదైనా ఆమెకి పెద్ద ఆఫర్లు రాలేదు. ఓ మోస్తారు చిత్రాలే దక్కాయి. విజయాలు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. నితిన్‌తో చేసిన `జయం`, ఉదయ్ కిరణ్‌తో చేసిన `ఔనన్నా కాదన్నా`, చిత్రాలే ఆమెకి ఉన్నంతలో పెద్ద విజయాలు అందించాయి.
కానీ ఎన్టీఆర్‌తో నటించిన `నాగ`, మంచు మనోజ్ `దొంగ దొంగది`, ఆర్యన్ రాజేష్ `లీలా మహల్ సెంటర్`, `చుక్కల్లో చంద్రుడు`, బాలకృష్ణ `వీరభద్ర`, నితిన్ `టక్కరి`, `క్లాస్ మేట్స్` వంటి చిత్రాలు చేసినా అది బాక్సాఫీసు అవి బోల్తా కొట్టాయి. దీంతో ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గిపోయింది. తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు.
తెలుగుతోపాటు, కన్నడ, తమిళం, హిందీలోనూ అడపాదడపా చిత్రాలు చేసినా పేరు తెచ్చే చిత్రాలు, ఇమేజ్ పెంచే చిత్రాలు పడకపోవడంతో మొత్తం డౌన్ అయిపోయింది. 2015 తర్వాత ఈ బ్యూటీకి సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది సదా. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. అయితే ఇప్పుడు టీవీకే పరిమితం కావడం గమనార్హం. మరి సినిమాలు చేస్తుందా? అనేది చూడాలి.