Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Saakini Daakini Review:`శాకిని డాకిని` మూవీ రివ్యూ

Saakini Daakini Review:`శాకిని డాకిని` మూవీ రివ్యూ

నివేథా థామస్‌, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `శాకిని డాకిని`. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Aithagoni Raju | Published : Sep 16 2022, 05:18 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు ఇటీవల మంచి ఆదరణ సాధిస్తున్నాయి. బలమైన కథ ఉంటే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు మంచి ఆదరణ సాధిస్తున్నాయి. ఇటీవల సినిమాలు తగ్గి ఫేడౌట్‌గా మారిపోతున్న రెజీనా, నివేథా థామస్‌ కలిసి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `శాకిని దాకిని` చిత్రంలో నటించారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, సునీత తాటి నిర్మించారు. సక్సెస్‌ అయిన కొరియన్‌ మూవీ `మిడ్‌ నైట్‌ రన్నర్‌` చిత్రానికి రీమేక్‌. నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 16) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Saakini Daakini Review)లో తెలుసుకుందాం. 

27
Asianet Image

కథః 
షాలిని(నివేథా థామస్‌), దామిని(రెజీనా) పోలీసు ట్రైనింగ్‌ కోసం అకాడమీలో జాయిన్‌ అవుతారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అహంకారంతో గొడవలు పెట్టుకుంటారు. టామ్‌ అండ్‌ జెర్రీలా ఉండే వీరిద్దరు ఓ రోజు అర్థరాత్రి అనుకోకుండా ఓ అమ్మాయిని కిడ్నాప్ ని చూస్తారు. వాళ్లిద్దరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా విఫలమవుతారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లంతా మరో ఓ పెద్ద కేసులో బిజీగా ఉంటారు. దీంతో ఈ కేసుని లైట్‌ తీసుకుంటారు. ఇక లాభం లేదని భావించిన షాలిని, దామిని ఇద్దరు కలిసి అనధికారికంగా ఎంక్వైరీ చేస్తుంటారు. అందులో కేసు వెనకాల పెద్ద క్రైమ్ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు. మరి ఆ కేసుని ఎలా ఛేదించారు? ఆ కేసు వెనకాల ఉన్న క్రైమేంటి? ఎప్పుడూ గొడవలు పడే షాలిని, దామిని ఎలా కలిశారు? అనేది మిగిలిన సినిమా. 
 

37
Asianet Image

విశ్లేషణః 
క్రైమ్‌,ఇన్వెస్టిగేషన్‌ బేస్డ్ చిత్రాలు చాలా వచ్చాయి. థ్రిల్లర్స్ లో ప్రధానంగా ఇలాంటి కథలే ఉంటాయి. కాకపోతే అవి వేగంగా, ట్విస్ట్ లు, టర్న్‌లు, అదిరిపోయే బీజీఎంతో సాగితేనే సినిమా ఆకట్టుకుంటుంది. లేదంటే టార్చర్‌గా ఉంటుంది. బోర్‌ తెప్పిస్తుంది. థియేటర్లో కూర్చొన్న ఆడియెన్స్ కి విసుగు పుట్టిస్తుంటుంది. `శాకిని డాకిని` సినిమా విషయంలో ఇదే జరిగింది. అయితే జనరల్‌గా హీరోలు ఇలాంటి కథలు చేయడం రొటీన్‌, హీరోయిన్లు చేయడం ఈ సినిమాలో కొత్త పాయింట్‌. అదే సమయంలో ఇదొక కొరియన్‌ సినిమా రీమేక్‌. కానీ రీమేక్‌ అనే ఫీలింగ్‌ లేకుండా తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసి, పూర్తి తెలుగు సినిమాగా మార్చడంలో సక్సెస్‌ అయ్యారు సుధీర్‌ వర్మ. దీంతోపాటు ఇద్దరు హీరోయిన్ల మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ సన్నివేశాలు కాస్త కామెడీని పండిస్తుంటాయి. ఇవే ఈ చిత్రానికి ప్లస్. 
 

47
Asianet Image

కానీ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌  చిత్రానికి కావాల్సిన అంశాలు మిస్‌ కావడం సినిమాకి మైనస్‌. సినిమా అసలు కథ స్టార్ట్ కావడానికి టైమ్‌ తీసుకోవడం బోర్‌ని తెప్పిస్తుంది. అమ్మాయి కిడ్నాప్‌ జరిగేంత వరకు స్లోగా సాగుతుంది. కిడ్నాప్ తో సినిమా పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికి వస్తుంది. హీరోయిన్లు విక్టిమ్‌ని కనిపెట్టే క్రమంలో ఏదో ఆసక్తికర అంశాలు వస్తాయని భావించినా అలాంటిదేమీ జరగదు, ఆ ఇన్వెస్టిగేషన్‌ కూడా రొటీన్‌గా బోరింగ్‌గా సాగుతుంటుంది. ఈ క్రైమ్‌లో బాధితులు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. వారి తాలుకూ ఎమోషన్స్ ని సరిగా ఎస్టాబ్లిష్‌ చేయకపోవడంతో ఆడియెన్స్ కథకి కనెక్ట్ కాలేక పోతుంటారు.

57
Asianet Image

ఓ సీన్‌ తర్వాత మరో సీన్‌ వస్తుంటుంది తప్పితే, ఎమోషన్స్ కనెక్ట్ కావు. దీంతో బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. చాలా సన్నివేశాల్లో లాజిక్కులకు స్కోపే లేదు. ఏ సీన్‌ ఎందుకొస్తుందో అర్థం కాదు. దీంతో ఇదొక కిచిడి సినిమాగా మారిపోయింది. రొటీన్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మూవీగా మిగిలిపోయింది. దీంతో నివేథా థామస్‌, రెజీనాలు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. 
 

67
Asianet Image

నటీనటులుః 

నివేథా థామస్‌, రెజీనా సినిమా కోసం బాగానే కష్టపడ్డారు. కామెడీ సన్నివేశాలు బాగా చేశారు. ఇద్దరు పోటీ పడ్డారు. నివేథా థామస్‌ బబ్లీ లుక్‌ బాగుంది. సుధాకర్‌రెడ్డి, రఘుబాబు, పృథ్వీల కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన పాత్రలు పరధి మేరకు ఫర్వాలేదనిపించారు.
 

77
Asianet Image

సాంకేతికం వర్గంః
దర్శకుడు సుధీర్‌ వర్మ కొరియన్‌ సినిమాని తెలుగుకి తగ్గట్టు మార్పులు చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. సీరియస్‌గా సాగే కథని వినోదాత్మకంగా మల్చడంలో సక్సెస్‌ అయ్యాడు. కానీ అంతకు మించి ఆయన ఇంకేం చేయలేకపోయాడు. దీంతో కథనం ఫ్లాట్‌గా మారిపోతుంది. సంగీతానికి స్కోప్‌ లేదు. బీజీఎం సైతం పరుగులు పెట్టించలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మాణం బాగానే ఉంది. సినిమా ఓవరాల్‌గా విఫలప్రయత్నంగా చెప్పొచ్చు. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories