- Home
- Entertainment
- Saaho Link with OG: ఓజీతో సాహో లింక్ ఇదే.. ఓజీ 2లో గూస్ బంమ్స్ తెప్పించే విషయమేంటంటే?
Saaho Link with OG: ఓజీతో సాహో లింక్ ఇదే.. ఓజీ 2లో గూస్ బంమ్స్ తెప్పించే విషయమేంటంటే?
Saaho Link with OG: పవన్ కళ్యాణ్ `ఓజీ` సినిమాకి, ప్రభాస్ `సాహో`కి లింక్ ఉందా? `ఓజీ`లో సుజీత్ ఏం చూపించాడు? `ఓజీ 2`లో ఏం చూపించబోతున్నారనేది తెలుసుకుందాం.

బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోన్న `ఓజీ`
పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో మొదటి సారి పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటం, ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఆయన పాత్ర తీరుతెన్నులు, యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వారంతా పండగా చేసుకుంటున్నారు. థియేటర్లలో అయితే అభిమానులు ఊగిపోతున్నారు. అరుపులు, ఈలలతో హోరెత్తిస్తున్నారు. చాలా మంది అభిమానులు తమ హీరోకి సాలిడ్ మూవీ ఇచ్చావని దర్శకుడు సుజీత్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు.
`ఓజీ`లో మైనస్‌లు ఇవే, కానీ
అయితే ఆద్యంతం ఎలివేషన్లతో, యాక్షన్ సీన్లతో, పూనకాలు తెప్పించే బీజీఎంతో సాగే ఈ మూవీలో కొంత మైనస్ కూడా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా లేవు. కూతురి సెంటిమెంట్, సాడ్ సీన్లని మరింత బలంగా, మరింత ఎమోషనల్‌గా చూపిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేది. ఆ విషయంలో కొంత లోటు ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో ఆ లోటు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. అయితే ఈ మైనస్ లను అన్నింటిని పటాపంచల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తనదైన ఆర్‌ఆర్‌తో పూనకాలు తెప్పించారు. ఆ ఊపులో ఈ మైనస్‌లు చిన్నవిగా మారిపోయానని చెప్పొచ్చు. వరుసగా సెలవులు ఉండటంతో `ఓజీ` బాక్సాఫీసు వద్ద రచ్చ వేరే లెవల్ ఉంటుందని చెప్పొచ్చు.
ఓజీలో సాహోతో లింక్
ఇదిలా ఉంటే ఈ మూవీకి, సుజీత్ గత మూవీ `సాహో`కి లింక్ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుజీత్ తన `సుజీత్ సినిమాటిక్ యూనివర్స్` లో భాగంగానే `ఓజీ` సినిమాని తెరకెక్కించారని అంటున్నారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి నిజంగానే `ఓజీ`కి, `సాహో`కి లింక్ ఉందా అంటే అవుననే చెప్పాలి. ఓ సీన్‌లో ఆ లింక్‌ని చూపించాడు దర్శకుడు సుజీత్. `సాహో`కి సంబంధించిన థ్రెడ్ అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కాకపోతే సినిమాలో విలన్‌కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేసే క్రమంలో ఆ లింక్‌కి సంబంధించిన సీన్‌ని చూపించారు. ఆ సీన్ లో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌ని ని చూపించారు. నరంతక్ రాయ్ నందన్‌గా కొన్ని సెకన్లపాటు ఆయన్ని, ఆయనతోపాటు లాల్‌ని కూడా పరిచయం చేశారు. నరంతక రాయ్ ఆయుధాల డీలర్ అని, ఈ మాఫియా సిండికేట్ కి ఆయన లీడర్ అని చెప్పారు. ఆ సమయంలోనే అతని కొడుకుని చూపించారు. అదే `ఓజీ`లో పూనకాలు తెప్పించే విషయం.
`సాహో`కి, ఓజీకి ఉన్న సంబంధం ఇదే
మరి `సాహో`కి `ఓజీ`లోని జాకీ ష్రాఫ్ పాత్రకి సంబంధం ఏంటనేది చూస్తే. ప్రభాస్ హీరోగా రూపొందిన `సాహో` చిత్రంలో జాకీ ష్రాఫ్ నరంతక్ రాయ్ పాత్రలో నటించారు. అతను రాయ్ గ్రూప్ హోనర్. అదే సమయంలో వాజీ సిటీ సింటికేట్‌కి ఆయన హెడ్. అయితే కొందరు మాఫియా నాయకులు కుట్ర చేసి ఆయన్ని చంపేస్తారు. ఆయన తన కొడుకుని రహస్యంగా ఉంచుతారు. సిండికేట్‌లో కొడుకు ఎవరనేది ఎవరికీ తెలియదు. తండ్రి మరణానికి కారణం ఎవరు? తమ సిండికేట్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనున్నది ఎవరనేది తెలుసుకుని వారిని క్లీన్ చేయడమే సాహోగా ప్రభాస్ చేసే పని. అందరిని లేపేసి తాను సిండికేట్ లీడర్‌గా పరిచయం కావడమే `సాహో` కథ. `ఓజీ`లో రాయ్‌ని కొన్ని సెకన్లపాటు పరిచయం చేశారు. దానికి దీనికి లింక్ చేశారు. ఆ సీన్లు వచ్చినప్పుడు థియేటర్లలో అభిమానుల అరుపులు మామూలుగా లేవని చెప్పొచ్చు. ఈ లింక్ అంటే `సాహో వర్సెస్ ఓజీ` అనేలా ఉండటం విశేషం.
`ఓజీ 2` ప్రకటన
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌ని ప్రకటించారు. `ఓజీ` మూవీ ఎండ్ కార్డ్ లో `ఓజీ 2`ని అనౌన్స్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఫ్యాన్స్ కి మతిపోయేలా చేశారు. మరి `ఓజీ 2`లో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి `ఓజీ`లో చాలా ఎలిమెంట్లని సస్పెన్స్ లో పెట్టారు. పవన్ కళ్యాణ్ జపాన్‌లో పెరిగిన అంశాలు, ఆ తర్వాత ముంబాయికి వచ్చి తిరుగులేని మాఫియా లీడర్‌గా ఎదిగిన విషయాన్ని కొన్ని సీన్లకే పరిమితం చేశారు. అదే సమయంలో ఓజాస్ గాంభీరగా ఆయనకి ప్రతి ఒక్కరు ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. కానీ ఆయా సీన్లని పూర్తి చూపించలేదు. అటు ముంబాయిలో, ఇటు నాసిక్‌లో పవన్ కళ్యాణ్ సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన సీన్లని హైడ్ చేశారు. సీఎం వచ్చి వార్నింగ్ ఇవ్వగా, ఆయనకు గతాన్ని గుర్తు చేస్తాడు పవన్. ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడం వెనక తాము సృష్టించిన రక్తపాతం ఎలాంటిదో గుర్తు చేస్తాడు. దీంతో వెంటనే సీఎంకి చెమటలు పడతాయి. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు చివర్లో తన కూతురు ఓజీ అంటే ఏంటి అని అడగ్గా, అది పెద్ద కథ అని చెబుతూ కూతురుని తీసుకుని వెళ్లిపోతుంటాడు. దీంతో సినిమా ముగుస్తుంది.
`ఓజీ 2` స్టోరీ ఇదేనా?
అయితే ఈ ఎండింగ్‌ని బట్టి చూస్తుంటే `ఓజీ 2`లో పవన్ కళ్యాణ్ ఓజీగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అక్కడ ఎదిగిన ఎపిసోడ్లని, ముంబాయిని శాసించిన తీరు, ఓజాస్ గాంభీరగా ఎదిగిన తీరుని చూపించే అవకాశం ఉంది. దీనికితోడు సీఎం రాజకీయ జర్నీలో ఓజీ పాత్ర ఏంటనేది, ఆయన సృష్టించిన రక్తపాతం ఏంటనేది రెండో పార్ట్ లో చూపించే అవకాశం ఉంది. అలాగే `సాహో` కథకి ఉన్న లింక్‌ని రివీల్ చేసే అవకాశం ఉంది. ఇలా చూస్తే `ఓజీ 2`లో కథ పెద్దగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు పవన్. కమిట్ అయిన ఈ సినిమాలు పూర్తి చేయడానికే ఆయనకు చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు ఉన్న బిజీలో ఆయన `ఓజీ2`కి టైమ్ ఇస్తాడా? చేయగలడా? అనేది సందేహంగా ఉంది. కానీ చేస్తే మాత్రం బాక్సాఫీసుకి షేక్ కావడం, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.

