MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో ఆమె పెద్ద డైమండ్‌ రాణి.. స్వామివారి దర్శనానికి కూడా డబ్బులు తీసుకుంది.. రోజాపై బండ్ల గణేష్‌ వ్యాఖ్యలు

వామ్మో ఆమె పెద్ద డైమండ్‌ రాణి.. స్వామివారి దర్శనానికి కూడా డబ్బులు తీసుకుంది.. రోజాపై బండ్ల గణేష్‌ వ్యాఖ్యలు

మాజీ మంత్రి రోజాపై నిర్మాత బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్కాముల్లో ఆమె డైమండ్‌ రాణి అంటూ సెటైర్లు పేల్చాడు. మరో సంచలన ఆరోపణలు చేశాడు బండ్ల గణేష్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 18 2024, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
RK Roja

RK Roja

మాజీ మంత్రి రోజా ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆమె ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ `జబర్దస్త్` షోలోకి వస్తుందా? లేక సినిమాలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. రోజా రాజకీయాల్లోనే ఉంటుందా? సినిమాల్లోకి వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. 
 

26

ఇదిలా ఉంటే మాజీ మంత్రి రోజాపై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెని డైమండ్‌ రాణిగా అభివర్ణించాడు. స్కాములు చేయడంలో రోజా పెద్ద డైమండ్‌ రాణి అని, ఆమె స్కాములు చేసే ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఆమె గురించి తనకు బాగా తెలుసు అని, ఇలాంటి పనులు చేయడంలో ఆమె దిట్ట అంటూ కామెంట్‌ చేశాడు బండ్ల గణేష్‌. 
 

36

 బండ్ల గణేష్‌ అంటే సంచలనాలకు కేరాఫ్‌. ఆయన స్పీచ్‌ ఇస్తే స్టేజ్‌ దద్దరిల్లిపోవాల్సిందే. పవన్‌ కళ్యాణ్‌పై ఆమె చేసే కామెంట్లు యమ క్రేజీగా ఉంటాయి. ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంటాయి. బండ్ల గణేష్‌ పొగడ్తలకు నవ్వులే నవ్వులు అనేలా ఉంటుంది. పవన్‌పై తన అభిమానాన్ని ఆ రేంజ్‌లో చూపిస్తుంటాడు బండ్ల గణేష. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్‌ వచ్చింది. కొంత బేధాభిప్రాయాలు, మరికొన్ని రాజకీయాలు వీరి మధ్య గ్యాప్‌ని పెంచాయి. కానీ పవన్‌పై తన ప్రేమ, అభిమానం మాత్రం అలానే ఉందని చెప్పాలి. 

46

ఆ ప్రేమని మరోసారి చాటుకున్నాడు బండ్ల గణేష్‌. ఆయన ఇటీవల ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన విషయం తెలిసిందే. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు మా బాస్‌ కి సొంతమైందని, అది మా బాస్‌ రేంజ్‌ అని, ఇప్పుడు వచ్చిన పదవులు కూడా ఆయన రేంజ్‌ కాదు, ఆయనది వేరే రేంజ్‌, కానీ ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్ప అంటుంటారు, ఇక్కడ తగ్గాడు మా బాస్‌ అని తన అభిమానాన్ని వెల్లడించారు బండ్ల గణేష్‌. 
 

56

ఈ సందర్భంగా రోజాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌ పోటీల్లో రోజా వంద కోట్ల స్కామ్‌ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛాన్స్ చర్చలో బండ్ల గణేష్‌ పాల్గొన్నారు. రోజా మాత్రం ఈ స్కామ్‌ చేసిందని, అందులో మరో ఆలోచన లేదని వెల్లడించారు నిర్మాత. స్కాముల్లో ఆమె డైమండ్‌ రాణి అంటూ సెటైర్లు పేల్చాడు బండ్ల గణేష్‌. కేవలం వంద కోట్లు మాత్రమే కాదు ఎక్కువే స్కామ్‌ చేసి ఉంటుందని, ఆమెపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశాడు బండ్ల గణేష్‌. అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనానికి పంపినందుకు కూడా డబ్బులు వసూలు చేసేదని దుమారం రేపాడు బండ్ల గణేష్‌. ప్రస్తుతం ఈ బడా నిర్మాత వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్‌లో, అటు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

66

తనపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిందని, ఆమెకి ఎదురు చెప్పేవారు ఉండకూడదని అన్నారు. మాజీ సీఎం చుట్టూ వీరంతా చేరి ఆయన్ని మనిషి కాకుండా చేశారని, మరో అవతారంలా క్రియేట్‌ చేశారని, వాస్తవాలు తెలియకుండా చేసి ఇప్పుడు ఇంతటి పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించాడు బండ్ల గణేష్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved