MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమ, రాజీవ్ కనకాల విడాకుల రూమర్స్.. అమ్మా నాన్ననే అడిగేశా, రోషన్ కనకాల కామెంట్స్ 

సుమ, రాజీవ్ కనకాల విడాకుల రూమర్స్.. అమ్మా నాన్ననే అడిగేశా, రోషన్ కనకాల కామెంట్స్ 

సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 10 2023, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఇతర సినిమా కార్యక్రమాలు ఉంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాంకర్ సుమనే. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ అయితే 90 శాతం సుమనే యాంకరింగ్ చేస్తుంది. ఎక్కడ చూసినా సుమన్ కనిపిస్తుండడంపై హీరోలు, దర్శకులు ఆమెపై తరచుగా జోక్స్ వేస్తుంటారు. బుల్లితెరపై కూడా సుమ అనేక కార్యక్రమాలకు హోస్ట్ గా చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Suma Kanakala

Suma Kanakala

సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. తన కొడుకు తొలి చిత్రం కోసం సుమ కూడా వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

 

36

ఇప్పటికే విడుదలైన టీజర్ లో రోషన్, హీరోయిన్ మానస చౌదరి బోల్డ్ గా రెచ్చిపోయారు. టీజర్ కి మంచి హైప్ వచ్చింది. తాజాగా ఇంటర్వ్యూలో రోషన్ మాట్లాడుతూ చిన్నప్పుడు అమ్మతో కలసి వాణిజ్య ప్రకటనల్లో నటించేవాడిని. ఆ విధంగా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. బబుల్ గమ్ కథని నా కోసమే సిద్ధం చేయలేదు. 

46

ఆడిషన్స్ చేసిన తర్వాతే నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు అని రోషన్ కనకాల తెలిపాడు. ఆ మధ్యన సుమ, రాజీవ్ విడాకుల గురించి తరచుగా రూమర్స్ వినిపించేవి. అయితే ఆ రూమర్స్ ని సుమ, రాజీవ్ ఖండించారు. కాకపోతే సుమ, రాజీవ్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు కొన్ని పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. సుమ కూడా ఓ ఇంటర్వ్యూలో పిల్లలు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం చాలా కష్టం అని కామెంట్స్ చేసింది. 

56

అయితే ఇప్పుడు సుమ, రాజీవ్ మధ్య అంతా బాగానే ఉంది. సుమ, రాజీవ్ మధ్య విడాకుల రూమర్స్ గురించి రోషన్ ని ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. అమ్మా నాన్న విడాకుల గురించి నేను కూడా రూమర్స్ చదువుతునప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈ రూమర్స్ వచ్చినప్పుడు అమ్మా నాన్న సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. 

66

ఒకరోజు ఉండబట్టలేక ఏంటి మీరు విడాకులు తీసుకుంటున్నారా అని అడిగేశా. వారు వెంటనే ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ రా అని అడిగారు. ఆ తర్వాతే నాకు అర్థం అయింది. కొందరు ఊరికే పుకార్లు రాస్తున్నారు అని తెలిసింది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒకవేళ విడాకుల వరకు వెళితే అది మాకు ఇంట్లో తెలుస్తుందిగా అని రోషన్ ప్రశ్నించాడు. అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు అని రోషన్ క్లారిటీ ఇచ్చాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved