- Home
- Entertainment
- Rakesh-Jordar Sujatha: బిగ్ బాస్ బ్యూటీ... జబర్ధస్త్ టీమ్ లీడర్ లవ్ ట్రాక్... పెళ్శెప్పుడంటే...?
Rakesh-Jordar Sujatha: బిగ్ బాస్ బ్యూటీ... జబర్ధస్త్ టీమ్ లీడర్ లవ్ ట్రాక్... పెళ్శెప్పుడంటే...?
ఈ మధ్య బుల్లి తెరపై ప్రేమ పక్షుల సంఖ్య పెరిగిపోయింది. కొంత మంది షోల కోసం షో చేస్తుంటే.. మరికొంత మంది సీరియస్ గానే లవ్ చేసుకుంటున్నారు. కాని ఆ సందడిలో ఎవరు రియల్ జంట.. ఎవరు ఫేక్ అనేది మాత్రం క్లారిటీ ఉండటంలేదు. రీసెంట్ గా ఓ బుల్ల తెర జంట రియల్ లవ్ ట్రాక్ బయట పడింది.

ఈ మధ్య బుల్లి తెరపై ప్రేమ పక్షుల సంఖ్య పెరిగిపోయింది. కొంత మంది షోల కోసం షో చేస్తుంటే.. మరికొంత మంది సీరియస్ గానే లవ్ చేసుకుంటున్నారు. కాని ఆ సందడిలో ఎవరు రియల్ జంట.. ఎవరు ఫేక్ అనేది మాత్రం క్లారిటీ ఉండటంలేదు. రీసెంట్ గా ఓ బుల్ల తెర జంట రియల్ లవ్ ట్రాక్ బయట పడింది.
స్మాల్ స్క్రీన్ గురింరచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మి- సుధీర్ తో మొదలెడితే.. ఇమ్మాన్యుయల్ – వర్ష, ఆది- వర్షిని ఇలా చాలా జంటలు టవీషోలలో సందడి చేస్తున్నారు. అయితే కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరు మాత్రం నిజంగానే లవ్‌లో పడుతున్నారు.
ఇప్పుడు అలాంటి జోడీనే హాట్ టాపిక్ అయ్యారు. జబర్ధస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ బ్యూటీ జోర్దార్ సుజాత.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా సార్లు జబర్ధస్త్ లో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనించారు ఈ ఇద్దరు స్టార్లు.
అయితే జబర్ధస్త్ లో వీరి విషయం అనుమానస్పదంగా అనిపించినా.. అది షోలో భాగంగానే జరుగుతున్నట్టు అందరూ భావించారు. జనాలను ఎంటర్టైన్ చేయడాని వీరిద్దరు కలిసి ఫేక్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే షోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ జంట మారిపోవడం.. అప్పుడప్పుడు సిగ్గుపడుతూ.. తుంటరి పనులతో.. అందరికి అనుమానం కలిగేలా హింట్స్ ఇచ్చారు ఈ కపుల్.
ఇక రీసెంట్ గా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేశాడు. అప్పుడే సుజాత సిగ్గుతో నవ్వేసింది త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ.. ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత.. బిగ్‌బాస్ సీజన్-4 లో తెగ హడావిడి చేసింది. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది.
ఇక రాకింగ్ రాకేష్ పష్ట్ నుంచీ జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. ఈ మధ్య రాకేష్ తో కలిసి స్కిట్‌లు పరుగులు పెట్టించింది సుజాత. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. ఈ విషయాన్ని స్కిట్స్ రూపంలో.. చెప్పే ప్రయత్నం చేసినా.. అది షో కోసమే అనుకున్నారంత.
కాని వీరిది నిజమైన ప్రేమ అని ఈ మధ్య తెలిసింది. అంతే కాదు వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం.