అందరి ముందు సుమ పరువు తీసిన రోషన్ కనకాల.. ఆమె డ్రెస్ పై ఊహించని సెటైర్లు, వైరల్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. గత ఏడాది సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా లాంచ్ చేసింది.
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. గత ఏడాది సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా లాంచ్ చేసింది. బబుల్ గమ్ చిత్రంతో సుమ, రాజీవ్ కనకాల ముద్దుల కొడుకు రోషన్ హీరో అయ్యాడు.
అయితే బబుల్ గమ్ మూవీ పర్వాలేదనిపించే విధంగా ఆడింది. రోషన్ పెర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ సక్సెస్ ని రోషన్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది.
అయితే రీసెంట్ గా బిగ్ బాస్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా సుమ కనకాల వ్యవహరించారు. ఈ ఈవెంట్ కి రోషన్ కనకాల కూడా అతిథిగా హాజరయ్యారు.
రోషన్ కనకాల వేదికపై మాట్లాడుతూ తన తల్లిపైనే సెటైర్లు పేల్చడం వైరల్ గా మారింది. సుమ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్యాంట్ ధరించి మెరిసింది. దీనితో రోషన్ వేదికపైకి వెళ్ళగానే.. ఇక్కడ మా అమ్మ సుమ కనకాల గారు ఉండాలి.. మీరేమైనా చూశారా అని సెటైరికల్ గా ప్రశ్నించాడు. అమ్మా నువ్వేనా గుర్తు పట్టలేదు.. ప్యాంట్ నీ గెటప్ భలే ఉంది అంటూ సెటైర్లు వేశాడు.
గుర్తుపట్టలేకపోయా.. నిన్ను ఈ గెటప్ లో చూస్తే కొత్తగా అనిపించింది అని అన్నాడు. దీనితో సుమ ఇంటికి రారా నీ పని చెబుతాను.. నా డ్రెస్ పై మీ నాన్నే కామెంట్ చేయరు అని వార్నింగ్ ఇచ్చింది.
నువ్వెక్కడా దొరకవు కదా అందుకే ఇక్కడే ఉంటావని వచ్చేశా అని రోషన్ తెలిపాడు. అనంతరం సోహైల్ గురించి ప్రశంసలు కురిపించాడు. సుమ కనకాల రోషన్ బబుల్ గమ్ చిత్రం కోసం ఎంతలా కష్టపడిందో చూదాం. ప్రమోషన్స్ మొత్తం ఆమె ముందుండి చూసుకుంది.